home page

బైజుస్ పై అంత ప్రేమ ఎందుకో?

టెండర్లు లేకుండా 500 కోట్లు ధారాదత్తం చేస్తారా?

 | 
Raghu

బీసీలంటే ఎందుకంత కోపం

దేశంలో ఎక్కడా లేని విద్యావిధానం ఏపీలోనేనా?

ఎడ్యు చెక్ టెండర్లకు ఇతర కంపెనీలను ఎందుకు ఆహ్వానించలేదు?

100 కోట్లు దాటితే రివర్స్ టెండరింగ్ అన్నారు... 500 కోట్ల టెండర్ బైజూస్ కి ఎలా కట్టబెడుతున్నారు

నూతన ఉపాధ్యాయుల నియామకం జరుగుతుందా?

ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న.. సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

దేశంలో ఎక్కడా లేని విధంగా బైజూస్ కంపెనీ ద్వారా ఒప్పందం కుదుర్చుకొని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఆన్లైన్ విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టాలనుకోవడం తీవ్ర అభ్యంతరకరమని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు అన్నారు.. బైజూస్ కంపెనీకి 500 కోట్ల రూపాయల ఎడ్యు టెక్ టెండర్ ను కట్టబెట్టాలని అనుకున్నప్పుడు,  ఇతర కంపెనీల నుంచి టెండర్లను ఎందుకు ఆహ్వానించలేదని  ప్రశ్నించారు. వంద కోట్ల రూపాయల ప్రాజెక్టుకు టెండర్లను ఆహ్వానిస్తే, రివర్స్ టెండరింగ్ కు వెళ్తామనీ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ  ఏమయిందని అని ప్రశ్నించారు.. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ... ఎడ్యు టెక్ టెండర్ల కోసం ఇతర కంపెనీలను కూడా ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ బైజూస్ కి ఇవ్వాలనుకుంటే, వారు ఎంత మంది విద్యార్థులకు ఉచితంగా విద్యను బోధిస్తారని, మిగతా వారికి ఏవిధంగా చార్జీలను వసూలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. బైజుస్ తో ఒప్పందం కుదుర్చుకున్న తరువాత, నూతన ఉపాధ్యాయుల నియామకం ఉంటుందా?, ఉండదా?? అన్న విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. అలా కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాకు నచ్చినట్టు నేనుంటా... అంటే కుదరదని, అది సినిమాలలో హీరోలకు మాత్రమే చెల్లుతుందన్నారు.. బైజుస్ తో ఒప్పందంపై ప్రమోటరే ఆశ్చర్య పడే విధంగా, రాష్ట్ర ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఇటీవల దావోస్ కు వెళ్ళిన ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి విదేశీ పెట్టుబడులను తీసుకువస్తార నీ అనుకుంటే, రాష్ట్ర  సంపదను ఇతరులకు కట్టబెడుతున్నారని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. దావోస్ లో బైజుస్ రవీంద్రన్ తో భేటీ అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇ 500 కోట్ల రూపాయల టెండర్ ను ఆయనకు కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారన్నారు. క్యాబినెట్ లో చర్చించకుండానే, బైజూస్ ప్రతిపాదించిన ప్రాజెక్టుకు ఓకే చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. విద్యాశాఖ లోని నిజాయితీపరుడైన అధికారి  రాజశేఖర్ తో కూడా ఈ ప్రాజెక్టు అమలుపై చర్చించి నట్లు లేదని రఘురామకృష్ణంరాజు అన్నారు. ఏకపక్షంగా ఈ ప్రాజెక్టును ఆమోదించి స్టాక్ మార్కెట్ లో బైజుస్ షేర్ వాల్యూ  పెరగడానికి పరోక్షంగా దోహద పడుతున్నట్లు కనిపిస్తోందని తెలిపారు.. బైజుస్ లో  ఎంతోమంది పెట్టుబడులు పెట్టారని, వారి పెట్టుబడులను తిరిగి చెల్లించడానికి ఆ కంపెనీ పబ్లిక్ ఇష్యూ కు వెళ్లనుందన్నారు. అయితే పబ్లిక్ ఇష్యూకు వెళ్లేముందు, ఆయా కంపెనీల చేతులలో ఇటువంటి ప్రాజెక్టు ఉండడం ఎంతో అవసరమని, దానిద్వారా షేర్ వాల్యూ పెరుగుతుందని తెలిపారు.. బైజూస్ కంపెనీ గురించి గతంలో పార్లమెంటులో కూడా చర్చ జరిగిందని, బైజుస్ కంపెనీ  ద్వారా ఆన్లైన్ ట్యూషన్లు చెప్పించుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల నుంచి నేరుగా బైజుస్ ఖాతాలోకి నగదు బదిలీ అవుతున్నట్లు ఆరోపణలు వినిపించాయన్నారు. ప్రపంచ ఫుట్ బాల్ టోర్నీ (ఫిఫా), క్రికెట్ టోర్నీ లకు బైజుస్ స్పాన్సర ర్ వ్యవహరిస్తోందని, బైజుస్ అనేది ఒక కమర్షియల్ సంస్థ అని, ముఖ్యమంత్రికి నచ్చింది కదా అని టెండర్ ఇవ్వడానికి లేదన్నారు..

బీసీల పార్టీ అంటూనే... బీసీ నేతలపైనే అక్రమ కేసులా?

తమది బీసీల పార్టీ అంటూనే ఉత్తరాంధ్ర నుంచి మొదలుకొని కోస్తాంధ్ర వరకు బీసీ నేతలపైనే అక్రమ కేసులను బనాయించడం ఏమిటని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. టిడిపి నేతలు అచ్చం నాయుడు, అయ్యన్నపాత్రుడు, గౌతు శిరీష, కొల్లు రవీంద్ర ల పై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. బీసీ నేతల పై మన ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తే, భవిష్యత్తులో ఏం జరగబోతుందో సుస్పష్టంగా కనిపిస్తోందన్నారు. ముఖ్యమంత్రి సమావేశాలకు బలవంతంగా డ్వాక్రా మహిళలను తీసుకొని వచ్చిన, బిర్యానీ పొట్లాలను అందజేసిన వారు ఎలా  పారిపోతున్నారో తెలిసిందేనని, దీని ద్వారా భవిష్యత్ ముఖచిత్రం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. బీసీల అంటే బలహీనవర్గాలు కాదని బ్యాక్ బోన్ అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,  సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, తమ  ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయ సాయి రెడ్డి లు, బీసీల పట్ల తీవ్ర వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకంలో 80 శాతం మంది న్యాయమూర్తులు ప్రతిపాదించిన యాదవ సామాజిక వర్గానికి చెందిన శ్రీరామచంద్రమూర్తిని కాదని, ఎర్రం రెడ్డి నాగిరెడ్డి ని నియమించడంలో అంతరార్ధం ఏమిటో అందరికీ తెలిసిందేనన్నారు.. ఉత్తరాంధ్ర యాస లో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి ప్రహరీ గోడను  కూల్చివేసేందుకు పోలీసులు చేసిన హడావుడి పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో ఇటీవల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలకు ప్రజలు పోటెత్తడం, చోడవరంలో నిర్వహించిన బహిరంగ సభలో అయ్యన్నపాత్రుడు ప్రసంగానికి అనూహ్య ఆదరణ లభించడం తోనే ఆయన ఇంటి పైకి ప్రభుత్వ పెద్దలు బుల్డోజర్ పంపినట్లు తెలుస్తోందనీ అన్నారు. కోర్టు ఆంక్షలు ఉండగానే ఇంటి ప్రహరీ కూల్చడం పై న్యాయస్థానం పోలీసులకు చివాట్లు పెట్టిందని, కోర్టు ఆలోచలను ఉల్లంఘించిన పోలీసులను తప్పకుండా జైలుకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు.. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మేరకే పోలీసులు నడుచుకుంటూ, ప్రతిపక్ష పార్టీల నేతల పై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని అన్నారు. ఇరిగేషన్ శాఖ అనుమతుల మేరకు, తహసిల్దార్  పర్యవేక్షణలో ఇంటి వాస్తు కోసమని ఆరు చదరపు గజాల స్థలాన్ని తీసుకొని ప్రహరీనీ అయ్యన్న నిర్మించడం జరిగిందన్నారు. ఒకవేళ నిజంగానే పది సెంట్లు భూమిని కబ్జా చేశాడనే అనుకుందాం... దానికి అర్ధరాత్రి, ఊరంతా విద్యుత్తు నిలిపివేసి ప్రహరి కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని అని ప్రశ్నించారు. ఒకవేళ అయ్యన్నపాత్రుడు ఇంట్లో ఉంటే, ఆయన్ని అరెస్టు చేసి, అయ్యన్నపాత్రుడు  వాడుకభాషలో చేసిన ప్రసంగం పై నిర్భయ కేసు నమోదు చేసి తనని హింసించినట్లు గానే, ఆయన్ని హింసించారని పథక రచన చేసినట్లుగా తెలుస్తోందన్నారు.. అయ్యన్న పై ఏ కేసులు పెట్టారో ప్రజలకు తెలియజేయాలన్న రఘురామకృష్ణంరాజు, తాను , అయ్యన్నపాత్రుడు పార్టీలు వేరైనా మంచి స్నేహితుల మని చెప్పుకొచ్చారు.