home page

ఉచితాలపై మోడీ లక్ష్యం ఎవరో?

ప్రతిపక్ష పార్టీల రాష్ట్రాలపైనే గురి పెట్టాడ

 | 
Modi
ఉచితం ప్రమాదకరం : మోడీ ఎవరిని టార్గెట్ చేశారు...?
ఉచిత పధకాలు దేశాన్ని కొల్లగొడుతున్నాయి. అక్కడా ఇక్కడా అని లేదు. ఎన్నికలు వస్తే చాలు మేము ఉచితంగా జనాలకు అది ఇస్తామని ఇది ఇస్తామని రాజకీయ పార్టీలు పోటీలు పడి మరీ హామీలు కుమ్మరిస్తున్నాయి. తీరా అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేక చతికిలపడుతున్నాయి. ఏపీ లాంటి చోట్ల అయితే అప్పులు కూడా చేసి మరీ ఉచితాలకు లక్షల కోట్లు ఖర్చు రాసేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఉచిత పధకాల మీద ప్రధాని నరేంద్ర మోడీ తనదైన స్టైల్ లో తాజాగా హాట్ హాట్ కామెంట్స్ చేశారు.
యూపీలో బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోడీ ఉచిత పథకాలపై తన మనసులోని మాటలను కుండబద్ధలు కొట్టారు. ఉచితం అంటూ మొదలెడితే అది దేశ అభివృద్ధికే విఘాతమని ఆయన హెచ్చరించారు.
ముఖ్యంగా యువత ఇలాంటి ఉచితాల వలలో పడరాదని ఆయన సూచించారు. దేశ ప్రగతికి ఉచితాలు గొడ్డలి పెట్టు అని ఆయన అన్నారు. స్వీట్లు మాదిరిగా ఉచిత పధకాలను పంచుకుంటూ పోవడం తగదని ఆయన స్పష్టం చేశారు.
దీన్ని బట్టి చూస్తే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు మోడీ మార్క్ హెచ్చరిక వినిపించారు అని అర్ధమవుతోంది. ఈ మధ్యనే ఉచిత పధకాల మీద కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాజకీయ పార్టీలే నిర్ణయం తీసుకోవాలని లేదా కేంద్రం చట్టం చేయాలని పేర్కొంది. అయితే రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలను కట్టడి చేసే విషయంలో చట్టం తేవడం సాధ్యపడుతుందా అన్నది కూడా ఆలోచించాలి.
ప్రజా ప్రాతినిధ్య చట్టం లో ఏ మేరకు మార్పులు చేయవచ్చు అన్నది కూడా ఆలోచించాలి. అయితే తలచుకుంటే చేయవచ్చు అని అంటున్నారు. గతంలో ఎమ్మెల్యేలు అందరికీ మంత్రి పదవులు కట్టబెట్టి తమ రాజకీయ లాభాన్ని చూసుకునే పార్టీలకు చెక్ పెట్టేలా మొత్తం సభలో ఉన్న సీట్లలో పదిహేను శాతంగా మాత్రమే మంత్రులు ఉండాలని సవరణ తెచ్చిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అలాగే ఏ రాష్ట్ర మొత్తం బడ్జెట్లో అయినా పది నుంచి పదిహేను శాతం మాత్రమే సంక్షేమానికి ఖర్చు చేయాలన్న నిబంధన తీసుకువస్తే ఉచిత హామీలకు తెర పడుతుంది అన్న వాదనలు ఉన్నాయి.
అదే టైమ్ లో ఉచిత హామీలు ఇచ్చి అప్పులు చేసి రాష్ట్రాలను గుల్ల చేసే దుర్విధానాలకు కూడా ముగింపు పలికినట్లు అవుతుంది అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ప్రధాని మోడీ ఈ కామెంట్స్ చేశారు అంటే దాని వెనక ఏదో వ్యూహం ఉండి తీరుతుంది అనే అంటున్నారు. చూడాలి మరి ఉచితాలకు మంగళం పాడితేనే దేశంలో శ్రీలంక లాంటి పరిస్థితులు రాకుండా ఉంటాయని అంటున్నారు ఆర్హ్దిక నిపుణులు.