home page

రాజ్యసభ పోటీలో మేం లేం: ఆదానీ గ్రూప్ ప్రకటన

మాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆదానీ కంపెనీ ఆరోపణ

 | 
Adani group

వైసిపి మైండ్ బ్లాక్ : బెడిసికొట్టింది

ఆంధ్రప్రదేశ్ లేదా మరే రాష్ట్రంలో జరిగే రాజ్యసభ ఎన్నికలలో తాము సీటు ఆశించటంలేదని ఆదానీ గ్రూప్ ఒక విస్పష్టంగా ప్రకటించింది. రాజ్యసభ ఎన్నికలు జరిగిన పరతి సందర్భం లో ఇటువంటి ప్రచారం చేస్తూ దేశమంతటా బురద చల్లుకుంటూ పోతున్న వైనం తమ గ్రూప్ దృష్టికి వచ్చిందని, గౌతమ్ ఆదానీ లేదా ప్రీతి ఆదానీ కానీ రాజ్యసభ సీటు కోసం ఆరాటపడటం లేదని ఆ ప్రకటన సారాంశం. 

ఇప్పుడ వైసీపి తమ అభ్యర్ధులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు సీట్లకు పోటీ జరుగుతుంది. అసెంబ్లీ లో ఉన్న సంఖ్యా బలం బట్టి నాలుగు సీట్లు వైసీపీకే దక్కుతాయి.‌ ఇందులో రెండు సీట్లను బీసీలకు కేటాయించాలని వైసిపి నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లా నుంచి బీద మస్తాన్ రావు, శ్రీ కాకుళం నుంచి కిల్లి కృపారాణి పేర్లు ఖరారైన నేపథ్యంలో మరో రెండు సీట్లకు అభ్యర్ధులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.వీటిలో ఒక సీటు విజయసాయిరెడ్డి కి ఇస్తే మరో సీటు కోసం నిరంజన్ రెడ్డి, మైహోం రామేశ్వర రావు,సినీ నటుడు అలీ పేర్లు వినిపిస్తున్నాయి. మరో రెండుమూడు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని వైసిపి నాయకులు చెబుతున్నారు.