home page

విజయనగరం సీటు బిసిలకు ఇవ్వాలి: వైఎస్ ఆర్సీపి కార్యకర్తలు

వైఎస్ ఆర్ జయంతి వేడుకలు
 | 
Pilla

వైయస్సార్ జననేతగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు
* విజయనగరాన్ని బీసీలకు కేటాయించాలి

స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానీయుడని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఎనలేని కృషి చేసి జననేతగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పిల్లా విజయకుమార్, ఆవనాపు విజయ్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు, పేదలకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని సంక్షేమ పథకాలను  రాజశేఖర్ రెడ్డి అమలు చేశారని,  ఆయన బాటలోనే  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను  అమలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 108, పింఛన్లు వంటే అనేక సంక్షేమ పథకాలను ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తూ ప్రజాభివృద్ధి కోసం పాటుపడుతున్నారని అన్నారు. స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి   విజయనగరం నియోజకవర్గాన్ని బీసీలకు కేటాయించేలా ఆయన కుమారుడైన జగన్ మోహన్ రెడ్డి మనసు మార్చేలా దీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు గాడు అప్పారావు, కోరాడ సూర్య ప్రభావతి, పొట్నూరు పద్మ, చందకు రమణలతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంది అప్పారావు, రౌతు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.