home page

నాడు-నేడు పధకం టీడీపీదే

మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటన 

 | 
ganta bonda uma
"నాడు - నేడు" పథకం టీడీపీ దే.
మీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉంది
వైసీపీ ప్లీనరీ ముగింపు స్పీచ్ లో విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు అంటూ "నాడు - నేడు" గురించి సుదీర్ఘ ఉపన్యాసం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆ పథకాన్ని సృష్టించింది, రూపకల్పన చేసింది, నిధులు తెచ్చి నిబంధనలు రూపొందించింది, పనులు ప్రారంభించింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం. అప్పటి రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రిగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద పలు సమావేశాలు నిర్వహించి ఎక్స్పర్ట్ కమిటీ ని లీడ్ చేసి పథకాన్ని అమలు చేసింది టీడీపీ ప్రభుత్వం అని సగర్వంగా చెప్పగలం. మీరు అధికారంలోకి వచ్చాక దానికి "నాడు - నేడు" అని పేరు పెట్టి అది మీ గొప్పతనం అని క్లైమ్ చేస్కోవడం మీ విచక్షణకే వదిలేస్తున్నాం. 
అలాగే పటిష్టమైన విద్యావిధానాలను రూపొందించింది టీడీపీ ప్రభుత్వం. అకడమిక్ క్యాలెండర్ ను రూపొందించి దాన్ని పటిష్టంగా అమలు చేసి అద్భుతమైన ఫలితాలను సాధించింది టీడీపీ ప్రభుత్వం. దానికి పూర్తి భిన్నంగా గత మూడేళ్లలో ఫలితాలు ఏ స్థాయికి దిగజారి పోయాయో గణాంకాలే సాక్ష్యం
మెగా డీ ఎస్ సీ ని నిర్వహించి పెద్ద యెత్తున విద్యాలయాల్లో టీచర్లను నియమించి ఉన్నత విద్యా ప్రమాణాలు కోసం అనుక్షణం పరితపించింది ఆనాటి టీడీపీ ప్రభుత్వం. కానీ దానికి పూర్తి భిన్నంగా మీరు టీచర్ల నియామకాలకు బదులు రేషనలైజేషన్ పేరుతో 8 వేల పాఠశాలలను మూసివేయడం అసహేతుకం, అసంబద్ధం. 
మీ సంస్కరణల గురించి ప్రభుత్వ ఉపాధ్యాయులను అడగండి, ఎంత దారుణంగా విద్యా వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయో తెలుస్తుంది. మీరు కీలకమైన విధాన పరమైన నిర్ణయాలను తీసుకునేప్పుడు టీచర్లను కూడా భాగస్వామ్యులను చేయండి. లేదంటే మీ పాలన పట్ల టీచర్లు ఏ స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారో అనేకసార్లు వాళ్ళే బహిరంగంగా చెప్పినా మీకు అర్దం కాకపోతే రాష్ట్రాన్ని దేవుడే రక్షించాలి....
గంటా శ్రీనివాసరావు