home page

బొబ్బిలి రాజా పుట్టిన రోజు నేడే

అన్న భోజనం తొలిసారిగా ప్రారంభం 

 | 
Anna canteen
బొబ్బిలిలో బేబినాయన పొలికేక!!
***
24న భారీ ఎత్తున జన్మదినోత్సవాలు
**
జిల్లాలో తొలిసారిగా అన్న క్యాంటీన్ ఏర్పాటు
***
ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా... బుల్లెట్ దిగిందా లేదా?... ఇప్పుడు అన్ని రంగాల్లోనూ ఇదే ట్రెండ్ నడుస్తోంది. ప్రజల నాడిని పట్టడం, వారి ఆశలకు అనుగుణంగా నడుచు
కోవడం, వారిని తమవెంట నడపడం అన్నదే ముఖ్యం. ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయాలకు వస్తే 2019 ఎన్నికల్లో మొత్తం తొమ్మిది అసెంబ్లీ స్థానాలనూ టిడిపి కోల్పోయింది . ఆఖరుకు మంత్రిగా పని చేసిన బొబ్బిలి వంశీయుడు సుజయ్ కృష్ణ రంగారావు కూడా ఓడిపోయారు అంటే పార్టీకి ఎంతటి పరాభవమో స్పష్టమవుతోంది. ఈ రెండేళ్లుగా ఎక్కడా క్యాడర్ అలికిడి లేదు. పార్టీ మొత్తం నిస్తేజంలోకి వెళ్లిపోయిం ది. ఇలాంటి కష్టకాలంలో పార్టీకి బొబ్బిలి ఇన్చార్జిగా వచ్చిన సుజయ్ సోదరుడు శ్వేతా కుమార్ రంగారావు(బేబీనాయన) తన చాణక్యంతో ఏడాదిలోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సగానికి మించి సర్పంచు పదవులు, ఎంపీటీసీ లు, జడ్పీటీసీలు, బొబ్బిలి మున్సిపాల్టీలో మంచి స్కోరు సాధించి నియోజకవర్గంలో తన బలం ఏమిటో నిరూపించుకున్నారు. హేమాహేమీలు పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, చంద్రబాబు, మాజీ మంత్రులు, ఎంపీలకు సాధ్యం కాని ఫలితాలు సాధించి బొబ్బిలి కోటలో తన స్థానాన్ని బేబీనాయన పదిలపర్చుకున్నారు. ఇక ఇప్పుడిప్పుడే ఎన్నికల వేడి మొదలవుతున్న ఈ తరుణంలో ఆయన తొలిసారిగా సొంత నిధులతో అన్న క్యాంటీన్ను ఏర్పాటు చేస్తున్నారు. అన్నార్తులకు ఐదురూపాయలకే కడుపునిండా భోజనం పెట్టే కార్యక్రమానికి తన పుట్టినరోజునాడు (జూన్ 24న) శ్రీకారం చుట్టనున్నారు. ఇదిలా ఉండగా అక్కడి వైఎసాస్సార్సీపీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు ఇప్పటికే అపఖ్యాతిని, అసమర్ధతను మూటగట్టుకుని ఆ భారాన్ని మోయలేక కుంటుతూ పదవిని ఈడుస్తున్నారు. ఇక ఎప్పుడు ఎన్నికలు జరిగినా శంబంగి ఓటమికి సిద్ధంగా ఉండాల్సిందేనని క్యాడర్ ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. ఏటా బేబినాయన 
పుట్టిన రోజున వందలాది మందికి భోజనాలు పెట్టడం , పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిం చడం అనవాయితీగా వస్తోంది. ఈ తరుణంలో ఆయన మరోసారి ఈ ప్రాంతంలో తన పట్టును, తన ప్రాబల్యాన్ని ప్రపంచానికి చూపనున్నారు. జిల్లాలో ఏఏ స్థానాల ఫలితాలు ఎలాగైనా ఉండనీ కానీ బొబ్బిలి కోటమీద ఈసారి తెలుగుదేశం జెండా ఎగరడాన్ని ఎవరూ ఆపలేరని వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలే బాహాటంగా చెబుతున్నారంటే అక్కడ పరిస్థితి, ప్రజల్లో బేబీనాయన ఇమేజి ఎలా ఉందో స్పష్టమవుతోంది. ఈనెల 24న కోటలో వేలాది మంది సమక్షంలో జరిగే బేబీనాయన పుట్టినరోజు ప్రజల్లోని ఓ బలమైన మెసేజిని పంపనున్నారు. ఇదే సందర్భంగా ప్రముఖ వైద్యులచే భారీ ఎత్తున వైద్య శిబిరం, రక్తదానాలు ఇవన్నీ ఉండేవే. ఇన్నాళ్లూ ఒకెత్తు ఇప్పుడు బేబీనాయన వచ్చాక ఇక్కడ రాజకీయాలు ఇంకో ఎత్తు అన్నట్లుగా అక్కడి పరిస్థితి మారింది...