home page

స్పర్ధలున్నాయి ... సర్దుకు పోండి

ప్లీనరీ సమావేశంలో మంత్రి సత్తిబాబు 

 | 
సత్తిబాబు

ఎంపీ బెల్లాన, బొత్స కార్యకర్తలకు పొసగని పొత్తు 

కొట్టుకోకర్రా.... కూకొని మాటాడుకోండి.!!
***
స్పర్థలున్నాయ్..సర్దుకుపోండి
***
అంగీకరించిన సత్తిబాబు
నిన్న బాలినేని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేడు బొత్స
అధికార పార్టీ అయినంతమాత్రాత అందరూ కలిసికట్టుగా ఉండాలని రూలేం లేదు. అసలు అధికారం, పవర్ ఉన్న చోటనే గ్రూపులు, తద్వారా గొడవలు ఉంటాయి. పోనీ చిన్నా చితకా లీడర్లకు ఈ సమస్యలు ఎదురయ్యాయంటే అర్థం ఉంది. కానీ కాకలు తీరి న పెద్దలు బాలినేని శ్రీనివాసరెడ్డి, బొత్స సత్యనారాయణ వంటివాళ్లే ఇలా అంటున్నారు. అంటే పార్టీ లోలోన ఏదో తేడాగా ఉన్నటే. తనపై ఇద్దరు పెద్దలు కుట్ర చేస్తున్నారని ఒంగోలు నేత బాలినేని ఆక్రోశం వెళ్లగక్కారు. ఆ పక్క జిల్లా నెల్లూరుకు చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం తనపట్ల అసమ్మతి మొదలైందని, తనను కింది స్థాయి నాయకులు ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. ఇక ఇప్పుడు చీపురుపల్లి నుంచి గెలిచిన మంత్రి బొత్స సత్యనారాయణ సైతం ప్లీనరీలో మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకులు కొట్టుకోకర్రా.... కూకొని మాట్లాడుకొండి.. స్పర్ధలున్నాయ్.. సర్దుకుపొండి అని సూచిస్తున్నారు. బొత్సకు విజయనగరం జిల్లా అంతా కొట్టిన పిండి.. ఏ ఊళ్లో చీమ చిటుక్కుమన్నా తక్కువ తెలుస్తుంది. అలాంటిది తన నియోజకవర్గంలోనే కార్యకర్తలు, నాయకుల మధ్య సమన్వయం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం అవుతోంది. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సైతం చీపురుపల్లికి చెందిన వారే. స్థానికంగా ఉంటారు. 
ఆయనకూ సొంత క్యాడర్... వర్గం ఉంది.. ఆయన తరపున తమమాట చెల్లించుకోవాలని ఆయన వర్గమూ భావిస్తుంది. అదే ఊళ్లో బొత్స టీమ్ పెత్తనం కోసం చూస్తుంది. అ నివార్యంగా ఇరువర్గాల మధ్య స్పర్థలూ మొదలవుతాయ్... ఇది బొత్సకు కాస్త తలనొప్పి గా మారుతున్న తరుణంలో ఆయన కాస్త చికాకు పడుతూ గొల్లుపెట్టకర్రా సర్దుకుపొండ ర్రా అని ప్లీనరీలోనే చెప్పేశారు. ఇంకా ఓ అడుగు ముందుకు వేసి సొంతంగా నిర్ణయాలు తీసేసుకుంటే ఎలా.. అందరితో కలిసి మాట్లాడి సమష్టిగా ముందుకు వెళ్లాలని ఎంపీకి అర్థం అయ్యేలా కాస్త స్ట్రాంగ్ గా సూచించారు.
ఇదే తరుణంలో ఆయన 1998 డీఎస్సీలో సెలెక్ట్ అయి మొన్న ఉద్యోగాలు పొందిన టీచర్ల విషయంలోనూ కాస్త అసంతృప్తిగా మాట్లాడారు. దాదాపు 50 ఏళ్లు పైబడిన వయస్సులో ఉద్యోగాలు వచ్చాయి. వాళ్లు ఇప్పుడు పిల్లలకు ఏమి పాఠాలు చెబుతారు. వాళ్లను ఎక్కడ ఎలా వినియోగించుకోవాలో తెలియడం లేద 3. వాళ్లకు మళ్లీ శిక్షణ ఇచ్చి పోస్టింగ్స్ ఇస్తాం అని సత్తిబాబు అన్నారు.