home page

భారత దేశంలో రుణం పొందని వాళ్ళు 48 కోట్ల మంది

సిబిల్ అధ్యయనం లో వెల్లడి

 | 
Loans

దేశంలో రుణం పొందని వాళ్ళు 48 కోట్ల మంది

న్యూఢిల్లీ: సంపాదన విభాగంలో మొత్తం జనాభాలో సగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు 48 కోట్ల మంది భారతీయులు 65 ఏళ్ల వయస్సు వరకు ఎటువంటి రుణ సదుపాయం పొందలేదని (క్రెడిట్‌ అన్‌ సర్వర్డ్‌) క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీ- సిబిల్‌ ఒక నివేదికలో పేర్కొంది.

ఇక సిబిల్‌ ప్రపంచ అధ్యయనంలో అదనంగా 16.4 కోట్ల మంది 'క్రెడిట్‌ అన్‌ సర్వర్డ్‌''గా ఉన్నారు. 17.9 కోట్ల మంది మాత్రమే 'క్రెడిట్‌ సర్వ్‌' కేటగిరీలో ఉన్నారు. సిబిల్‌ నివేదికలోని మరికొన్ని ఆసక్తికరమైన అంశాలను పరిశీలిస్తే...

►రుణగ్రహీతలు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా ఉండేలా దేశంలో రుణ సంస్కృతిని మరింతగా పెంచేందుకు పాలసీ యంత్రాంగం ప్రత్యేక ప్రయత్నాలు చేస్తోంది. 45 కోట్లకుపైగా ఖాతాలను ప్రారంభించిన జన్‌ ధన్‌ యోజన క్రెడిట్‌ ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యం అందిస్తోంది.

►అమెరికా విషయానికి వస్తే, పెద్దల్లో కేవలం 3 శాతం మందికి మాత్రమే క్రెడిట్‌ సౌలభ్యం అందలేదు. ఈ సంఖ్య కెనడాలో 7 శాతం, కొలంబియాలో 44 శాతం, దక్షిణాఫ్రికాలో 51 శాతం ఉంది.

►రుణ సదుపాయం కలిగించే విషయంలో కొన్ని కీలక అవరోధాలు ఎదురవుతున్నాయి. వినియోగదారులకు క్రెడిట్‌ స్కోర్, క్రెడిట్‌ చరిత్ర లేకపోవడం రుణ అవకాశాలను పొందడానికి ప్రతిబంధకంగా ఉంది. ఆయా వినియోగదారులకు చాలా మంది రుణదాతలు రుణాలు అందించడానికి వెనుకాడుతున్నారు.

►ఒక్కసారి రుణం తీసుకోవడం ప్రారంభమైతే, అటు తర్వాత ఈ విషయంలో 'రెండేళ్ల పరిధిలోకి' క్రియాశీలంగా ఉండే వారు 5 శాతం.

రుణం.. మరింత విస్తృతమవ్వాలి
ఇటీవలి సంవత్సరాలలో దేశవ్యాప్తంగా అన్ని స్థాయిల్లో రుణ లభ్యత పెంచే విషయంలో భారత్‌ గొప్ప పురోగతిని సాధించింది. అయినప్పటికీ, ప్రస్తుత వాస్తవికత రుణ వ్యవస్థను పరిశీలిస్తే, రుణం సౌలభ్యం మరింత విస్తృతం కావాలి. తమకు ఎటువంటి రుణ సదుపాయం అందడం లేదనే పెద్దల సంఖ్య తగ్గాలి''- రాజేష్‌ కుమార్, సిబిల్‌ ఎండీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌