home page

మూడోసారీ డిపాజిట్ దక్కలేదు

ఆంధ్రప్రదేశ్ లో వాడిన కమలం

 | 
Bjp
డిపాజిట్ కూడా రాలేదేంటమ్మా!
మూడోసారీ అదే ఫలితం సాధించిన బిజేపి
ఆత్మకూరులో వైసీపీ ఘనవిజయం
ఊరుకున్నంత ఉత్తమం లేదు... బోడిగుండంత సుఖం లేదన్న సామెత బిజేపీ వాళ్లకు
అర్ధం అయినట్లు లేదు.
పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం కారణంగా ఖాళీ అయిన నెల్లూరు జి ల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఎలా వస్తా యన్నది అందరూ ఊహించిందే. కానీ మాట్లాడుకోక తప్పదు కాబట్టి రెండు ముక్కలు అనుకుందాం. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి 102240 ఓ ట్లు సాధించారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఎన్నికలకు దూరంగా ఉండగా జాతీ య పార్టీ బీజేపీ మాత్రం బరిలో నిలిచి19252 ఓట్లు సాధించింది. డిపాజిట్ దక్కాలి. అంటే 22,840 ఓట్లు రావాలి కానీ అంతకు ఆమడదూరంలోనే బీజేపి ఆగిపోయింది. బీఎస్సీకి 4897 ఓట్లు, నోటాకు 179 ఓట్లు వచ్చాయి. ఫైనల్గా విక్రమ్ రెడ్డి 82,888 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇదిలా ఉండగా రాష్ట్రరాజకీయాలు శాసిస్తామని, భూమి ఆకాశం ఏకం చేస్తామని తరచూ ప్రగల్భాలు పలికే బిజేపీకి ఎక్కడ పోటీ చేసినా డిపా జిట్లు కూడా దక్కే పరిస్థితి లేదని మరోమారు స్పష్టమైంది.
ఈ ప్రభుత్వం హయాంలో జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లోను, కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లోనూ బీజేపీ డిపాజిట్లు కోల్పోయింది. బి. దుర్గాప్రసాద్ మరణం కారణంగా ఏర్పడి తిరుపతి ఎంపీ సీటుకు 2021 ఏప్రిల్ 17న జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎం. గురుమూర్తి 2,71,592 ఓట్ల మెజారిటీతో గెలు పొందారు. ఆ ఎన్నికల్లో గురుమూర్తి 6,26,108 ఓట్లు సాధించగా టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మి 3,54,516 ఓట్లు సాధించారు. ఇక బీజేపీ నుంచి పోటీ చేసిన కర్నాటక మాజీ ఛీప్ సెక్రటరీ 57,018 ఓట్లు తెచ్చుకున్నారు. అంటే డిపాజిట్లకు ఆమడ దూరంలో ఆగిపోయారన్నమాట. ఇక ముచ్చటగా మూడో ఎన్నిక అయిన 
 బద్వేలులో సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య' అకాల మరణం కారణంగా ఖాళీ అయిన స్థానానికి 2021, అక్టోబర్ 30న ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో దివంగత ఎమ్మెల్యే భార్య సుధ 90,533 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బిజెపి నుంచి పోటీ చేసిన పి. సురేష్ 21,678 ఓట్లు సాధించి నా డిపాజిట్లు కోల్పోయారు. ఈ ఎన్నికలకు టిడిపి దూరంగా ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ 6235 ఓట్లు సాధించారు. వాస్తవానికి సిట్టింగ్ అభ్యర్థి మరణం కారణంగా జరిగిన ఉప ఎన్నికల్లో ఆ కుటుంబం అభ్యర్థికి నైతికంగా మద్దతుగా నిలిచి విజయాని కి సహకరించాలి తప్ప వేరే పార్టీ వారు పోటీలో ఉండకూడదన్నది ఏపిలో ఓ అనధికార నిబంధన అమలవుతూ వస్తోంది. కానీ బిజేపీ మాత్రం ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈ నిబంధనతో సంబంధం లేకుండా పోటీ చేయడం, డిపాజిట్లు కోల్పోయి బిక్కమొహం వేసుకుని నిలబడడం పరిపాటిగా మారింది.