home page

ప్లీనరీలు లేవట....మరేటి సేసేది

వైసిపి నేతల్లో వర్గపోరు

 | 
ప్రతి మహిళ సెల్ ఫోన్ లో దిశ యాప్ ఉండాలి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్

టెక్కలి, ఇచ్ఛాపురం ప్లీనరీలకు మంగళం

ప్లీనరీలు లేవట.. మరేటి సేత్తామ్!!

**
అధికార పార్టీలో వర్గ తగాదాలు!!

**
టెక్కలి, ఇచ్చాపురంలో ప్లీనరీలకు మంగళం


*******
మొత్తానికి నాయకులు, కార్యకర్తలు కొట్టుకుని ప్లీనరీలు పెట్టకుండా ఎగ్గొడతారా.. ఇదేట్రా

పద్ధతి... పాడు ఉండక్కర్లా.. కాస్త ఆలోచించండి..తరువాత పార్టీ పెద్దలతో చీవాట్లు తినకుండా ఉండాలంటే ఏదోటి చేయర్రా అని సీమియర్ మంత్రి బొత్స సత్యనారాయణ క్లాస్ తీసుకున్నారు.. లేపోతే అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీ ప్లీనరీ లేకపోతే ఎలా మరి..
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజక వర్గ ప్లీనరీ సమావేశాలు, గడపగడపకు మన ప్రభుత్వం వంటి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. దాదాపు అన్ని  నియోజకవర్గాల్లోనూ నాయకుల సందడి కనిపిస్తున్నా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం,టెక్కలి నియోజకవర్గాల్లో మాత్రం నాయకులు ఈ బాధ లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. వాళ్లకు ప్లీనరీ ఆలోచనే లేకపోయింది 
జిల్లాల్లో
 ప్లీనరీ జరుపుకుని ఈ నెల 8,9 తేదీల్లో గుంటూరులో జరిగే రాష్ట్ర  ప్లీనరీకి వెళ్లే ఏర్పాట్లలో అన్ని జిల్లాల నాయకులూ ఉండగా ఈ రెండు చోట్లా నాయకులు గంమ్మున ఉంటున్నారు. ఈ విషయం పార్ట్ సీనియర్ నాయకుడు,మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి రాగా,  ఈయన వారితో మాట్లాడి సర్దుబాటు చేసే యత్నాల్లో ఉన్నారు.. 
వాస్తవానికి 2019అసెంబ్లీ ఎన్నికల్లో  రాష్ట్రం మొత్తం  వైఎస్సార్ కాంగ్రెస్ జోరు కొనసాగినా  టెక్కలిలో అచ్చెన్నాయుడు, ఇచ్చాపురంలో బి. అశోక్ ఈ ఇద్దరూ టిడిపి తరఫున గెలిచారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ ను జగన్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి టెక్కలి ఇంచార్జ్ గా నియమించగా ఇచ్చాపురంలో ఓడిపోయిన సాయిరాజును అక్కడే ఇంచార్జ్ గా బాధ్యతలు అప్పగించారు. సాయిరాజు భార్య విజయకు శ్రీకాకుళం జడ్పి చైర్మన్ గా అవకాశం ఇచ్చారు. అయితే ఈ ఇద్దరూ స్థానిక మండల నాయకులతో సమన్వయం చేసుకోలేకపోవడం, జిల్లాలోని ఇతర నాయకులను సంప్రదించకపోవడం, తమ పరిధిలోని మండలాల నేతల మధ్య గ్రూపు తగదాలకు వీల్లే ఆజ్యం పోస్తూ పబ్బం గడుపుతూ వస్తున్నారు. వీరి తీరుతో విసిగిపోయిన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, మండల పరిషత్ చైర్మన్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా..ఆంటీ ముట్టనట్లు ఉంటున్నారు. మండల, గ్రామ స్థాయి రాజకీయాల్లోనూ పెద్దనాయకులు దూరిపోతూ వారి ఆటను కూడా వీల్లే ఆడేస్తుండడంతో వారికి చిర్రెత్తింది.. ఇప్పటికే తమకు అధికారాలు, విధులు ఏమీ లేవని బాధపడుతున్న తరుణంలో తమ ఉనికిని కూడా ప్రశ్నార్థకం చేస్తున్న పార్టీ పెద్దల పట్ల వారు కినుక వహిస్తూ ప్లీనరీ లేదు..గీనరీ లేదని ఊరుకుండిపోయారు.. ఈలోపు బొత్స సత్తిబాబు విషయం తెలుసుకుని పరిస్థితి సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు..