రెడ్లు కూడా ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటున్నారు
మంత్రి నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు
Mon, 18 Apr 2022
| 
నడిచే దేవుడు జగన్మోహన్ రెడ్డి
అమరావతి: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో నడిచేది ఇది రెడ్ల రాజ్యం కాదని,ఇది బడుగుల రాజ్యమని నారాయణ స్వామి పేర్కొన్నారు. రాష్ట్రంలో రెడ్లు తాము కూడా ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటున్నారని నారాయణ స్వామి పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో మంత్రి గా నారాయణ స్వామి బాధ్యతలు స్వీకరించారు. మొదటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని చేత పట్టుకొని కార్యాలయంలో కి ప్రవేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర చరిత్ర లో బడుగు వర్గాలకు రాజ్యాధికారం కట్టబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి దేనని, అందువల్ల తనకు జగన్మోహన్ రెడ్డి దేవుడితో సమానమని పేర్కొన్నారు.