home page

అగ్గి రాజేసిన మరదలు

శ్రీ వాణిపై అవినీతి ఆరోపణలు చేసిన పల్లవి  

 | 
Satrucharla

అగ్గి రాజేసిన మరదలు !!
***
వదిన పుష్ప శ్రీవాణి పై మరదలు పల్లవి ఎదురుదాడి
**
ఏకులా వచ్చి మేకయ్యారు... అసలు మీది ఏ ఊరు.. మా ఊరు ఎలా వచ్చారు.. ఎలా గెలిచారు.. ఎవరి చలవతో గెలిచారు...ఇదంతా నీ గొప్పతనం కాదు.. మా తండ్రిగారు దివంగత చంద్రశేఖర్ రాజు కష్టం..రాళ్లు .. రప్పలు.. కొండలు..గుట్టలు ఎక్కి మీకోసం శ్రమించారు.. అలాంటి వ్యక్తిని మీరేం చేశారు.. ఎంత క్షోభ పెట్టారు.. అంటూ మాజీ మంత్రి, కురుపాం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి మీద ఆమె ఆడపడుచు పల్లవి రాజు ధ్వజమెత్తారు.. . మొత్తానికి ఇన్నాళ్లూ ఇష్టానుసారం అధికారం చేలాయించిన శ్రీవాణికి సొంత కుటుంబంలోనే  కుంపటి మొదలైంది.. ఆదివారం టిడిపి నాయకురాలు, దివంగత చంద్రశేఖర్ రాజు కుమార్తె పల్లవిరాజు, ఇంకొందరు టిడిపి నాయకులు విలేకర్లతో మాట్లాడుతూ  శ్రీవాణి మంత్రిగా చేసిన అవినీతి అక్రమాలను వెల్లడించారు..
ఇంకా వారు ఏమన్నారంటే...

ఇటీవల కురుపాంలో జరిగిన ప్లీనరీ సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి,కురుపాం శాసన సభ్యురాలు పుష్పశ్రీవాణి విసిరిన సవాల్ కు పుష్పశ్రీవాణి ఆడపడుచు శత్రుచర్ల పల్లవిరాజు , పెద్ద మామ ఎం.ఎల్.సి శత్రుచర్ల విజయరామరాజు,నియోజకవర్గ పరిశీలికుడు పుచ్చా విజయ్ కుమార్ ప్రతీ సవాల్ విసిరారు...

విజయరామాజు, పల్లవి రాజు,విజయ్ కుమార్ వేరు వేరుగా మీడియాతో మాట్లాడారు..
 
ముందుగా కోమరాడ 
లో విజయ్ కుమార్ మాట్లాడగా కురుపాం లో 
 శత్రుచర్ల పల్లవిరాజు, చినమేరంగిలో విజయరామాజు మాట్లాడుతూ  పుష్పశ్రీవాణి పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 

మీరు అభివృద్ధి చేసాం అని చెప్పుకుంటున్నప్పుడు గడపగడపకు భయపడి ఎందుకు వెళ్తున్నారు.

పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణ పనులు పూర్తిచేయక, ఏనుగులు 4 సంవత్సరాలుగా తిరుగుతున్న తరలించడంలో విఫలమై మీరు సవాల్ విసురుతారా  మీకు సిగ్గుందా అసలు అని పుష్ప శ్రీవాణిపై మండిపడ్డారు.
ఐటిడిఏ నిధులతో గోడ కట్టుకుని నువ్వు నీతులు చెప్తావా. అభివృద్ధి పై, ఆస్తులపై చర్చకు నేను రెడీ. మీ దొంగ ఛానల్ సాక్షికి పిలిచిన, లేదా ఏ ఛానల్ కు పిలుచుకున్న ఆన్ పేపర్ తో వస్తా మీరు రేడినా అని పుచ్చా విజయ్ కుమార్ సవాల్ విసిరారు

పల్లవి రాజు మాట్లాడుతూ మా నాన్న చంద్రశేఖర్ రాజు పుణ్యమా అని నీవు గెలుపొందావు....500 కోట్లు కాదు 5 కోట్లు ఉన్నాయి అని నిరూపించండి రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నావుగా నీవు సంపాదించిన ఆస్తులు వివరాలు పై మన కుల దైవం ముందు ప్రమాణం చేస్తావా.... ఆస్తులు కోసం ఎక్కడకి రమ్మన్న ఆధారాలతో మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నా ... రా దమ్ముంటే  గడప గడపకు కార్యక్రమంలో ప్రజలు మీకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై కేసులు పెడతారా...ఏమి రౌడియిజం చేస్తున్నారా.. వచ్చే ఎన్నికల్లో నీకు ప్రజలు బుద్దిచెప్పి ఇంటికి పంపిస్తారు... వేచి చూడు అన్నారు..

ఇక సీనియర్ నేత విజయరామరాజు ఏమన్నారంటే
 పుష్పశ్రీవాణి 500 కోట్లు కాదు అంతకు మించి ఆస్తులు సంపాదించారు. సవాల్ కి ప్రతి సవాల్ విసురుతున్నాం మా దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయి మేము సిద్దాం... ఎన్నికలు ఎప్పుడు జరిగిన తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది వైకాపా ను  తొక్కేస్తాం ....

టీడీపీ ఇన్చార్జి జగదీశ్వరి వైసీపీ పై విరుచుకుపడింది...

40 సంవత్సరాలు విజయరామరాజు గారి సమక్షంలో గౌరవ ప్రదమైన నీతివంతమైన రాజకీయాలు చేస్తున్నాం...

2013లో పుష్పశ్రీవాణి అంటే కురుపాం నియోజవర్గంలో ఎవరికి తెలుసు???నువ్వు శత్రుచర్ల అనే బ్రాండ్ మీద గెలిచావు...

సవాల్ కాదు ముందు కురుపాం నియోజకవర్గ అభివృద్ధి పై శ్వేతపత్రం విడుదల చెయ్యండి...
 
ఇసుక యథేచ్ఛగా ఇష్టానుసారంగా దోపిడీ జరుగుతున్నా ఎందుకు నోరు మేదపట్లే...?

విజయరామరాజు హయాంలో నియోజకవర్గంలో ఏనుగులను నెల రోజుల్లో తరలించం ఇప్పుడు ఏనుగుల గుంపు వచ్చి 4 ఏళ్ళు అవుతున్న వేల ఎకరాల పంట నష్టం,ప్రాణ నష్టం నిత్యం జరుగుతుంది ఏమి చేస్తున్నారు....

విజయరామరాజు హయాంలో పూర్ణపాడు లాబేసు వంతెన 70% పనులు పూర్తి చేశారు.అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు ఆ పనులే అలా పడి ఉన్నాయి..మీరు ఇన్నాళ్లలో చేసిందేం లేదు..
గడపగడపకు వెళ్తుంటే టీడీపీ పనిగట్టుకొని అడ్డుకుంటుంది అంటున్నారు మేమే అలా అడ్డుకోవాలి అనుకుంటే మా విజయరామరాజు గారు మా నాయకుల్ని మాజీ సర్పంచ్ లను, ఒక్క ఆదేశం ఇస్తే మీరు తిరగలేరు. మీ పార్టీ వాళ్లే వాళ్ళ సమస్యలపై ఎదురు తిరిగితే సమాధానం చెప్పుకోలేక మాపై నిందలు వేస్తున్నారు అని ధ్వజమెత్తారు......