home page

పోలవరం వద్ద శివలింగం

మేఘా ఇంజనీరింగ్ తవ్వకాల్లో బయటపడిన వైనం

 | 
శివలింగం

గట్టుకు చేర్చిన కంపెనీ సిబ్బంది

అమరావతి : పోలవరం ప్రాజెక్టు వద్ద ఓ శివలింగం బయటపడింది. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులోని స్పిల్‌వే ఎగువన అప్రోచ్ చానల్‌లో భాగంగా మేఘా ఇంజినీరింగ్ కంపెనీ మట్టి తవ్వకాలు చేపట్టింది.

ఈ క్రమంలో బుధవారం ప్రాజెక్టు నిర్వాసిత పాత పైడిపాక గ్రామంలోని గోదావరి ఒడ్డున భూగర్భంలో ఇటుకలతో నిర్మించిన పురాతన నిర్మాణం ఒకటి జేసీబీకి తగలింది. దాంతో ఆపరేటర్లు గట్టిగా లాగడంతో శివలింగం బయటపడింది. విగ్రహాన్ని బయటకు తీసి గట్టుపై పెట్టి గోదావరి జలాలతో అభిషేకించారు. శివలింగాన్ని అక్కడే ఉంచి తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఈ శివలింగం శతాబ్దాల కాలం నాటిదిగా భావిస్తున్నారు.