home page

మరో ఆరు నెలలు సిఎస్ గా సమీర్ శర్మే కొనసాగింపు

కేంద్రానికి సిఎం లేఖ

 | 
సీఎం

జవహర్ రెడ్డి కి చెక్ పెట్టవచ్చు

పదవీకాలం పొడిగించాలని కేంద్రానికి సీఎం జగన్‌ లేఖ!

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ పదవీకాలాన్ని మరో ఆరు నెలల పా టు పొడిగించాలని కోరుతూ కేంద్రానికి సీఎం జగ న్‌ లేఖ రాసినట్లు తెలుస్తోంది.

నవంబరులోనే ఆయన పదవీకాలం ముగియగా ఆరు నెలల పా టు పొడిగించారు. ఆ పొడిగింపు మే నెలాఖరుతో ముగుస్తుంది. ఆయన సేవలు రాష్ర్టానికి ఇంకా అవసరమని, మరోసారి పొడిగించాలని లేఖలో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా సీఎ్‌సలకు ఆరు నెలలకు మించి పొడిగింపు ఇవ్వరు.

గతంలో సీఎస్‌ నీలం సాహ్నికి మూడు నెలల చొప్పున రెండు విడతలుగా పొడిగింపు ఇచ్చారు. కానీ సమీర్‌ శర్మకు మొదట ఒకేసారి ఆరు నెలలు పొడిగింపు దక్కింది. ఈ నేపథ్యంలో ఆయన పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించాలన్న తాజా విజ్ఞప్తిని కేంద్రం ఆమోదిస్తుందా? లేదా?

అన్నది చూడాలి. గతంలో ఒకే ఒక్కసారి కాకి మాధవరావు పదవీకాలాన్ని ఏడాది పొడిగించారు. కాగా, సమీర్‌ శర్మ మేలో రిటైర్‌ అయి తే జవహర్‌రెడ్డిని సీఎస్‌ చేస్తారని విస్తృత ప్రచారం జరిగింది. అయితే, జవహర్‌రెడ్డికి చెక్‌ పెడుతూ సమీర్‌ శర్మను కొనసాగించేలా సీఎం లేఖ రాయ డం పలు రకాల చర్చలకు దారితీస్తోంది.