home page

'రావిశాస్త్రి రచనలను సాహిత్య అకాడమీ భద్రం చేయాలి'

31 నవిశాఖలో రావిశాస్త్రి శతజయంతి సదస్సు 

 | 
Ravisastry
ఇది రాచకొండ స్మరణ లో విశాఖ పులకిస్తున్న సమయం.  అసలే అసమానధీరుడు , అనితరసాధ్యడు తనకే సాద్యమైన శైలీ విన్యాసంతో ఉత్తరాంధ్ర మాండలీకాన్ని అజరామరంచేసిన వాడు , తన తర్వాత ఎవరు రచనలు చేసినా తన ప్రభావ మహాకెరటం ఉదృతి నుంచి తప్పించు కోలేనంతగా మాయచేసిన సముద్రమంతవాడు , మన రాచకొండ వారు. ఇది ఆయన శతజయంతి ఉత్సవ సమయం. ఈరోజు జరిగిన సాహిత్య అకాడమీ మిత్రసాహితి ల రావిశాస్త్రి జయంతి ఉత్సవం ప్రారంభ సమావేశం దిిిి
శివారెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగింది.
రావిశాస్ర్తి పాత్రల స్వభావం , బడుగు జీవి దుస్థితి వర్ణన పాఠకులను అపాదమస్తకం పులకింపజేస్తుందనీ సమాజ వాస్తవికతను అత్యధ్భుతంగా కళ్ళముందు ఉంచుతుందనీ , ఎనభై యేళ్ళ పైగా మన సమాజ చరిత్ర మరోసారి పరిశీలన చేసుకుంటూ మళ్ళీ ఓసారి ఆ సాహిత్యం ఆస్వాదన చేసుకునే సమయం వచ్చిందన్నారు , ఓ సుందర ప్రకృతి దృశ్యం లో లీనమైతే తనవూ మనసూ ఎలా వుంటుందో అలా వుంటుంది ఆయన సాహిత్యం అన్నారు . ఆయన వాక్యాలు మీ శరీరాన్ని హృదయాన్ని ఓక్షణం కదిలించి గగుర్పాటుకు గురిచేస్తాయన్నారు, మస్తిష్కంలో విద్యుత్ పుట్టించగల మేధస్సు ఆయన సొంతమని అభిప్రాయపడ్డారు. . ఉత్తేజం, వ్యంగ్యం , జాలి కరుణ భయానకం ఇలా అన్ని భావాలనూ ఒకేసారి కలిగించే అత్యంత ఉత్తమ సాహిత్యం రావిశాస్త్రి గారిదని చెప్పారు . . శ్రీ శ్రీ చెప్పిన రసన భావాన్ని ఆయన అందించారని చెప్పారు , అయితే ఎన్ని ఆయనకు విశేషణాలు వున్నా ఛాత్రి బాబు పదమే ఆయనకిష్టం అట. 
ఆ పిలుపు కి ఆయన బాగా సంతోషించేవారని వివినమూర్తి చెప్పారు , ఫౌరహక్కులు భంగం కలిగినప్పుడు , జైలు జీవితం అయినా ఆహ్వానించారు గాని వెనుకంజ వేయలేదని వక్తలు తెలిపారు. ఆయన రచనలు తెలుగు సమాజం 1950 నుంచి 1980 వరకూ ఓ దర్పణంగా భావించవచ్చని తెలిపారు.
చందు సుబ్బారావు; రావిశాస్త్రి వచన శ్రీశ్రీ అన్నారు , నిష్పక్షపాతంగా అత్యంత నిజాయితీగా రచనలు చేసారని , i have nothing but contempt of the court. అనే మాట భార్యాభర్తల కేసులో భర్త కొట్టిన దెబ్బలకు సాక్ష్యం లేదని కోర్టు అబిప్రాయపడినప్పుడు చెప్పినదన్నారు , తోటి అడ్వకేట్ రచయిత రామకోటి చర్యలపై అసూయాంధకారం లాంటి అందమైన సాహిత్య సెటైర్ వేసి సున్నితంగా చెప్పేవారనీ తెలిపారు. 
వివినమూర్తి  మాట్లాడుతూ రావిశాస్త్రి రచనల్లో ఉపమానాలు , రాసిన శైలి గురించి తెలిపారు , , రచన ఒకెత్తు వ్యక్తిత్వం ఒకెత్తు , ఆయన కేసులన్నీ పేదవారివే ఫీజుల తక్కువ లేదా అసలుండవు , అటువంటి వ్యక్తి అరుదైన వారనీ .ఆయనపై రచనాసాగరం సంకలనం చాల పెద్ద కృషి అనీ , 1935 september first story వచ్చిందనీ . వినోదిని పత్రికలో పదమూడేళ్ళు వయసులో అనీ చెప్పారు , వినోదిని వారు ఇంతకన్నా చెత్తకధలే వేస్తున్నారు కదా నాదెందుకు వెయ్యరు అని . ఆ వయసులో అనుకోవటం , అబిసీనియా గురించి కధనాలు, ఆ వయసులోనే సేకరించి డైరీలో వ్రాయటం జరిగింది అని తెలియజేసారు. ఇన్కంటాక్స్ ఆఫీసర్ పనిపిల్లపై కధ , ఎంన్ ఎమ్ రాయ్, గాంధీ ల గురించి డైరీలో వ్రాసే వారట , . పేదలంతా పేదల పక్షాన ఉండరనీ . ఉంటే ఇంత పేదరికం వుండదనీ , .దెయ్యాలుకు ద్వేషాల్లేవు అనే కధ గురించి చెప్పారు, హిందూముస్లిం లు చచ్చాక స్వర్గంలో కౌగలించుకోవటం. చాల చిన్న వయసులోనే ఈ కధలు వ్రాసి తన విశ్వమానవ భావనకు పునాది వేసారని చెప్పారు ,.ఆయనలో సంశయాత్మక కధలుండవు చెప్పాల్సింది సూటిగా వుంటుంది. మనిషిగా ఎవరికోసం నిలబడ్డావ్ అనేది ముఖ్యం అంతే అని తెలిపారు , 
 ఇల్లు, రత్తాలు రాంబాబు రచనలు గురించి ప్రశ్నలు వస్తే ఏ రచయిత తన రచనను భుజానవేసుకోరు అన్నారనీ తెలిపారు. తాను లౌకిక ప్రయోజనం కోసం రచన చేయలేదనీ సామాజిక ప్రయోజనం కోసం మాత్రమే రాసాననీ చెప్పారన్నారు. 
వివినమూర్తి గారు రావిశాస్త్రి బాల్యం పైనే ఎక్కువ దృష్ట పెట్టి పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు , 
రావిశాస్త్రి గారి కుమారుడు ఉమాకుమారశాస్ర్తి మాట్లాడుతూ ఓ సంఘటన చెప్పారు , హైదరాబాద్ ప్రయాణం సమయంలో స్టేషన్ లో శ్రీనివాస్ శాస్ర్తి అనే మరో లాయర్ కలిస్తే మాట్లాడుతున్నారు ఇంతలో ఆయనకు ఒకడు నమస్కారం పెట్టాడు , వాడిని పిలిచి ఒరే నువ్వు ఆ కంపార్ట్ మెంట్ ఎక్కవద్దనిచెప్పారు , ఎందుకంటే వాడు ఆయనకు తెలిసిన ఓ జేబుదొంగ , రావిశాస్త్రి గారికి 
ఇ పాజిటివ్ బ్లడ్ గ్రుప్ , ఆ గ్రూప్ రక్తం ఎవరతో అయినా పంచుకోవచ్చట , అలాగే నిత్య జీవితంలో అన్నింటా తనను తాను పంచుకునే వ్యక్తి అని ఉమ గారు తెలిపారు, . ఆర్కే ఆసుపత్రికి యజమాని కృష్ణమూర్తి గారే చివరిఘడియల్లో వున్నారట వాసిరెడ్డి నవీన్ మాట్లాడుతూ 46 
 పుస్తకాలు మలయాళం నుంచి తెలుగు లోకి అనువాదం చేసారని చెప్పారు.
,నాలుగు తెలుగు పుస్తకాలు మళయాళంలోకి అనువదించిన ఏకైక రచయిత రావిశాస్త్రి అని,
ఓ పెద్ద అల లాంటి వారని యల్ ఆర్ స్వామి     అన్నారు .
రష్యన్, చైనా భాషల్లో ఇల్లు నవల అనువాదం కావటం సంతోషమని ఆయన చెప్పారు, .రావిశాస్త్రి కి నవలే సముచితమైన ప్రక్రియ అనీ , ఆయనను ఆవిష్కరించేది అదొక్కటే అన్నారు , సొమ్మలుపోనాయండి గొప్ప నవల అనీ భాష భావం నడిపిన విధానం లో. ,, అల్పజీవి A revolution of thought అన్నారు. 
ప్రజాసాహితి వారి ముద్రణ రావిశాస్త్రి శతజయంతి సంచిక ఆవిష్కరించారు. ఈ సభలో మాట్లాడుతూ 
అట్టాడ అప్పలనాయుడు - రావిశాస్త్రి అంటే ఓ మహాసముద్రం అనీ తన ఉపన్యాసం లో ఎక్కడ తేలుతానో అని అన్నారు , తనకు పెద్ద నవల ఇచ్చారనీ మొత్తం మూడు నవలలు పై మాట్లాడారు.
 కలలో గురువుకి ప్రశ్న లు సంధించారు ఆయన కూడా అదే ధోరణిలో సమాధానం ఇచ్చినట్లు ఓ కల్పిత రూపంలో ఉపన్యాసం చెప్పారు. 1950- 60 నాటి విశాఖ జీవనం , ఆ పాత్రలు వర్ణనలు అప్పటి ధరలూ కొత్త రాజకీయులు చిల్లర కేసుల పోలీసులు. సిమిలీలు సూక్తులు ఇవన్నీ ప్రతిఒక్కరు మరోసారి చదవాలనిి ఆయన  చెప్పారు. అప్పులందరూ చేస్తారు త్యాగాలు కొందరే చేస్తారు అని ఆయన అన్నారు.
రత్తాలు రాంబాబు , నాలుగు భాగాల ముగింపు లేని నవల పై వివరంగా మాట్లాడారు. 
రత్తాలు వేసే ప్రశ్నలు , డభై లలో స్టూడెంట్స్ పోలీసులు లాయర్లు వారి గుమస్తాలు. Proletarian goddess రత్తాలు. అని చెప్పారు, . ఏవూరు మాస్టారు అనే ప్రశ్నలకు శీకాకుళం అనే సమాధానంలో దాగివున్న ఉపమానాలు గొప్పదని ఆయన అన్నారు.
 నెల్లూరు నుంచి వచ్చిన ప్రతిమ తన ఉపన్యాసంలో : విశాఖ జనం ముందు రావిశాస్త్రి గురించి మాట్లాడటం సాహసం అన్నారు. తనకిది ప్రియమైన సందర్భం అనిిఆమె  అన్నారు. . వర్గశత్రవుల సంఘర్షణ సులభమైన శైలిలో చెప్పిన రచయిత మన రావిశాస్త్రి అని ఆమె కొనియాడారు.
అల్పజీవిలో సుబ్బయ్య పాత్ర వివరించారు,
సొమ్ములపోనాయండి నవల ఓ ప్రవాహంలో పోతుంది మీరు అందులో లీనమై పోతారు.బోడయ్య దంపతులు ఓ హ్యూమన్ డాక్యుమెంటరీ.అనీ తెలిపారు.
ఇల్లు నవలలో చిట్టమ్మ పై అసభ్య పదజాలం ఆ యా వ్యక్తులు భాషా సంస్కారం జీవన నేపధ్యమే అని అభిప్రాయ పడ్డారు. తుదిశ్వాస వరకూ రావిశాస్త్రికి విశాఖ తో అనుబంధం కొనసాగటం ప్రత్యేకంగా చెప్పారు.
కళ్యాణ రామారావు అధ్యక్షులుగా జరిగిన సభలో మాట్లాడుతూ రావిశాస్త్రి
ఉపదేశంలో నేర్చుకో కూడనివి కూడా వుంటాయని చెప్పారు.. 
మూడు నచ్చిన కధలు చెప్పమంటే జరీఅంచు తెల్లచీర , వెల్లువలు , ఆఖరి దశ , సృష్టిలో , చెప్పారట.
వృద్ధులు వారి కి మాయ కధ ఇష్టపడ్డారు. , దాన్ని బేస్ చేసుకుని ముత్యాలమ్మ పాత్రతో 80 ఎపిసోడ్స్ ఫేస్బుక్ లో కంటిన్యూ చేసారు వృద్ధుల వారు. న్యాయం కధపైనా మాట్లాడారు.
చింతకింది శ్రీనివాస్ రావిశాస్త్రి రచనలను కంఠతా పట్టి అలవోకగా చెబుతూ సభను ఉర్రూతలూగించారు , ఆయన శైలిని ఇంతవరకూ ఎక్కడ ఎవరూ పూర్తిగా అనుకరించలేదనీ అది సాధ్యం కాదన్నారు, తనతో సహా ఎవరికీ అది సాాధ్యం కాని అంశం అని అన్నారు. రావిశాస్త్రి ఆయనదొక గొప్ప పథం అని చెప్పారు, రావిశాస్త్రి పై ఉపన్యాసాలు తప్పు అదొక సముద్రం , రోజూ చదవాలి ఉదయం నుంచి రాత్రి వరకూ అంతే అన్నారు.
కళ్యాణరామారావు ; ఓ కోర్టు లో రావిశాస్త్రి తో పని వుండి వచ్చిన మహిళా వర్ణన అనుభవం చెప్పారు. తన కుమార్తె జడ్జి అయ్యాక రావిశాస్త్రి ని చదవమన్నాను అని వృద్ధుల తెలిపారు.
వాసిరెడ్డి నవీన్ : రాజ్యంలో అభద్రత తో ఓ రాజ్యాంగం ఏర్పాట్లు. వాడిని వాడు కాపాడుకోటానికి మాత్రమే.అనే విషయం వివరించారు.
న్యాయం ,, రాజ్యం స్వభావం లోతుగా పట్టుకున్న ఏకైక రచయిత రావిశాస్త్రి అని చెప్పారు . ఇక్కడ ఓ అంశం పంచుకొంటూ 
ఏడొందొల కధలు వ్రాసిన ఓ రచయిత గురించి కాళీపట్నం రామారావు అయ్యో ఒక్కటీ తనకు తెలీదే అన్నారట ,. రావిశాస్త్రి రచనలు 1962 కి ముందు తర్వాత గా విభజించాలి అని నవీన్ చెప్పారు.
ఆ తర్వాత కధలు 1968 ఆరు సారా కధలు ప్రపంచ సాహిత్యం లో గొప్ప కధలు. అన్నారు. వాటిని
మళ్లీ చదవండి మన కర్తవ్యం బోధపడుతుంది.
దీర్ఘాసి విజయభాస్కర్;   
నిజం విషాదం తిరస్కృతి నాటకాలు పై వాఖ్యానం. నాటకం వ్రాసి ఏసి చెడిపోతారు గాని చూసి చెడిపోరు అన్నారు .పరిష్కారంగాని ఓ ముగింపు గాని లేకుండా ఏ నాటకం ఉండదు. ఏసేవాడు రాసేవారు వున్నా చూసేవారు లేరని తెలిపారు.
కళింగాంధ్ర మాండలికం , విశాఖ కు సముద్రం లేకపోతే ఎంత రసహీనమో సాహిత్యానికి రావిశాస్త్రి లేకపోతే అంత నష్టం.రావిశాస్త్రి బూడిదలో కలిసిన గాలిలో కలిసిన చివరివరకు కమ్యూనిస్టు గా వున్నారని తెలిపారు.
జి ఎస్ చలం ; రావిశాస్త్రి రచనలో కవిత్వం. ఉదయం , జరీఅంచు తెల్లచీర , వెన్నెల ఇవన్నీ కవిత్వమే రావిశాస్త్రీయంలో ముందుమాట గొప్పది. సైకిల్ కోసం అల్లరి చేస్తుంటే రెండు దెబ్బలేసి అమ్మ చెప్పిన మాట నాయనా మనం పేదవాళ్ళంరా .అని, జీవితం చివరివరకు అదే పాటించాడు. పేదలపక్షం మాత్రమే వహించారు. డాక్టర్ రఘరామారావు  మాాట్లాడుతూ భావితరాలకు రావిశాస్త్రి సాహిత్యం అందజేసే బాధ్యత సాహిత్య అకాడమీ తీసుకోవాలన్నారు. 1968 లో రఘరామారావు ఎంబీబీఎస్ రావిశాస్త్రి గారి పక్క ఇల్లు ఇద్దరూ ఉదయం పలకరింపు ఆటోగ్రాఫ్ అడగటానికి భయం. తర్వాత ఎమెర్జెన్సీ కాలంలో కలయిక , కల్లుపాకలు కొబ్బరితోట ప్రాంతంలో జనం భాషపై చర్చ .ఇల్లు నవలపై కొన్ని పాత్రలు నొప్పించాయా అని రావిశాస్త్రి మృదువుగా చెప్పారు. 
డాక్టర్ వి. కృష్ణమూర్తి ఆర్కే హాస్పిటల్. గుంటూరు జిల్లాలో కాలేజ్ రోజుల్లో రావిశాస్త్రి పుస్తకాలు పరిచయం చిన్న చిన్న పదాలతో ఇంతబాగా వ్రాస్తారా. సారా కధలు చదివాక మేధోవిస్ఫోటనం జరిగింది ,పల్స్ రేటు పెరుగుతుంది , గొప్ప రచన చదివినప్పుడు ఓ కొత్త మనిషి పరిచయం అయిన ఫీలింగ్. కానీ రావిశాస్త్రి ఒక కుదుపు ఒక ఆలోచన ఒరవడిని ఇస్తాడు. ఆయనకు తన రచనపై మాట్లాడటం అస్సలు ఇష్టం వుండేది కాదు , వృత్తిని సాహిత్యం గురించి కాకుండా ఇతర విషయంలో..., యద్ధనపూడి నవలలు బాగా పోతున్న సమయంలో రావిశాస్త్రి తనకు ఓ హీరోవర్షిప్ ఏర్పరచుకున్న ఏకైక రచయిత. వారి రచనలు కంఠతా పట్టిన వారు ఎంతోమంది. అన్ని వర్గాలు ప్రభావితం అయ్యే రచనలు .వైద్యులు లాయర్లు పోలీసులు ఆయన రచనలు చదివి ఎంతో మానసిక పరివర్తన చెందారు. కొత్త తరం తప్పక చదవాల్సిన రచనలు ఆయన చేసారు , ప్రబుద్ధులు బుద్ధులు కావటానికి ఆయన రచనలు అందించారు. సమాజం మీద తీవ్ర ప్రభావం చూపిన సాహిత్యం ఆయనది..రష్యాలో చైనాలో అనువాదం చేసిన ఉపయోగంలేదు మన పిల్లలే చదవనప్పుడు అక్కడ మాత్రం ఎందుకు చదువుతారు. అన్నారు.
మిత్రసాహితి తరఫున ప్రసాద వర్మ ; పిరికివాడి దగ్గర ఏ సుగుణం వుండదు , ధైర్యవంతులే జీవితాన్ని కొత్త గా దర్శించి ముందుకు తీసుకెళతారని రావిశాస్త్రి గారి అభిప్రాయం.వివినమూర్తి రావిశాస్త్రి రచనా సాగరం సేకరించి ముద్రించే ప్రక్రియ కు సహాయపడిన వారు. చందు సంవత్సరం ముందే సభకు అంగీకారాన్ని తెలిపి సాహిత్య అకాడమీ కి లెటర్ వ్రాసారట , సభకు హాజరై దాదాపు ఎనిమిది గంటల పైగా ఇంతమంది జనం రావటం రావిశాస్త్రి అంటే విశాఖ వాసులకు ఉన్న ప్రత్యేక అభిమానాన్ని తెలియజేస్తోంది అని వర్మ ధన్యవాదాలు తెలిపారు.