home page

పాపం !! నారాయణ మాస్టారు!!

రెడ్డి చేతిలో దెబ్బతిన్న నారాయణ

 | 
నారాయణ

రాజకీయాల్లో  ఇది 'జగన్ దొంగ ' దెబ్బే!

బాబు హయాంలో శ్రీచైతన్య బీఎస్ రావు జైలుకు... 
జగన్ పాలనలో నారాయణ అరెస్ట్!
నెల్లూరు రెడ్లకు ముద్దుల అల్లుడైనా కష్టాలు తప్పలేదు పొంగూరు వారికి!

తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో-1997 వేసవిలో ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సూత్రధారిగా కే రామబ్రహ్మం అనే వ్యక్తిని చూపించారు. ఈ వ్యవహారంతో సంబంధముందనే అభియోగంతో శ్రీచైతన్య కమ్మ 'విద్యావేత్త' డాక్టర్ బీఎస్ రావు (బొప్పన సత్యనారాయణ రావు)ను అరెస్టు చేశారు. కోర్టు ఆదేశంతో డా.రావు వారం జైలులో గడిపారు. ఈ కేసు ఏమైందో, ఓబీసీ ప్రధాన నిందితుడు రామబ్రహ్మం నిర్దోషిగా బయటపడ్డాడో లేదో తెలియదు. అప్పటికి పొంగూరు నారాయణ అనే బలిజ-కాపు విద్యా వ్యాపారి హైదరాబాద్ దాకా ప్రస్తుత స్థాయిలో విస్తరించలేదు. నెల్లూరుకు చెందిన పీహెచ్డీ  డాక్టర్ నారాయణ తాను డిగ్రీ చదివిన నెల్లూరు వీఆర్ కాలేజీలో కాంట్రాక్టు లెక్చరర్ గా పనిచేసి ఈ స్థాయికి ఎదిగాడు. ఒక ప్రైవేటు బస్సు కండక్టర్ కొడుకేగాని విద్యారంగంలో కమ్మ-రెడ్డి-బ్రాహ్మణ విద్యావ్యాపారుల మార్గంలో పయనించి అనూహ్య విజయాలు సాధించాడు. అంతటితో ఆగక నెల్లూరు పెద్దారెడ్లకు 'అవసరం లేకున్నా' అల్లుడు కూడా అయ్యాడు. పాత నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన తోటి కాపు-బలిజ మంత్రి, కమ్మల అల్లుడు గంటా శ్రీనివాసరావుకు వియ్యంకుడు కాగలిగాడు. వారం జైలు జీవితం రుచి చూసిన శ్రీ చైతన్య బీఎస్ రావు గారిలా నారాయణ గారు బెదిరిపోలేదు. 2014 పార్లమెంటు, అవశేషాన్ధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఆర్ధికంగా 'కాపుకాశారు' పొంగూరు నారాయణ గారు. అందుకే ఆయన అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యుడు కాకున్నా చంద్రబాబు గారు నారాయణ గారి కష్టం గుర్తించారు. మున్సిపల్ పాలన శాఖ అప్పగించి ఈ విద్యావేత్త రుణం తీర్చుకున్నారు. అంతటితో చేతులు దులుపుకోకుండా బక్కచిక్కిన రాష్ట్రం ఏపీ కొత్త రాజధానిగా అమరావతినే ఖాయం చేసే రీతిలో నారాయణ నేతృత్వంలో సాధికార కమిటీ వేశారు బాబుగారు. సీఎం చెప్పినట్టే కృష్ణా నది తీరాన రాజధానికి భూమిని గుర్తించారు నారాయణ గారు. ఇంతజేశాక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తొలిసారి పోటీకి ఉపక్రమించారు. నెల్లూరు జిల్లా నుంచి ఓ బలిజ నేత శాసనసభకు గెలిచి యుగాలు గడిచాయి కాబట్టి నారాయణను ఆయన అర్ధబలం అసెంబ్లీకి పంపుతుందని అంచనవేసింది టీడీపీ. అయితే, నెల్లూరు సిటీ స్థానంలో ఓ బలిసిన వైఎస్సార్ కాంగ్రెస్  రెడ్డి నేతను ఢీకొనే అవకాశం నారాయణ గారికి రాలేదు. పోలుబోయిన అనిల్ కుమార్ అనే 'ఎర్ర' గొల్ల పళ్ళ వైద్యుడితో తలపడి ఓడిపోయాడు బలిమి, ఒరిమి గల నారాయణ గారు. ఇలా 'బలిమి గల బలిజల' పరువుదీశారు. పొరుగు జిల్లా చిత్తూరు  మూలాలున్న బలిజ కుబేరుడు, మాగుంట వారిస్థాయి మద్యం వ్యాపారి డీకే ఆదికేశవులు నాయుడు గారు లేని లోటు తీరుస్తాడనుకున్న నారాయణ గారికి నెల్లూరు సిటీలో ఏ రెడ్డి అభ్యర్థి పెట్టని రీతిలో సొమ్ము వ్యయం చేసినా ఓటమి తప్పలేదు. ఒక్కోసారి ధనం విలువ తెలిసిన ఘనతవహించిన నెల్లూరులోనూ డబ్బుకు విలువుండని అప్పుడప్పుడూ జనం నిరూపిస్తారు. ఇప్పుడు నారాయణ గారు టీడీపీ కార్యక్రమాల్లో అంత చురుకుగా కనిపించడం లేదు. అయినా, ఎన్నికల్లో ఓడి మూడేళ్లు గడిచినా, విద్యా వ్యాపారానికి 'దూరంగా ఉన్నా' నారాయణకు కష్టాలు తప్పడంలేదు. చదువు బిజినెస్ లో కమ్మలు, రెడ్లను అనుకరించి, వారిని అధిగమించినంత పని చేసిన నారాయణ రాజకీయాల్లోకి వచ్చి తప్పుచేశారని కాపు, బలిజ, తెలగ, ఒంటరి సముదాయం బాధపడుతోంది. కనీసం విజ్ఞాన్ 'లావు వారి' లా హడావుడి లేకుండా రాజకీయాల్లో కాలం వెళ్లబుచ్చడానికి -నారాయణ గారికి అంతటి గొప్ప కుటుంబ నేపథ్యం లేదు. ఏదేమైనా నెల్లూరు పెద్ద/పంట రెడ్లను మించి పైసలు సంపాదించినా-వారిలా వెలగలేకపోవడం పొంగూరు నారాయణ గారి దురదృష్టం. రాజంపేట లోక్ సభ సీటును 'కోల్పోయి' కుంగిపోయిన బలిజలకు ఇంతకన్నా పోయేదేముంటది?  2014 ఎన్నికలయ్యాక నెల్లూరు జిల్లాలో తొలి బలిజ మంత్రిగా చరిత్ర సృష్టించిన నారాయణకు రాజకీయ భవిష్యత్తు ఇక ఉండదా? తప్పక ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ పిల్లల చదువుకు ఇచ్చిన సొమ్మే డాక్టర్ నారాయణను కాపాడుతుంది.