home page

నాన్ లేఅవుట్ భూముల రిజిస్ట్రేషన్ చేయాలి : హైకోర్టు

నిలిచిపొయిన నాన్ లేఅవుట్ భూముల రిజిస్ట్రేషన్

 | 
Madhura wada lands

నిషేధం లేకపోతే భూముల రిజిస్ట్రేషన్ చేయాలి

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ

విజయవాడ: నాన్‌ లేఅవుట్ల రిజిస్ర్టేషన్లను నిలుపుదల చే స్తూ స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ కమిషనర్‌ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

నిషేధిత భూములు కానప్పుడు రిజిస్ర్టేషన్లను నిలుపుదల చేసే అధికారం కమిషనర్‌కు లేదని వ్యాఖ్యానించింది. నాన్‌ లేఅవుట్లకు రిజిస్ర్టేషన్లను అనుమతించాలని న్యాయస్థానం ఆదేశించినట్టు న్యాయవాది ఎంఎంఎం శ్రీనివాస్‌ మంగళవారం తెలిపారు. స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ గుంటూరు వాసి పి.ఏడుకొండలరెడ్డి వేసిన రిట్‌ పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించింది. ఈ వ్యాజ్యంపై ఏప్రిల్‌లో జరిగిన విచారణ సందర్భంగా...

పిటిషనర్‌ తరపున న్యాయవాది శ్రీనివాసరావు వాదించారు. పిటిషనర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించొద్దని ఏజీపీ చేసిన వాదనలను హైకోర్టు అందుకు అంగీకరించలేదు. రిట్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి, ఏప్రిల్‌ 19న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తులు స్వీకరించి రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్దేశించింది.

కౌంటర్‌ దాఖలుకు స్టాంప్‌లు, రిజిస్ర్టేషన్ల శాఖకు అవకాశం ఇచ్చింది. తుది తీర్పు ప్రాతిపదికన నిర్ణయాన్ని అమలు చేయాల్సి ఉంటుందని, అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులను కొనసాగించాలని న్యాయస్థానం నిర్దేశించింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో నాన్‌ లేఅవుట్‌ ప్లాట్లు కొనుగోలు చేసిన వేలాది మంది ప్రజలకు ఎంతో ఊరట లభించిందని న్యాయవాది శ్రీనివాసరావు చెప్పారు.