పుండరీకాక్షుడు పుస్తకావిష్కరణ
రచయితకు సత్కారం : ఉపరాష్ట్రపతి వెంకయ్య
Jul 15, 2022, 16:55 IST
|
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ‘జాతీయకవిచక్రవర్తి దామరాజు పుండరీకాకక్షుడు ’పుస్తకావిష్కరణ
గుంటూరు జులై 15:
ఆజాదీకా అమృతోత్సవ్ లో భాగంగా భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ‘జాతీయకవి దామరాజు పుండరీకాక్షుడు ’ అనే పుస్తకాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. గుంటూరు హిందూ కళాశాల తెలుగు విభాగాధిపతి, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ యల్లాప్రగడ మల్లి కార్జునరావు పుస్తకాన్ని రచించారు. గన్నవరం సమీపంలోని ఆతుకూరు లోని స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రాంగణంలో ఈ ఆవిష్కరణ సభ జరిగింది. కార్యక్రమంలో అనంతరం రచయిత పుస్తకాన్ని రోటరీ క్లబ్ మాజీ గకర్నర్ డీకే ఆనంద్ దంపతులకు అంకిత మిచ్చా రు. ఈ సందర్భంగా విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతి రావు గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును, రచయిత మల్లికార్జున రావును ఆనంద్ దంపతులను సత్కరించారు.