home page

రాష్ట్రంలో చారిత్రక సంపద రక్షణ

మంత్రి ఆర్.కె.రోజా ప్రకటన

 | 

చారిత్రక సంపదను భావితరాలకు అందించేలా రాష్ట్రంలో అన్ని మ్యూజియంలు అభివృద్ధి పరుస్తాం : మంత్రి ఆర్కే రోజా

బాపు మ్యూజియంలోని ప్రతి శిల్పం, ప్రతి చిత్రం తన చరిత్రను తానే చెప్పుకునే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా బాపు మ్యూజియంను తీర్చిదిద్దడం చాలా ఆనందదాయకని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్.కె. రోజా తెలిపారు. విజయవాడ బాపు మ్యూజియాన్ని మంత్రి గురువారం సందర్శించారు. పర్యాటక ప్రదేశాలు, దేవాలయాలు, మ్యూజియాలు అన్నీ కలిపి సర్కిల్ టూరిజంగా ఏర్పాటు చేసి పర్యాటక శాఖ, పురావస్తు, ప్రదర్శన శాఖల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పింగళి వెంకయ్య వంటి మహనీయులు నడిచిన ప్రాంతంలో మనం కూడా నడవడం చెప్పలేని అనుభూతిని కలిగిందన్నారు. 

మంత్రి ఆర్.కె. రోజా మాట్లాడుతూ.... బాపు మ్యూజియం అతి పురాతనమైన మ్యూజియమని..  దీనిని 12.8 కోట్ల నిధులతో ఆధునీకరించిన మ్యూజియాన్ని అక్టోబర్ 2, 2020న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పునఃప్రారంభించారని గుర్తుచేశారు. ఆది మానవ చరిత్రకు సాక్షిగా నిలిచే పురాతన వస్తువులు, శిల్పకళ సంపదతో పాటు ఆధునిక హంగులతో మ్యూజియాన్ని తీర్చిదిద్దారన్నారు. బుద్ధ-జైన గ్యాలరీ, హిందూ శిల్పకళా గ్యాలరీలు, ఆయుధాలు, కవచాలు గ్యాలరీలు... వేటికి వాటిని విభిజించి 10 లక్షల ఏళ్ల చరిత్రకు సాక్షిగా నిలిచే అరుదైన 1,500 పురాతన వస్తువులను బాపు మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచడం చాలా ఆనందదాయకమని.. వేసవి సెలవుల్లో అందరూ తప్పక చూడాల్సిన ప్రాంతమని అన్నారు. పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానం కూడా అందిస్తుందని, ఇలాంటి మ్యూజియంల సందర్శనలతో పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. మన చరిత్రను మనం తెసుకోవడానికి ఖచ్చితంగా ఒకసారైనా మ్యూజియంను సదర్శించాల్సిందే అన్నారు. ఏలూరు, అనంతపుర్ మ్యూజియాలు కూడా విజయవాడలోని మ్యూజియం మాదిరే అభివృద్ధి చేసి, మరో 3 నెలల్లో ప్రారంభించబోతున్నామని తెలిపారు. 

పురావస్తు మరియు ప్రదర్శనశాలల శాఖ కమిషనర్ డా. జి. వాణిమోహన్ మాట్లాడుతూ...  బాపు మ్యూజియం అత్యాధునిక సాంకేతికతతో ఆధునీకరించామని, ఫోటో ప్రేమ్స్, డిస్ ప్లే బోర్డులు వంటిని నేరుగా ఫోటో స్కాన్ చేయడం ద్వారా యానిమేషన్ లో చూడవచ్చని తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా బాపు మ్యూజియం యాప్ ని తయారు చేశామని, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే సంబంధిత వివరాలన్నీ తెలుచుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ క్రియేటివిటీ కల్చరల్ కమిషన్ ఛైర్ పర్సన్ వంగపండు ఉష, సాహిత్య అకాడమీ ఛైర్ పర్సన్ పి. శ్రీలక్ష్మి, సాంస్కతిక శాఖ సీఈవో మల్లిఖార్జున్, పురావస్తుశాఖ డిప్యూటీ డైరెక్టర్లు సురేష్, రామసుబ్బారెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

మంత్రి ఆర్.కె. రోజా బాపు మ్యూజియం సందర్శన జరిగింది ఇలా..... బాపు మ్యూజియం ఆవరణలో ఉన్న జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య విగ్రహానికి మొదటిగా పూలమాల వేసి, నివాళులు ఆర్పించి సందర్శనను ప్రారంభించారు. అనంతరం విక్టోరియా స్మారక భవనంలోని జాతీయ నాయకుల విగ్రహాలను పరిశీలించారు. 1921లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో పింగళి వెంకయ్య, మహత్మా గాంధీకి జాతీయ జెండాను అందించే సన్నివేశ విగ్రహాలను ప్రత్యేక ఆసక్తితో తిలకించారు. 

బుద్ధ-జైన గ్యాలరీలో బౌద్ధ, జైన రాతి, కాంస్య ప్రతిమలను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. హిందూ శిల్ప కళా గ్యాలరీలో హిందూ దేవతల రాతి, కాంస్య ప్రతిమలను చాలా ఆసక్తితో గమనించారు. హిందూ దేవతల గ్యాలరీలో మంత్రి ఆర్.కె. రోజా సెల్పీలతో ఆలరించారు. తొలి చారిత్రక యుగ గ్యాలరీలో 10 లక్షల సంవత్సరా ల కిందటి నుంచి క్రీ.శ 2వ శతాబ్ధం వరకు ఉన్న పురాతన వస్తువులను మంత్రి తిలకించారు. వీటిలో ఆది మానవులు ఉపయోగించిన రాతి పని ముట్లు, 12 కాళ్ల మట్టి శవపేటిక, మట్టి బొమ్మలు, కుండ పెంకులు, సున్నపు ప్రతిమలు, పూసలు, ఫలకాలు అత్యంత అరుదైనవిగా సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. మొదటి అంతస్తు గ్యాలరీల్లో తెలుగు లిపి పరిణామక్రమము ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారతీయ వస్త్ర సంప్రదాదయానికి నిలువుటద్దంగా ఉన్న వస్త్రాల గ్యాలరీ, మధ్య యుగపు కళా దృక్పథాలు, పెయింటింగ్స్ ను ఆమె సందర్శించారు. ఆయుధాలు, కవచాల గ్యాలరీలో బాణాలు, విల్లంబులు, బాకులు, కత్తులు, డాళ్లు, రక్షణ కవచాలు, తుపాకులు, పిస్టల్స్,రివాల్వర్లు ఉన్నా యి.న