home page

ముగ్గురమ్మల తల్లి విగ్రహ ప్రతిష్ట

చాపరాతిపాలెం ఇలవేల్పు

 | 
 ముగ్గురమ్మల తల్లి

చాపరాతిపాలెం లో త్వరలో
 శ్రీ ముగ్గురమ్మల తల్లి విగ్రహ ప్రతిష్ట
ఏజెన్సీ ప్రాంతంలో అడ్డతీగల మండలం చాప రాతి పాలెం ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ  ముగ్గురమ్మల తల్లి అయిన నూతన విగ్రహ మూర్తి నూతన  ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవం జరగబోతున్నది. ఎన్నో దశాబ్దాల నుండి ఈ తల్లి మూడు శిలలుగా ఉండి ఎదురుగా మరో చిన్న శిలతో పోతురాజు బాబు విగ్రహంతో  చపాతి గ్రామం తో కలిపి  చుట్టుపక్కల గల 8 గ్రామాల వారు కొలుస్తున్నారు. అయితే ఇప్పుడు పూర్తిగా చక్కటి ఆకార మూర్తి గా మూడు తలతో మహాలక్ష్మి , మహా కామాక్షి, మహా సరస్వతి లుగా మూడు ముఖములతో చేయించిన విగ్రహన్ని, విగ్రహ ప్రతిష్ట గావించెందుకు సిద్దం చేసారు. అమ్మవారి తో పాటు శివలింగం నంది వాహనం జంట నాగుల నాగ బంధం పోతురాజు విగ్రహం ప్రతిష్టింప జరుగుచున్నది. ఈ ఎనిమిది ప్రతిష్ఠ కార్యక్రమం మూడు రోజుల పాటు జరుగుతుంది అభిషేకాలు అభి వాస్తు హోమము జరుగుతాయి ప్రతిష్టకు ముందు మూడు రోజుల పాటు గ్రామగ్రామాన ఊరేగించిన అనంతరం ప్రతిష్ఠ జరుగుతాయి దీనిని మొత్తం సందడి సందడిగా, మా ఆడపడుచు వస్తున్నదని ఎంతో సంతోషంగా గ్రామస్తులు భక్తులు ఓం శక్తి,  శ్రీ శక్తి , జై శక్తి, మూడు శక్తులు కలిగిన ముగ్గురమ్మల మూలపుటమ్మలుగా నెలకొల్పే ఈ ప్రతిష్టకు  భక్తులందరు పాల్గొనాలని మాజీ సర్పంచ్ మాజీ సర్పంచి చిన్నాలు దొర కోరారు.