home page

పరనింద కోసమే ప్లీనరీనా?

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు 

 | 
Somireddy
*ఆత్మస్తుతి, పరనిందలతో స్టేజీ డ్రామాలా వైసీపీ ప్లీనరీ*
*తల్లి, చెల్లి, మరో చెల్లితో పాటు ఆత్మ, నీడ కూడా వదిలేసిన జగన్ రెడ్డిని ఈ రాష్ట్ర ప్రజలెందుకు నమ్మాలి*
*ఏపీలో రాజ్యమేలుతున్నది జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు లిమిటెడ్ కంపెనీనే....ఇక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు డమ్మీలే..ప్లీనరీ వేదికపై పేర్ని నాని వ్యాఖ్యలే అందుకు నిదర్శనం*
*వైసీపీ డ్రామా కంపెనీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది*
*మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మీడియాతో పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
 
వైసీపీ ప్లీన‌రీ ఒక స్టేజి డ్రామాగా కొన‌సాగింది..మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల‌తో పొగిడించుకోవడానికే సరిపోయింది..ప్రజ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే నిర్ణ‌యాలు ఏమీ తీసుకోలేకపోయారు.
టీడీపీ నాయ‌కులు, ప్రతిక‌లు, ఛాన‌ళ్ల‌ను తిట్టించ‌డం త‌ప్ప‌, కార్యక‌ర్తల‌ అభిప్రాయాలు, ప్రజల క‌ష్టసుఖాలు తెలుసుకునే ప‌్రయత్నమే జరగలేదు
మొదటి నుంచి వైసీపీ కోసం నిలబడిన వారిని చాలా నిర్లక్ష్యం చేశారు..వైసీపీ వ్యవ‌స్థాప‌క అధ్యక్షుడు శివ‌కుమార్ ప్లీన‌రీలో ఎక్కడా కనిపించ‌లేదు
గౌర‌వాధ్యక్షురాలు విజ‌య‌మ్మ వైఎస్సార్ జయంతి రోజే వైసీపీ కి సెల‌వుచీటీ ఇచ్చేసింది
అన్న వదిలిన బాణమని చెప్పుకునే ష‌ర్మిల జ‌గ‌న్ ముఖం చూడ‌కుండా తెలంగాణ‌కు వెళ్లిపోయింది
జన్మనిచ్చిన త‌ల్లి, తోడ‌బుట్టిన చెల్లి, నీ చిన్నాన్న కూతురు, నీతండ్రికి ఆత్మలాంటి కేవీపీ, నీ తండ్రి త‌న నీడ‌లా చెప్పుకున్న సూరీడు ఎటుపోయారో క‌నిపించ‌డంలేదు
నీతండ్రి న‌మ్మిన వ్యక్తులే నిన్ను వ‌దిలివెళ్లిపోతే..ఇంకా రాష్ట్రప్రజలు నిన్ను ఎందుకు న‌మ్మాలి జ‌గ‌న్ రెడ్డీ
మీరు 95శాతం హామీలు నెరవేర్చామని చెప్పుకుంటూ డ‌ప్పాలు కొట్టుకుంటున్నారు...మీరు చెప్పిన ఒక్క మాట‌కైనా విలువుందా
ఎన్నికల ప్రచారం సందర్భంగా వారం రోజుల్లో సీపీఎస్ ర‌ద్దు చేస్తామ‌న్నారు, క‌రెంటు ఛార్జీలు త‌గ్గిస్తామ‌ని చెప్పి ఏడు సార్లు పెంచారు, ప్రజ‌ల్ని ధ‌ర‌ల‌తో బాద‌డ‌మే మీ 95శాతం హామీలు అమ‌లా?
9గంట‌ల క‌రెంటు సరఫరాను 12గంట‌లు చేస్తామ‌న్నారు, చివరకు 7గంట‌ల‌కే ప‌రిమితం చేశారు..ఈ ఏడు గంట‌ల్లో ఏడు సార్లు క‌రెంటు క‌ట్ అవుతోంది...
మేం ఉచితంగా ఇసుక ఇస్తుంటే దానిలో కుంభ‌కోణాలు జ‌రిగాయ‌ని అరిచి గ‌గ్గోలు పెట్టిన జ‌గ‌న్ నేడు ఏట్లో పోయే ఇసుక‌తో పిచ్చి కంపెనీని అడ్డుపెట్టి వ్యాపారం చేసుకున్నారు..ఇది కూడా 95 శాతం హామీల అమలులో భాగ‌మేనా?
పదే పదే బ‌టన్ నొక్కుతున్నాను అంటున్న జ‌గ‌న్ ఇప్పుడు రివ‌ర్స్ బటన్లు నొక్కుతున్నారు..
 రివర్స్ బటన్ నొక్కడం ద్వారా రూ.7,500కోట్లు పంచాయ‌తీల నిధుల‌ను దారి మళ్లించేశారు..
జగన్ రెడ్డి తీరుతో స‌ర్పంచ్, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లాప‌రిష‌త్ చైర్మన్లు అంద‌రూ డ‌మ్మీలు అయ్యారు....వ్యవ‌స్థలు మొత్తం నిర్వీర్యం అవుతున్నాయి
ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లోని రూ.800 కోట్లను రాత్రికి రాత్రే ఊదేశారు
మిమ్మల్ని న‌మ్ముకుని ప‌నులు చేసిన కాంట్రాక్టర్లు రాష్ట్ర చ‌రిత్రలో మొద‌టిసారిగా అర్థన‌గ్న ప్రద‌ర్శన చేసే పరిస్థితి వచ్చింది..ఇందుకేనా ప్లీన‌రీలో మంత్రులు, ఎమ్మెల్యేల‌తో పొగిడించుకున్నారు?
దేశవ్యాప్తంగా అమ‌ల‌వుతున్న అనేక వ్యవసాయ ప‌థ‌కాల‌ను నిలిపేసే హ‌క్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు
2017-2018లో మైక్రో ఇరిగేష‌న్ లో ఏపీ దేశంలోనే ప్రథ‌మ స్థానంలో నిలిచింది...దాన్ని ఇప్పుడు ఎందుకు ఆపేశారు?
మైక్రో ఇరిగేష‌న్ రాయ‌ల‌సీమ ప్రాంతానికి చాలా ఆవ‌శ్యక‌మైన‌ది..కానీ దాన్ని మూడేళ్లుగా ప‌డుకోబెట్టేశారు..
బిందు తుంప‌ర్ల సేద్యం, డ్రిప్ ఇరిగేష‌న్, ఏపీఎంఐపీ ఎందుకు ఆపేశారో రాష్ట్ర ప్రజ‌ల‌కు ప్లీన‌రీలో చెప్పాల్సింది క‌దా?
వ్యవ‌సాయ‌, నీటిపారుద‌ల‌, ఆర్ అండ్ బీ శాఖ‌లు పూర్తిగా మూత‌బ‌డిపోయాయి.. ఈ శాఖ‌ల‌కు బ‌డ్జెట్ కేటాయింపుల్లో న్యాయం జ‌ర‌గ‌లేదు..
కేటాయింపులేమో వంద రూపాయాలు చూపించి కేవ‌లం రూ.30 ఖ‌ర్చు చేస్తున్నారు
పోల‌వ‌రం ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేని ప‌రిస్థితిలో మంత్రి ఉన్నాడు
ఎమ్మెల్యేలకు స‌మ‌స్యల‌పై సీఎం జ‌గ‌న్ రెడ్డి వ‌ద్దకు వెళ్లి తాడేప‌ల్లి ప్యాలెస్ గుమ్మం తొక్కే ద‌మ్ములేకుండా పోయింది
ప్లీనరీలో ఎమ్మెల్యే పేర్ని నాని వాస్తవాలు చెప్పారు...ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు దేనికీ ప‌నికిరాం...మేమంతా డ‌మ్మీల‌మే...మీరు మ‌మ్మల్ని ప‌ట్టించుకోవ‌ద్దు అని చెప్పారు..కేవ‌లం జ‌గ‌న్ ను మాత్రమే ప‌ట్టించుకోండి...మేము మాత్రం దొంగ‌త‌నాలు, దోపిడీలు, హ‌త్యలు చేస్తాం, అక్రమ కేసులు పెడ‌తాం...ఆత్మ హ‌త్యలు చేసుకునేలా చేస్తాం...కానీ మీరు మాత్రం జ‌గ‌న్ మీద కోపం పెట్టుకోవ‌ద్దు అనే విధంగా మాట్లాడారు.
ఎమ్మెల్యేలు, మంత్రులే త‌మ‌కు తాము డ‌మ్మీల‌మ‌ని ప్రక‌టించుకునే ప‌రిస్థితి ఉంటే మిమ్మల్ని ఎందుకు న‌మ్మాలి జ‌గ‌న్ ?
వైసీపీ పార్టీ కాదు వైఎస్ఆర్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయింది
ఇసుక‌, సిలికా, మ‌ద్యం, గ‌నుల‌తో వ్యాపారం చేసుకుంటున్నారు..మీకు ఎవ‌రెవ‌రు క‌మీష‌న్లు ఇస్తారో వాళ్లకు రాష్ట్ర సంప‌ద‌ను క‌ట్టబెడుతున్నారు
రాష్ట్రాన్ని జ‌గ‌న్ రెడ్డి హోల్ సేల్ గా, ఎమ్మెల్యేలు రిటైల్ గా అమ్ముకుంటున్నారు
ఆర్థిక‌శాఖ మంత్రి ఈ ప్రభుత్వానికి కేవ‌లం రూ.5.20ల‌క్షల కోట్లు మాత్రమే అప్పు ఉంద‌ని చెప్పుకునే ప‌రిస్థితికి దిగ‌జారిపోయారు....కానీ రాష్ట్రానికి రూ.8ల‌క్షల కోట్లకు పైగా అప్పు ఉంది
బీసీల‌కు స‌బ్ ప్లాన్లో సంవ‌త్సరానికి రూ.15వేల కోట్లు, ఐదేళ్లలో రూ.75వేల కోట్లు ఖ‌ర్చు చేస్తామ‌ని చెప్పారు
ఇప్పటి వ‌ర‌కు బీసీల సంక్షేమానికి ఎన్ని కోట్లు ఖ‌ర్చు చేశారో నిన్న ప్లీన‌రీలో ఎందుకు చెప్పలేదు?
రూ.75వేల కోట్లు ఎస్సీ కుటుంబాల‌కు ఆర్థికంగా ఉప‌యోగ‌ప‌డేందుకు ఎన్ఎస్ఎఫ్డీసీ కింద వ‌చ్చే స‌బ్సిడీ రుణాల‌ను ఎందుకు నిలిపేశారో ప్లీన‌రీలో ఎందుకు చెప్పలేదు జ‌గ‌న్? 
ఎస్సీ స‌బ్ ప్లాన్ నిధుల‌ను ఎందుకు దారి మ‌ళ్లిస్తున్నారో ఎందుకు ప్రస్తావించలేదు 
ఎవ‌రి పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చావో...వారంద‌రినీ బ‌య‌ట‌కు త‌రిమేశారు..ప్రజ‌లు నిన్ను ఎందుకు న‌మ్మాలో చెప్పాలి
కుటుంబ స‌భ్యులే నీ ముఖం చూడ‌డానికి ఇష్టప‌డ‌ని ప‌రిస్థితి 
మీ ప్లీన‌రీ వ‌ల్ల రాష్ట్ర ప్రజ‌లంతా బ‌స్సుల్లేక చిన్న బిడ్డల‌ను పెట్టుకుని బ‌స్టాండ్లలో ప‌డిగాపులు ప‌డ్డారు
టార్గెట్లు పెట్టి జ‌నాల‌ను స‌మీక‌రించి, డ‌బ్బు, మ‌ద్యం ఇచ్చి ప్లీన‌రీని న‌డిపించుకున్నారు..అందుకే వైసీపీ ప్లీన‌రీ ఒక డ్రామా
వైసీపీ డ్రామా కంపెనీ మీద రైతులు, ప్రజ‌లు తిర‌గబ‌డే రోజులు దగ్గరకొచ్చేశాయ్