వైభవంగా పెనుశిల శ్రీ నృసింహస్వామి ఉత్సవాలు
గానాలహరి ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆనం
Updated: May 14, 2022, 22:07 IST
| బంగారు గరుడ సేవ
అత్యంత శోభాయమానంగా..శ్రీ శ్రీ శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు..
*రంగ రంగ వైభవంగా..శ్రీ శ్రీ శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు... 4వ రోజు ఉదయం వైభవంగా ప్రారంభమైన సింహవాహన సేవ. శనివారం రాత్రి స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన బంగారు గరుడ వాహన సేవ ముగిసింది.
శుక్రవారం ఉదయం వైభవంగా ప్రారంభమైన హంస వాహన సేవ రాత్రి బంగారు హనుమంత వాహనం పై ... శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారు అధిరోహించి..ఆలయ మాడ వీధుల్లో విహరించే కనుల విందైన కార్యక్రమాలు నిర్వహించారు. వేలాదిగా పాల్గొన్న భక్త జన సందోహం.కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి తదితర ప్రముఖులు.