పవన్ కళ్యాణ్ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం
తమ్ముడూ ! ,పవన్ కల్యాణ్!!
ప్రభుత్వం స్థాపించడం అనేది ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రక్రియ . పాపం , మూడు ఆప్షన్స్ లోనూ జనసేన ప్రభుత్వం గురించే ఉంది .. అంటే ఇప్పటికే మీకు majority సీట్లు (కనీసం 60 ) వచ్చి ఉంటే , మిగిలిన వాటి కోసం పొత్తులు పెట్టుకోవాల్సి వస్తే , చేయాల్సిన ఆలోచన ఇది. మీకు నిజాయితీ గా రాజకీయాల్లో ఉండాలని ఉంటే, ముందు ఒక మంత్రిగా పనిచేయండి .
పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో, ఒక్కదానిలో కూడా నెగ్గకుండా కేవలం పొత్తులతో ముఖ్యమంత్రి అవుదామంటే ఎలా ?
తాజా కలం :
నిజంగా జనసేన మూడవ ఫోర్స్ గా ఎదిగి ఉంటే 36-40 శాతం ఓట్లు వచ్చే పార్టీ స్వీప్ చేస్తుంది .
తాజా కలం -2 :
అసలు పొత్తులు లేకపోతే ప్రజలకి , మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది .
తాజా కలం -3:
పార్టీ స్థాపించడం అంత సులువు కాదు ప్రభుత్వం స్థాపించడం . సంస్థాగత నిర్మాణం మీద , సంస్థల మీద అవగాహన లేకుండా ముఖ్యమంత్రి అయితే నష్టపోయేది ప్రజలు .
తాజా కలం -4:
అయ్యా, తమరి మీద బోల్డన్ని తాజా కలాలు రాయవచ్చు . ఇప్పటికి ఇవి చాలు
- నరకుర్తి శ్రీధర్