నారాయణ... నారాయణ..
ఏమి కష్టం ...ఏమి కష్టం,... ఈ ప్రభుతకు...
Updated: May 16, 2022, 18:08 IST
| పగ కోసం పోతే ప్రభుత్వం పరువు పోయింది
*_నారాయణ..నారాయణ..!_*
************************
మాజీ మంత్రి నారాయణ అరెస్టు కేసు.. ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్టయింది...అలాగే తలపాగా చుట్టడం చేతగాక తల వంకర చందం కూడా ఇదేనూ..తెలుగుదేశంపై కక్ష సాధింపు..అచ్చెన్నాయుడు..నారాయణ తదితర నేతల అరెస్టుల పరంపరతో విపక్షాన్ని అప్రదిష్ట పాల్జేయడం.. పేపర్ల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడం..వెనక ఇత్యాది కారణాలు ఏవైనా ఉండనీ గాక..ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం..పెద్దల ఒత్తిడితో పోలీసుల తొందరపాటు..
ఇలాంటి వ్యవహారాల వల్ల..ఇప్పుడేమైంది..
సర్కారు పరువే గోవిందా..
టెన్త్ పేపర్ల లీకేజీ..ఇదిగో పులి..అనగానే అదిగో తోక
చందాన అదేదో బ్రహ్మాస్త్రం
చేతికి చిక్కి ఇక తెలుగుదేశం పార్టీని చితిలోకి నెట్టేసినంత సంబరంతో మరో
హై డ్రామాకు తెర ఎత్తింది పాలక పక్షం..ఆ మధ్యన ఇలాగే అర్ధరాత్రి..అదేదో అతి తీవ్రమైన కేసు సుమా..
తెల్లారితే పారిపోయి..దేశమే విడిచి పెట్టి పోతాడనేంత లెవెల్లో పుసుక్కున అచ్చెన్నాయుడిని కటకటాల పాల్జేసిన పెద్దలు ఇప్పుడు మరో అస్త్రాన్ని నారాయణపై సంధించారు..సరే..పేపర్ల లీకేజీ వెనక ఎవరి ప్రమేయం ఉందనే వాస్తవాలు నెమ్మది మీద తెలేవైనా ఎంత పేలవమైన పాయింటుతో నారాయణ అరెస్టుకు తెగబడి ఇప్పుడు కేసు తేలిపోయి ప్రభుత్వమే అభాసుపాలైన
ఈ తీరు పేపర్ల లీకేజీ
గుట్టు వెలికితీత అనే ప్రధాన బాధ్యత కంటే తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడమే గాక పనిలో పనిగా విపక్షంపై మరో అస్త్రం దొరికిందనే సంబరమే అంబరం దాటి
ఇప్పుడు ఇదిగో
ఇలా మరోసారి
తల బొప్పి కట్టి ప్రభుత్వ వైఖరే విమర్శలకు
గురైనంత పనైంది..ఇప్పటికే కోర్టుల్లో పదేపదే
చుక్కెదురవుతున్న ప్రభుత్వ ఖాతాలో మరో భంగపాటు చేరింది.
ఇక్కడ మరో కీలక అంశం.విమానం కొన్న పదేళ్ల తర్వాత నిర్వహణలో లోపాల వల్ల ప్రమాదానికి గురైతే దానిని తయారు చేసిన..అది కూడా సంస్థపై గాక ఎవరో చిన్న మెకానిక్ పై చర్యలు తీసుకున్న
చందాన ఈ మొత్తం
వ్యవహారంలో ప్రభుత్వం..పోలీసుల వైఫల్యాన్ని కప్పిపుచ్చుతూ
పబ్లిక్ ప్రాసిక్యూటర్ పై చర్యలు తీసుకోవడం మరీ విడ్డూరం..నారాయణకు అప్పటికప్పుడు బెయిల్ మంజూరు కావడం ప్రాసిక్యూషన్ వైఫల్యమేనని
పేర్కొనడం హాస్యాస్పదం.
అసలు కేసులోనే బలం లేనప్పుడు ప్రాసిక్యూషన్ వైఫల్యం అవుతుందా.. పోలీసుల వైఫల్యంగా పరిగణించాలా...ప్రభుత్వం ఈ చిన్న లాజిక్ మిస్ కాలేదండోయ్..అయితే ఇలా జరుగుతుందని ఊహించని పెద్దలు తీరా చేదు అనుభవం ఎదురయ్యే పాటికి ఉక్రోషంతో పిపి మీద చర్యలు తీసుకున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.ఏ కేసులోనైనా పోలీసులు దాఖలు చేసిన పత్రాలే వాదనలో ప్రాసిక్యూషన్ కు బలం..అవే పేలవంగా..లోపభూయిష్టంగా ఉంటే
ఇంక ప్రాసిక్యూషన్
చేసేది ఏదీ ఉండదు..అయినా..పరాభవం బాధలో ఉన్న సర్కారు ఇన్ని లాజిక్కులు
ఆలోచించే పరిస్థితి ఉండదు..!
ఈఎస్కే..జర్నలిస్ట్