home page

మాటలు మార్చిన జగన్ రాజకీయాల్లో ఉండొచ్చా:రఘు

వైసీపికి ఎన్ని సీట్లు వస్తాయని అంచనా?

 | 
pawan with raju

మాట ఇచ్చి తప్పితే రాజకీయాలలో ఉండడానికి అర్హులా?, అటువంటి వారికి రాజకీయాలలో కొనసాగే అర్హత ఉన్నదా?? అని ప్రశ్నించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అప్పుచేసైనా అమలు చేయాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు కోరారు. ఒకటి, రెండు అబద్ధాలకు కు, మేనిఫెస్టో అమలులో అలసత్వాన్ని ప్రదర్శించిన చంద్రబాబు నాయుడుకి 23 స్థానాలను ఇస్తే, మరియు ఇప్పుడు మా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదన్నారు.. ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చామనీ, ఎన్ని తప్పా మన్నది ఆలోచించుకుంటే భయం వేస్తుందన్నారు. వైయస్సార్ రైతు భరోసా పథకం కింద పెట్టుబడికి 50000, నేనెవరో రైతు చేతికి 12,500 ఇస్తామని చెప్పాము కానీ అధికారంలోకి వచ్చాక కేవలం ఏడు వేల ఐదు వందలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. మరో ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ, ఐదు వేల రూపాయలు రైతు నష్టపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. రైతు భరోసా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పిందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. రైతులకు బోర్లు వేయిస్తామని చెప్పాము కానీ, ఎక్కడ వేయించిన దాఖలాలు లేవన్నారు. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూపాయన్నరకు సరఫరా చేస్తామని చెప్పి, విద్యుత్ రేట్లను పెంచారని తెలిపారు. తమ జిల్లాలోని ఆక్వా రైతాంగం అంత పెరిగిన విద్యుత్ చార్జీలతో గగ్గోలు పెడుతున్నారని చెప్పారు. నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తు సహాయ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. ప్రతి నియోజకవర్గానికి శీతలీకరణ గిడ్డంగులను ,గోదాములు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ, ఒక్క నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పాపాన పోలేదన్నారు.  ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారని, కానీ ఇళ్లస్థలాలు ఇచ్చింది లేదని... గతంలో ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువ వడ్డీకే రుణాలను మంజూరు చేసే వారని, గత మూడేళ్లుగా రుణాల మంజూరు కూడా జరగడం లేదన్నారు. అగ్రకులాల కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తామని  చెప్పారని, ఏర్పాటు చేశారని... అయితే జగన్ మోహన్ రెడ్డి  నిధులను మంజూరు చేయడం మార్చారని ఎద్దేవా చేశారు.. క్షత్రియ కార్పొరేషన్ తో పాటు ఇతర కార్పొరేషన్ల చైర్మన్లకు కూర్చోవడానికి కనీసం కుర్చీ కూడా లేదని చెప్పారు.. క్రిస్టియన్ మైనార్టీ ఆడబిడ్డల పెళ్లిళ్లకు వైయస్సార్ కానుక గా లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి, ఈ మూడేళ్లలో ఏ ఒక్కరికీ ఇవ్వలేదన్నారు. ముస్లిం మైనార్టీ ఆడపిల్లల పెళ్లిళ్లు కూడా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి మొండిచేయి చూపించారని విమర్శించారు. ఇక క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలకు దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే ప్రమాద బీమా కింద 5 లక్షల రూపాయలు చెల్లిస్తామని చెప్పారని గుర్తు చేశారు.. అయితే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ తరహా పథకాలను అమలు చేయడం చూస్తామని, కానీ మత ప్రాతిపదికన ఈ పథకాన్ని అమలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. క్రిస్టియన్ లలో ఆర్థికంగా స్థితిమంతులకు కూడా ఈ పథకం అమలు చేస్తామనడం ఆశ్చర్యంగా ఉందని మండిపడ్డారు. కాపు కార్పొరేషన్ కు ఏటా రెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి ఇచ్చింది ఏమీ లేదన్నారు. విద్యా నైపుణ్య శిక్షణ కింద పాఠశాలల స్థితిగతులు మార్చి, ముఖ చిత్రాలను ప్రదర్శిస్తామని అని పేర్కొన్న జగన్ మోహన్ రెడ్డి పదవ తరగతి పరీక్ష ఫలితాలలో 94 శాతంగా ఉన్న రాష్ట్ర విద్యార్థుల ఉత్తీర్ణత ను 67 శాతానికి తీసుకురావడమే నని విద్యా నైపుణ్య శిక్షణ అని భావించాలా? అంటూ అపహాస్యం చేశారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇస్తామని చెప్పి, మూడేళ్ళలో ఒక్కరికీ ఇచ్చింది లేదని, కనీసం అక్రిడేషన్ కార్డులను  కూడా సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో లో  3.90 లక్షల ఇళ్ళను నిర్మిస్తామని చెప్పి, ఒక్క ఇంటి నిర్మాణాలు కూడా పూర్తి చేయలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో 60 నుంచి 95 శాతం పూర్తయిన మూడు లక్షల ఇళ్ళ ను కూడా పూర్తి చేసి,  అర్హులకు పంపిణీ చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునిక రిస్తామని చెప్పి, ఆధునీకరించిన ఆస్పత్రుల ముఖ చిత్రాలను ప్రదర్శిస్తామని ఆర్భాటాలకు పోయిన జగన్మోహన్ రెడ్డి, ఏ ఒక్క ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసింది లేదన్నారు.. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల సంఖ్య పెంచుతామని  చెప్పడమంటే, వాచ్మెన్ తో వైద్యం చేయించడం మా? అంటూ అపహాస్యం చేశారు. ఆసుపత్రిలో ముఖచిత్రం మారుస్తామన్న వారిని, ఏది ఆ ముఖచిత్రం అని ప్రశ్నించాలని, పాత దానికి కొత్త దానికి తేడా ఏమిటంటూ నిలదీయాలని ప్రజలను కోరారు. పేదవారికి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని చెప్పారని, గతంలో అమలులో ఉన్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో మూడు దశల్లో మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు మద్య నిషేధం అన్నదే లేదని అంటున్నారని విమర్శించారు.. ఇంట్లో సామాన్లను తాకట్టు పెట్టి తాగేవాడిని తాగుబోతు అంటారని, తాగుబోతుల ని తనఖా పెట్టి అప్పుడు తెచ్చిన వాడిని ఏమంటారని సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకు పడుతున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అప్పులు చేయకండి అని చెబుతుంటే,  రాజ్యాంగం అంటున్నారు కాబట్టి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచిస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు సి పి ఎస్ ను రద్దు చేస్తామని, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని, సకాలంలో  పి ఆర్ సి నీ అమలు చేస్తామని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వారి అర్హతను బట్టి క్రమబద్ధీకరిస్తా మని చెప్పారని అని కానీ ఏ ఒక్కరిని క్రమబద్ధీకరించి న పాపాన పోలేదన్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని పేర్కొన్నారు. 

హోదా కోసం ఉద్యమిస్తామన్నారు... కానీ అడిగే ధైర్యమే చేయడం లేదు

ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తామని, హోదాను సాధిస్తే ఉద్యోగ విప్లవం వస్తుందని ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పారని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని అడిగే ధైర్యం చేయడం లేదని ఎద్దేవా చేశారు. కనీసం రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా నైనా హోదా ఇస్తే మద్దతిస్తామని పేర్కొనాలని సూచించారు. జలయజ్ఞం పథకం ద్వారా పోలవరం, వెలిగొండ ప్రాజెక్టు లను యుద్ధ ప్రాతిపదికన  పూర్తి చేస్తామని చెప్పారని, పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. గత నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కనీసం ఇప్పుడో అప్పుడో పూర్తవుతుందని తేదీలను చెప్పేవారని, కానీ ఆ శాఖ బాధ్యతలు చేపట్టిన అంబటి రాంబాబు మాత్రం... ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొంటున్నారని గుర్తు చేశారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి నట్టు తెలిసిందని ఇప్పుడు ఏమైనా కట్టారో తెలియదని అని అన్నారు.. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పినప్పటికీ, రాష్ట్రంలో ఒక్క చెరువును పునరుద్ధరించిన దాఖలాలు లేవన్నారు. ఆరోగ్యశ్రీ  ద్వారా అందరికీ వైద్యం అందజేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఆరోగ్యశ్రీ పథకం ఎవ్వరికి అందడం లేదన్నారు. ఇప్పుడు కొత్తగా ఆసుపత్రులకు కాకుండా, ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్  ఖాతా లకు నిధులను బదిలీ చేస్తామంటున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వ్యవధిలోనే ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా తీర్చిదిద్దుతామని చెప్పి, ఏ ఒక్క ఆసుపత్రిని కూడా  అభివృద్ధి చేసింది లేదన్నారు. అగ్రిగోల్డ్ కుంభకోణం లో భాగంగా ప్రైవేటు వ్యక్తులు మోసం చేసిన ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పి న జగన్మోహన్ రెడ్డి బాధితులకు ఇంతవరకు డబ్బులను అందజేసింది లేదన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా మాత్రమే పేదలకు కాస్తో, కూస్తో న్యాయం జరిగిందన్నారు. తొలుత ఇద్దరు పిల్లలకు అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేస్తామని చెప్పి, ఆ తరువాత ఒక్కరికే పరిమితం చేశారని అని గుర్తు చేశారు. అమ్మ ఒడి పథకం లో భాగంగా ఒక ఏడాది నిధులను ఎగ్గొట్టి, ఇచ్చిన దాంట్లోనూ రెండు వేల రూపాయలు కటింగ్ చేశారని  చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేశామని తమ ప్రభుత్వ పెద్దలు పేర్కొంటున్నారని, ఆ సంఖ్య మాత్రమే నిజమని ... 95 శాతం అమలు చేయకుండా హామీలు ఇచ్చి విస్మరించారని రఘురామ కృష్ణంరాజు విరుచుకుపడ్డారు. ఈ విషయమై ఎవరైనా మంత్రులు ముందుకు వస్తే తాను చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల లో ఎన్ని అమలు చేశారో చర్చలో పాల్గొనే మంత్రులు చెప్పాలని, ఎన్ని హామీలను అమలు చేయ లేదో తాను ఆధారాలతో సహా వివరిస్తానని  అన్నారు. పింఛన్ల విషయానికి వస్తే కొద్దిగా పెంచి ఇస్తున్నారని, గతంతో పోలిస్తే ఇది కూడా ఒక పెంపెనా అని ప్రశ్నించారు. గల్లీలలో పులి లా గర్జిస్తూ, ఢిల్లీలో మాత్రం పిల్లి లా మ్యావ్...మ్యా వ్ అంటున్నారని ప్రజలు అనుకుంటున్నారని రఘురామ కృష్ణంరాజు చెప్పారు. గల్లీలో ఆ గాండ్రింపులు ఎందుకని అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా గా మాట ఇచ్చి తప్పితే రాజకీయాలలో కొనసాగే అర్హత ఉన్నదా ?లేదా?? అన్నదానిపై ఆత్మావలోకనం చేసుకోవాలని ఆయన సూచించారు. తనకు ముఖ్యమంత్రి, తమ పార్టీ అధ్యక్షుడు అంటే గౌరవం ఉన్నదని, అందుకే ప్రజలు అడుగుతు న్నట్లుగా, రాజకీయాల్లో కొనసాగే అర్హత ఉన్నదా ? లేదా?? అన్న దానిపై ఆయన స్పష్టత ఇవ్వాలన్నారు.

అన్నీ గమనిస్తున్నామని హోం మంత్రి నుంచి లేఖ

వచ్చే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నర్సాపురం లోక్ సభ పరిధిలోని భీమవరానికి అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో తాను ప్రోటోకాల్ ప్రకారం ఆ సభకు హాజరు కావాల్సి ఉన్నదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు  రాసిన లేఖకు ఆయన స్పందించి తనకు లేఖ రాశారని రఘురామకృష్ణంరాజు తెలిపారు.. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ఘటనలను, ట్విట్టర్ వేదికగా బెదిరింపులను కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా, అన్నీ గమనిస్తున్నామని కోయిల పేర్కొన్నారని వెల్లడించారు. ఒకే సామాజిక వర్గానికి కీలక పదవులను కట్టబెట్టడం యధావిధిగా కొనసాగుతుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.