home page

విశాఖలో భారీ భూకుంభకోణం

అన్ని కోర్టులలో ఓడిన కేసు

 | 
పీతల

విశాఖలో భూములకు విజయసాయి లెక్కలు 

 

విశాఖ లో భారీ భూ కుంభకోణం

ఎం పీ విజయసాయి నేతృత్వంలో మూడు వేల  కోట్ల దసపల్లా  భూములకు స్కెచ్

ఇందులో భారీ భవన సముదాయం నిర్మించి 10 వేల కోట్ల వ్యాపారానికి రంగం సిద్ధం

నిషేధిత  22ఏ లో నుంచి తప్పించే ప్రయత్నం

నాడు సేవ్ ఏ పీ పేరిట ఉద్యమం..నేడు అవే భూముల కబ్జా


విశాఖ నగరం నడిబొడ్డున మూడు వేల కోట్ల రూపాయల విలువైన దసపల్లా  భూములను కాజేసేందుకు  రంగం సిద్ధమైంది. వైఎస్సార్  కాంగ్రెస్ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జిగా ఉన్న రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి బినామీల పేరిట ఇందుకోసం ఇప్పటికే పెండింగ్ రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయాయి. విజయసాయిరెడ్డి ప్రారంభించిన స్వర్ణ భారతి ట్రస్ట్ లో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి కుడిభుజం లాంటి వస్త్ర వ్యాపారి , ఎస్ ఆర్ షాపింగ్  మాల్ అధినేత  ఎస్  గోపీనాథ్ రెడ్డి, రిటైర్డ్ ప్రభుత్వ అధికారి కే ఉమేష్ ల పేరిట  ఇందుకోసం నిబంధనల కు విరుద్ధంగా అభివృద్ధి ఒప్పందాలు జరిగిపోయాయి.  గతంలో అక్రమంగా ఈ భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్న 60 మంది నుంచి ఇందుకోసం గోపీనాథ్ రెడ్డి ఉమేష్ లు  ఎష్యూర్ ఎస్టేట్స్  డెవలపర్స్  ఎల్ ఎల్ పీ పేరిట రాత్రి కి రాత్రి  కంపెనీని ఏర్పాటు చేసి డెవలప్మెంట్ ఎగ్రిమెంట్ కుదుర్చుకున్నారు.  దానిని రిజిస్టర్ కూడా చేశారు. 16 ఎకరాల విస్తీర్ణంలో 76 వేల గజాల్లో 15 అంతస్థుల  భవన  సముదాయాలను  నిర్మించేందుకు, ఇందుకు అవసరమైతే టీ డీ ఆర్ లు  తీసుకొనేందుకు ఒప్పందాలు చేసుకున్నారు.  మూడు రాజధానుల ప్రకటన లో భాగంగా విశాఖ ను పరిపాలన రాజధాని గా 2019  డిసెంబర్ 19 న  ప్రకటించారు. ఇది జరిగిన 17 రోజుల వ్యవధిలోనే ఈ కంపెనీ ఏర్పాటు చేసి హాడావుడిగా ఒప్పందం చేసుకోవడం ఇన్ సైడ్ ట్రేడింగే.

ఈ భూములు ఇప్పటికీ నిషేధిత 22 ఏ జాబితాలో ఉన్నప్పటికీ విజయసాయి  వత్తిడి తో డాక్యుమెంట్ నెంబర్లు పీ595/2021, పీ 783/2021,పీ 985/2021 లతో విశాఖ సబ్ రిజిస్ట్రార్ కార్యక్రమంలో  రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. అయితే 22ఏ లో వుండడం,వ్యవహారం బయటకు పొక్కడంతో అధికారులు రిజిస్ట్రేషన్ లను తిరస్కరించారు.


 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా వున్న సమయంలో ఆయన  తనయుడు లోకేష్  బినామీలు ఈ భూములను కాజేస్తున్నారు అంటూ ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సేవ్ విశాఖ పేరిట 30 వేల మందితో భారీ సభ నిర్వహించారు. ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా వచ్చిన వెంటనే విజయసాయిరెడ్డి ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని రక్షిస్తుందని  ప్రకటన జారీ చేశారు. ప్రస్తుత రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష హోదాలో ఈ భూముల కుంభకోణంపై విచారణ జరపాలంటూ నేరుగా సీబీఐ కార్యాలయానికి కార్యకర్తలు తో కలసి వెళ్లి లిఖితపూర్వకంగా  ఫిర్యాదు చేసి వచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు అంతా   కుమ్మక్కై ఈ భూముల కబ్జా కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. 2021లో ఈ భూముల అభివృద్ధి ఒప్పందం కుదిరినప్పటికీ  కొందరు ప్రభుత్వ పెద్దలకు వాటాల కుదరకపోవడంతో ఇంతకాలం వాటిని పెండింగ్లో ఉంచారు.

తాజాగా  కొందరు ప్రభుత్వ పెద్దలతో ముడుపుల  ఒప్పందాలు కుదరడంతో తిరస్కరించిన రిజిస్ట్రేషన్ లను ఆమోదించి, నిషేధిత 22 ఏళ్ల నుంచి వీటిని తొలగించేందుకు రంగం సిద్ధమవుతోందని తెలిసింది. దీంతో  కారుచౌకగా కొట్టేసిన  ఈ భూముల లో  భారీ భవనాలు నిర్మించి పది వేల కోట్ల రూపాయల వ్యాపారం చేయడానికి రంగం సిద్ధమవుతోంది. నిజానికి యూ ఎల్ సీ పరిధిలోని ఈ భూముల ను తప్పడు పత్రాలతో, ప్రభుత్వ ఉత్తర్వుల తో సంబంధం లేకుండా కేవలం  ఎక్స్ పార్టీ కోర్టు  తీర్పు ల ద్వారానే కొందరు అనుమతులు పొందారు. వాటిపై చర్యలు తీసుకోవాల్సిన  ప్రభుత్వ పెద్దలు , ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తూ కబ్జాదారులకు సహకరిస్తున్నారు. గుడివాడ అమర్నాథ్ గారు  కోరిన విధంగా ఈ భూముల లావాదేవీలను తక్షణమే నిలిపివేసి సీ బీ ఐ తో  సమగ్ర విచారణ జరిపించాలి. గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు  డిమాండ్ చేసిన విధంగా భూముల కుంభకోణం నిలువరించి ఈ భూములను ప్రభుత్వపరం చేసి విశాఖ ను సేవ్ చేయాలి. తాను విశాఖలో ఒక్క గజం భూమి కూడాకబ్జా చేయలేదని   పదేపదే ప్రకటించిన విజయసాయిరెడ్డి తన మాటలను నిజం చేసుకుంటూ ఉమేష్ , గోపీనాథ్ రెడ్డి ల పేరిట చేసిన ఒప్పందాలను రద్దు చేయించాలని డిమాండ్ చేస్తున్నాం.

పీతల మూర్తి యాదవ్
 జనసేన కార్పొరేటర్ 
విశాఖపట్నం