home page

పగలే వెన్నెలా...!పట్టించుకోనిదెలా?

 | 
Street lighting

తిమ్మాపురం లో పగలే వెలుగుతున్న వీధి దీపాలు

పగలే వెలుగుతున్న వీధి దీపాలు...పట్టించుకోని సిబ్బంది

 మిర్రర్ టుడే :

అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం తిమ్మాపురం విశ్వశాంతి స్కూల్ దగ్గర పట్టపగలు కూడా విద్యుత్ లైట్లు వెలుగుతున్నాయి.
విద్యుత్‌ అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగా పట్టపగలే వీధి దీపాలు వెలుగుతూ వారి నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. దీంతో విలువైన విద్యుత్‌ వృధా అవుతుం దన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీధి దీపాల నిర్వహణలో ఉన్న సమస్య లను విద్యుత్‌ సిబ్బంది పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలో చాలా గ్రామాల్లో వీధి దీపాలు నిరంత రం వెలుగుతూనే ఉన్నాయి. పగ లు, రాత్రి తేడా లేకుండా వెలుగు తుం డడంతో వందలాది యూని ట్లు విద్యుత్‌ వృథా అవుతున్నది.పంచాయతీ ఆదాయం, జనాభా మేరకు విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయగా రాత్రి పూట ఆన్‌ చేసి ఉదయం పూట ఆఫ్‌ చేయాలి. కానీ అలా జరగడం లేదు.  దీంతో గ్రామ పంచాయతీలకు వేల రూపాయల బిల్లులు వస్తున్నాయి. అధికారులు స్పందించి గ్రామాలలో వీధిలైట్లకు ప్రత్యేక లైన్‌ ఏర్పా టుచేసి ఆన్‌ఆఫ్‌ స్విచ్‌లను ప్రజలు కోరుతున్నారు.