టిడిపి జెండా తోనే అంత్య క్రియలు
వైసీపి నాయకుని తుది కోరిక
టిడిపి జెండాతో అంత్యక్రియలు!!
వైసిపి కార్యకర్త అంతిమ కోరిక
****
పొరపాటో, గ్రహపాటో ఏమో తెలీదు కానీ తాను ఓ తప్పటడుగు వేశానని బాధపడ్డాడు.. కాదు..కాదు.. మథన పడ్డాడు...అవును పార్టీ ఆవిర్భావం నుంచి టిడిపితోనే ఉన్న ఆ కార్యకర్త ఈమధ్య వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరాడు.. ఏమో.. సొంత ఇంటి నుంచి అద్దె ఇంట్లోకి వచ్చినట్లు అనిపించింది. ఊపిరాడలేదు.. ఇంకా చేసేదేం లేక.. కొత్త పార్టీలో ఇమడ లేక రాజకీయాలకు దూరమయ్యాడు.. ఏదో జబ్బుచేసి మంచాన పడితే పాత మిత్రులు పరామర్శకు వస్తే తాను చనిపోయాక టిడిపి జెండా కప్పాలని కోరాడు.. అంతే.. ఆ మరునాడు కన్ను మూశాడు.. పాత మిత్రులు వచ్చి తన అంతిమ కోరిక మేరకు అలాగే టిడిపి జెండా కప్పి అంత్యక్రియలు జరిపించారు.
విశాఖ జిల్లా భీమిలికి చెందిన అప్పికొండ అప్పలనాయుడు టీడీపీ ఆవిర్భావం నుంచీ పార్టీలో ఉన్నారు. ఎందరో సీనియర్ నాయకులతో అనుబంధం.. ఎన్నో కార్యక్రమాల్లో హుషారుగా పాల్గొనే కాదు. అయితే స్థానికంగా ఏమి ఇబ్బంది వచ్చిందో గానీ
మూడేళ్ల క్రితం వైసీపీలో చేరారు. అయితే అక్కడ కుదురుకోలేక కొంత కాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు.. టీడీపీని వీడానన్న భావన ఆయన్ను మరింత క్రుంగదీసింది
కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయనను ఆదివారం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కోరాడ రాజబాబు, గంటా నూకరాజు, డి.ఎ.ఎన్.రాజు పరామర్శించారు......
ఈ సందర్భంగా ‘వైసీపీలో చేరి పెద్ద తప్పు చేశాన
ని, ..
ఒకవేళ మరణిస్తే తన మృతదేహంపై టీడీపీ జెండా కప్పి అంతిమయాత్ర జరిపించండి....అంటూ అప్పలనాయుడు వారిని కోరారు.దురదృష్టవశాత్తూ ఆ మరునాడే
(సోమవారం) అప్పల నాయుడు చనిపోయారు.
దీంతో కోరాడ రాజబాబు బృందం మృతదేహాన్ని సందర్శించి ఆయన కోరుకున్నట్టే మృతదేహంపై టీడీపీ జెండాలు కప్పి అంతిమ యాత్ర జరిపించారు. మొత్తానికి దశాబ్దాలపాటు పార్టీతో ఉన్న అనుబంధాన్ని వదులుకున్నందుకు ఆయన ఎంతగా మథన పడ్డారో అని అభిమానులు ఆవేదన చెందారు. మొత్తానికి ఆయన అంతిమ కోర్కెను మిత్రులు నెరవేర్చి ఆయన్ను ఊర్ధ్వ లోకాలకు సాగనంపారు.