కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అస్వస్థత
చెన్నై కు తరలింపు: నిలకడగా ఉన్న ఆరోగ్యం
Updated: May 27, 2022, 21:46 IST
| 
గడప గడపకీ తెచ్చిన ముప్పు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమంచర్లలో 'జగనన్న మాట-గడపగడపకూ కోటంరెడ్డి బాటలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
పదిహేను రోజుల క్రితం నుండి కూడా కోటంరెడ్డి వెన్ను నొప్పితో బాధపడుతున్నారు . ఇవాళ అరుంధతీనగర్ లో గడపగడపకీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలసటగా ఉందంటూనే కుప్ప కూలిపోయారు. వెంటనే నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం చెన్నై తీసుకుని వెళ్ళాలని సలహా ఇచ్చారు.దాంతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని చెన్నై తీసుకుని వెళ్ళారు.