home page

ప్రత్యేక కోర్టుకు కాకాణి కేసులు

జిల్లా కోర్టుకు ఆదేశాలు జారీ

 | 
Kakani

అన్ని కేసుల డాక్యుమెంట్లు పంపాలని ఆదేశం

మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కి సంబంధించి నమోదైన అన్ని కేసుల డాక్యుమెంట్లు ప్రత్యేక కోర్టుకు పంపాలని సదరు కోరటు ఆదేశించింది. మొన్న చోరీకి గురైన కేసుకు సంబంధించి పోలీసులు రికవరీ చేసుకున్న డాక్యుమెంట్లు సైతం పంపాలని ప్రజాప్రతినిధులు కేసులు విచారిస్తున్న ప్రత్యేక కోర్టు ఆదేశించింది. 

నెల్లూరు నాలుగో ఏడీఎం కోర్టులో డాక్యుమెంట్ల చోరీకి సరిగ్గా వారం క్రితం ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులను విచారించే విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానం నెల్లూరు కోర్టుకు ఉత్తర్వులు పంపిస్తూ.. విచారణలో ఉన్న ప్రజాప్రతినిధుల కేసులను తమకు బదిలీ చేయాలని, ఆ కేసులకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లను తమకు పంపాలని ఆదేశించింది. స్పందించిన కోర్టు మంత్రి కాకాణిపై నమోదైన 11 వరకు కేసులను బదిలీ చేసి, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను విజయవాడ ప్రత్యేక న్యాయస్థానంలో అప్పగించేందుకు రెడీ అయింది. అంతలోనే ఈ నెల 13న ఆ డాక్యుమెంట్లు చోరీకి గురికావడం కలకలం రేపింది. అయితే, కుక్కలు మొరగడంతో దొంగలు కోర్టు హాలులోకి పరిగెట్టారని, ఈ క్రమంలో అక్కడ పాతవస్తువులను దొంగిలించేందుకు ప్రయత్నించారని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆ డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లారని చెప్పడంపై ప్రతిపక్ష నేతలు సందేహాలు వ్యక్తం చేశారు. కాగా, చోరీ జరిగిన స్థలంలో చెల్లాచెదురుగా పడిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానానికి అప్పగించినట్టు నెల్లూరు పోలీసులు చెబుతున్నప్పటికీ, అవి తమకు అందలేదని విజయవాడ న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి.

హైదరాబాద్ : ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై నమోదైన ఫోర్జరీ కేసుకు సంబంధించి మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. నెల్లూరు నాలుగో ఏడీఎం కోర్టులో డాక్యుమెంట్ల చోరీకి సరిగ్గా వారం క్రితం ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులను విచారించే విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానం నెల్లూరు కోర్టుకు ఉత్తర్వులు పంపిస్తూ.. విచారణలో ఉన్న ప్రజాప్రతినిధుల కేసులను తమకు బదిలీ చేయాలని, ఆ కేసులకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లను తమకు పంపాలని ఆదేశించింది. స్పందించిన కోర్టు మంత్రి కాకాణిపై నమోదైన 11 వరకు కేసులను బదిలీ చేసి, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను విజయవాడ ప్రత్యేక న్యాయస్థానంలో అప్పగించేందుకు రెడీ అయింది. అంతలోనే ఈ నెల 13న ఆ డాక్యుమెంట్లు చోరీకి గురికావడం కలకలం రేపింది. అయితే, కుక్కలు మొరగడంతో దొంగలు కోర్టు హాలులోకి పరిగెట్టారని, ఈ క్రమంలో అక్కడ పాతవస్తువులను దొంగిలించేందుకు ప్రయత్నించారని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆ డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లారని చెప్పడంపై ప్రతిపక్ష నేతలు సందేహాలు వ్యక్తం చేశారు. కాగా, చోరీ జరిగిన స్థలంలో చెల్లాచెదురుగా పడిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానానికి అప్పగించినట్టు నెల్లూరు పోలీసులు చెబుతున్నప్పటికీ, అవి తమకు అందలేదని విజయవాడ న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి.