home page

జూలై 11 ముహూర్తం ఫిక్స్!

అవినీతి ఆరోపణలు నిరూపించండి

 | 
శ్రీవాణి

కురుపాం 'కురుక్షేత్ర' కేంద్రం:     రండి తేల్చుకుందాం!

ముహూర్తం ఫిక్స్!!
శ్రీవాణి నిజాయితీ/ అవినీతి నిరూపణకు అదే ముహుర్తం
ఇందుమూలంగా యావన్మంది ప్రజానీకం, వైరివర్గం వారికి తెలియజేయునది ఏమనగా మీరంతా జులై 11 తేదీన కురుపాం సెంటర్లోకి వచ్చి నా మీద ఏమైనా అవినీతి ఆరోపణలు ఉన్నట్లయితే వాటిని రుజువు చేయగలరు. ఇదే సమయానికి నేను, మా మద్దతుదారులతో వచ్చి మేం ఎంతటి నిజాయితీపరులమన్నది సైతం రుజువు చేసుకుంటాం మేం తెల్లకాగితం లాంటివాళ్ళం.. నామీద రూ.500 కోట్ల అవినీతి ఆరోపణలు చేసిన వారు ఆరోజు డాక్యుమెంట్ ఎవిడెన్సులు తీసుకొచ్చి వాటిని ప్రజా కోర్టులో చూపించి నన్ను దోషిగా నిరూపించుకోవచ్చు.. 
ఇట్లు
పుష్పశ్రీవాణి, ఎమ్మెల్యే, కురుపాం
****
శ్రీవాణిఇదే నిజంగా ఆహ్వాన పత్రం కాదుగానీ, తనమీద తన ఆడపడుచు, టీడీపీ నాయకురాలు పల్లవిరాజు (దివంగత చంద్రశేఖరరాజు కుమార్తె), ఇంకా మాజీ మంత్రి, శ్రీవాణి పెదమామ శతృచర్ల విజయరామరాజు చేసిన రూ.500 కోట్ల అవినీతి ఆరోపణలు శ్రీవాణి ని బాగా డిస్టర్డ్ చేసినట్లున్నాయి. అందుకే ఆమె అంతగా బరస్ట్ అయ్యారు. గురువారం జరిగిన పార్వతీపురం జిల్లా పార్టీ ప్లీనరీలో మాట్లాడుతూ తన మీద ఆరోపణలు చేసిన వారికి ఇదే నా సవాల్... జులై 11వ తేదీన కురుపాం సెంటర్లో మాట్లాడుకుందాం రండి. ... ఆరోపణలకు సంబంధించిన వివరాలు తీసుకుని రండి..
నా అవినీతిని నిరూపించండి.. రూ.500 కోట్లు కాదు. కనీసం రూ.50 కోట్లు అయినా ని రూపించండి.. అన్నారు. ఇలాంటి సవాళ్లు రాజకీయాల్లో అత్యంత సహజం అన్న విష అందరికీ తెలిసిందే. ఇవేమీ నిరూపణ అయ్యేవి కాదు. పోనీ ఎవరైనా అక్రమాస్తులు సంపాదించుకున్నా తమ పేరుమీద ఉంచుకుంటారా ఏంటి? తమ చుట్టాలు... బం ధువులు, పాలేర్లు.. పనిమనుషులు, ఇతర బినామీల పేర్ల మీద దాచుకుంటారు గానీ అందరికీ తెలిసేలా సొంత పేర్లమీద ఉంచరు అన్నది అందరికీ తెలిసిందే. ఇవన్నీ తేలేది కాదు.. రుజువయ్యేది లేదు. కాబట్టి ఇలాంటి సవాళ్లు ఎన్నయినా చేయొచ్చు. కేవలం తన తండ్రి మద్దతులో గెలిచిన శ్రీవాణి గెలిచాక తన తండ్రిని అవమానించారని, తమ కుటుంబ మద్దతుతో గెలిచి, చివకు తమ కుటుంబాన్నే చిన్నచూపు చూశారని పల్లవి రాజు, విజయరామరాజు ఇద్దరూ ఆరోపించారు. అంతేకాకుండా శ్రీవాణి మంత్రి
 అయ్యాక అంతులేని అవినీతికి పాల్పడ్డారని దాదాపు రూ.500 కోట్లు పొగేశారని సంచలనం
 రేపారు. ఈ ఆరోపణలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపాయి. దీంతో వాటిని ఎలా ఎదుర్కొవాలి, తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకునేందుకు ఏం చేయాలన్న ఆలోచనల్లో పడిన శ్రీవాణి ఇదిగో పార్టీ సమావేశంలో ఇలా డేట్ ఫిక్స్ చేశారు. చూడాలి. ఈ సవాల్ను టీడిపి ఎలా రిసీవ్ చేసుకుంటుందో... ఆమె అవినీతిని నిరూపిస్తారా... అది అయ్యేది కాదని ఊరుకుంటారా చూడాలి.. ప్రజలు సైతం ఈ సవాల్ పట్ల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.