home page

జగన్,మోడీలు ఆంధ్రా ద్రోహులు

జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫోరం విమర్శ 

 | 
Jai andhra

మోడీకి మట్టితో నిరశన

ఆంధ్ర ద్రోహులు మోడీ, జగన్
 హోదా విభజన హామీలపై మాట్లాడకపోవడం మోసం
 కేంద్రానిది కక్ష పూరిత వివక్ష ధోరణి
 మోడీ పర్యటనకు మట్టితో నిరసన దీక్ష
 గుంటూరు జూలై 4 :
 ఆంధ్రప్రదేశ్ కు తీరని ద్రోహం చేసిన నరేంద్ర మోడీ, వైయస్ జగన్మోహన్ రెడ్డిలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫోరం (జెడిఎఫ్)నాయకులు హెచ్చరించారు. మోడీ పర్యటనకు నిరసనగా జేడీఎఫ్ ఆధ్వర్యంలో గుంటూరులో మట్టిచేత బూని నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు మాట్లాడుతూ ప్రత్యేక హోదా విభజన హామీలపై తిరుపతి వెంకన్న సాక్షిగా నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్రానికి ఒక్క విభజన హామీని అమలు చేయలేదని విమర్శించారు. భీమవరం సభలో హోదా, విభజన హామీలపై నరేంద్ర మోడీ మాట్లాడకపోవడం ఆయన మోసపూరిత వైఖరికి నిదర్శనం అన్నారు. బీజేపీని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్ఛరించారు. కులం మతం పేరుతో బిజెపి రాజకీయాలు చేస్తుందని సిపిఐ నాయకులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టే హక్కు లేదని విమర్శించారు. విభజన హామీల ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని జెడిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అవధానుల హరి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటి పైకి రావాలని జెడిఎఫ్ గౌరవ అధ్యక్షుడు పెళ్లకూరు సురేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. అమరావతి, పోలవరం, దుగ్గ రాయపట్నం పోర్టు, వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వకుండా నరేంద్ర మోడీ మోసం చేశారని అమరావతి జేఏసీ నాయకులు పి మల్లికార్జునరావు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మార్చారని ఏపీ ప్రొఫెషనల్ ఫోరం (ఏపిపి ఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు నేతి మహేశ్వరరావు విమర్శించారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉద్యోగ, ఉపాధి లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం, అవగాహన సంస్థ అధ్యక్షుడు కొండా శివరామిరెడ్డి , అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వీరాస్వామి, ఏపీజేఎఫ్ నాయకులు రంగారావు, సూర్యా , వ్యవసాయ శాస్త్రవేత్త రామారావు సికిందర్ తదితరులు నిరసన దీక్ష సందర్భంగా ప్రసంగించారు.