home page

బెంబేలెత్తి పోతున్న 'జగన్ జనం'

ఎమ్మెల్యేలపై జనం తిరుగుబాటు 

 | 
Ysrcp

ఇదివరకు ఎప్పుడూ లేనట్టుగా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు జనం దగ్గరికి వెళ్తుంటే జనం తిరగబడుతున్నారు చి కొడుతున్నారు ప్రశ్నిస్తున్నారు తీసి పారేసినట్టు మాట్లాడుతున్నారు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎప్పుడు చూడనంత దురుసుగా జనం ఎమ్మెల్యేలు మంత్రుల స్థాయి వాళ్ళతో కూడా మాట్లాడటం గమనార్హం. దీనికి కారణాలు ప్రభుత్వం వైఫల్యాలా? ప్రభుత్వం పైన ఉన్న చిరాకా అనేది పక్కన పెట్టి ఇంకొంచం మూలల్లోకి వెళ్లి చూస్తే గత మూడు ఏళ్లగా అధికార పక్షం అధికార పక్ష ఎమ్మెల్యేలు మంత్రులు అవలంబించిన ప్రతిపక్షాలపై అవలంబించిన విధానాలే కారణంగా కనబడతాయి. గతంలో ఎమ్మెల్యే అంటే భక్తి లేకపోయినా ఎంతో కొంత గౌరవం ఒక భయం మనిషికి కాకపోయినా ఆ పదవికి ఉండేది . కానీ ఎప్పుడైతే వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎదుటి పక్షం వారిని వారి స్థాయిని, వయసును కూడా చూడకుండా తూనా బొడ్డు అని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ని సుదీర్ఘ కాలం మంత్రులు గా వున్న వాళ్ళని   వాడు వీడు అని మాట్లాడుతూ అరేయ్ తురెయ్ లు కొడుతుంటే జనంలో రాజకీయ నాయకుడు అనేవాడే పల్చన అయిపోయిన పరిస్థితి వచ్చింది. అంతకు ముందు ఉండే గౌరవం భయం స్థానే జనం లో కూడా లెక్కలేని తనం వచ్చింది.  వాడు తన కన్నా పెద్దవాళ్ళ ని మాట్లాడితే వాడికి అవ్వనిది, మనం వీడిని మాట్లడితే మనకు అవుతుందా ఏంటి? బొచ్చు, తొక్క అనే వైసీపీ మార్క్ ఆలోచనా ధోరణి జనం కి కూడా బాగా ఎక్కింది.

సీజనల్ రాజకీయ నాయకులు అనుభవం వున్న రాజకీయ నాయకులు అందుకే ఎప్పుడూ కూడా ఓటమి గెలుపు లు ఆరోపణలు ఎలా ఉన్నా వ్యక్తిగత స్ధాయిలో  పరస్పర గౌరవాలు మెయింటైన్ చేసుకుంటారు.  స్ధాయి ని పలచన కానిచ్చే వారు కాదు. జనంలో తన ప్రత్యర్థి స్థాయి తగ్గితే తన స్థాయి కూడా తగ్గినట్టే అని ఎరుక  కలిగి ఉంటారు. ఎదుటి పక్షం వాడిని కనీసం విలన్ గా ఉంచాలి తప్ప, అంత కన్నా తక్కువ స్థాయి కి తీసి పారేస్తే వ్యక్తి గా అతని కి అయ్యే డే మేజ్ ఎఫెక్ట్ లో తమ డామేజీకాకుండా చూసుకుంటూ వుంటారు . ఫ్యాక్షన్ పగ ల తో రగిలి పోయే నాయకుల తో సహా అందరూ కూడా ఇదే మైంటైన్ చేస్ వారు 100 శాతం కాకపోయినా 95 శాతం మంది. . అవతల వాడిని జనం లో లెక్క లేకుండా చేస్తే తన స్థాయి కూడా ఆటోమేటిక్గా పడిపోయి పలచన అవుతాను అనే ఆలోచన కలిగి ఉంటారు

అడ్డగోలుగా ఏదో రకంగా రాజకీయ నాయకులు అయిపోయిన వాళ్లలో ఈ స్పృహ కనబడదు.మనం  మాధవ రెడ్డి అంటే అవతల వాళ్ళు తప్పక సూరీడు అంటారు అని,లేకపోతే మన విరిగిన వెన్ను గురించి మాట్లాడతారు అనీ, 16 నెలలు జైల్లో వున్నప్పుడు అని మాట్లాడతారు అనీ...వాళ్ళ పరువు తో పాటు మనదీ పోతుంది అనీ... చూసే జనం లో మొత్తం గా గౌరవాలు, భయాలు అందరం కోల్పోతాము అని కానీ సోయ వుండదు,ఇంగిత జ్ఞానం ఏడవని ఫలితమే ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ లో గడప గడప కి వెళ్తున్న వారికి దక్కుతున్న గౌరవాలలో, చిత్కారాల లో చూస్తూ ఉన్నాం.