home page

నెలనెలా శ్రీవారికి వందల కోట్లు!

జూలై చివరి నాటికి 140 కోట్లు అంచనా!

 | 
Ttd

తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయంలో కొత్త రికార్డు సృష్టించింది.. జులై మాసంలో కోనేటిరాయుడికీ కాసుల వర్షం కురుస్తోంది.. ఈ నెలలో కేవలం 21 రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్‌ను క్రాస్‌ చేసింది శ్రీవారి హుండీ ఆదాయం.

జులై 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు శ్రీవారికీ హుండీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ. 100 కోట్ల 75 లక్షల రూపాయల ఆదాయంగా వచ్చింది.. జులై మాసంలో స్వామివారికి ఇంత మొత్తంలో హుండీ ఆదాయం లభించడం ఇదే తొలిసారి.. ఇక, టీటీడీ చరిత్రలోకే అత్యధిక స్థాయిలో ఆదాయం జులై మాసంలో లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు.. ఇప్పటి వరకు గత మే మాసంలో లభించిన 130 కోట్ల రూపాయలే అత్యధిక హుండీ ఆదాయం కాగా.. ఈ నెల 31వ తేదీ వరకు మరింత ఆదాయం వస్తుంది కాబట్టి.. మొట్ట మొదటి సారి హుండీ ద్వారా ఒకే మాసంలో 140 కోట్ల రూపాయలు ఆదాయం శ్రీవారికి లభించే అవకాశం ఉందంటున్నారు.

CJI Justice NV Ramana: మీడియా కంగారు కోర్టులను నడిపిస్తోంది.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఫైర్

కరోనా మహమ్మారవి విజృంభణ తర్వాత చాలా కాలం శ్రీవారికి దూరం అయ్యారు సామాన్య భక్తులు.. దాదాపు రెండేళ్ల తర్వాత తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. మరోవైపు హుండీలో కాసుల వర్షం కురుస్తోంది.. గత ఐదు నెలలుగా రూ.100 కోట్ల మార్క్‌ను దాటేసి కొత్త రికార్డులు సృష్టిస్తూ వస్తుంది టీటీడీ.. మార్చి నెలలో శ్రీవారికి రూ.128 కోట్ల ఆదాయం, ఏప్రిల్‌ రూ.127.5 కోట్లు, మే మాసంలో రికార్డు స్థాయిలో 130.05 కోట్ల , జూన్‌ మాసంలో రూ.123 కోట్ల ఆదాయం రాగా.. జులై మాసంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నప్పటికీ.. స్వామి వారి హుండీ ఆదాయం రికార్డులు సృష్టిస్తోంది.. ఈ నెలలోనే 4వ తేదీ టీటీడీ చరిత్రలోనే అత్యధికంగా రూ.6.18 కోట్ల ఆదాయం లభించింది.. దీంతో మరో పది రోజుల హుండీ ఆదాయం సరాసరి లెక్కించినా.. జులై మాసంలో టీటీడీ ఆదాయం కొత్త చరిత్ర లిఖిస్తుందని అంచనా వేస్తున్నారు.. ఐదు నెలల కాలంలోనే శ్రీవారి హుండీ ఆదాయం 650 కోట్ల రూపాయాలను క్రాస్‌ చేయగా.. ఈ ఏడాది మొత్తం ఆదయాం రూ. 15 వందల కోట్లును కూడా దాటేసే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు అధికారులు.Srivari