ఉద్యోగులకు జగన్ సర్కారు షాక్!
అమరావతిలో ఇచ్చిన ఉచిత వసతి రద్దు
Updated: Jun 29, 2022, 18:33 IST
| ఉద్యోగులకు వసతి ఇచ్చిన చంద్రబాబు
*అమరావతి*
_*అమరావతిలో ఉద్యోగులకు ఉచిత వసతి రద్దు... రేపటిలోగా ఫ్లాట్లను ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశం*_
*రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి అమరావతికి ఉద్యోగులు*
*- ఉద్యోగులకు అమరావతిలో ఉచిత వసతి కల్పించిన టీడీపీ ప్రభుత్వం*
*- ఫ్లాట్లను మంచి స్థితిలోనే అప్పగించాలని జీఏడీ ఆదేశాలు*
★ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కారు బుధవారం భారీ షాకిచ్చింది.
★ రాజధాని అమరావతి పరిధిలో ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత వసతిని రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
★ ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.
★ రేపటిలోగా ఫ్లాట్లను ఖాళీ చేయాలని కూడా సదరు ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది.
★ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ నుంచే పాలన సాగించాలన్న నిర్ణయం తీసుకున్న నాటి టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులను అమరావతికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
★ ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చిన ఉద్యోగులకు ఉచిత వసతి కల్పించింది.
★ వారానికి 5 రోజుల పని విధానాన్ని అమలు చేసింది.
★ తాజాగా ఈ ఉచిత వసతిని వైసీపీ సర్కారు రద్దు చేసింది.
★ అంతేకాకుండా ఇప్పటిదాకా ఉంటున్న ఫ్లాట్లను మంచి స్థితిలోనే అప్పజెప్పాలని ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది.
★ ఆయా ఫ్లాట్లకు ఏదైనా నష్టం జరిగి ఉంటే దానికి ఉద్యోగులే బాధ్యత వహించాలని కూడా తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
#PVR #TDPWillBeBack #MLC_BtechRavi
#quitjagansaveandhrapradesh