home page

మళ్ళీ పోరుబాట లో ప్రభుత్వ ఉద్యోగులు, మే 5 నంచి

పిఆర్సీ పై మళ్ళీ ఉద్యమం మలిదశకు 

 | 
ఉపాధ్యాయుల కొత్త ఉద్యమం వస్తుందా?

గత ఫిబ్రవరిలో అటకెక్కిన 
 ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ పోరు మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో 11వ పీఆర్సీ ప్రకటన సందర్భంగా సీఎం జగన్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న నేతలు.. మరోసారి పోరుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఉద్యోగుల నేత సూర్యనారాయణ ఇవాళ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడంపై మే 5న సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

ఉద్యోగులు
ఉద్యోగుల్లో అసంతృప్తి
ఏపీలో గతంలో సాగిన పీఆర్సీ పోరు నేపథ్యంలో ప్రభుత్వం అరకొర ఫిట్ మెంట్ ను ఖరారు చేసింది. దీనిపై అప్పట్లో ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించినా నేతలు మాత్రం సీఎం జగన్, సజ్జలతో జరిగిన చర్చల్లో సంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా పీఆర్సీతో పాటు ఇతర డిమాండ్లపై ప్రభుత్వ ప్రకటనల్ని అంగీకరించారు. దీంతో ప్రభుత్వం కూడా తాము చేయాల్సింది చేసేసింది. ఇప్పటికీ ఆ డిమాండ్లు నెరవేరకపోవడంతో తిరిగి ఉద్యోగుల్లో అసంతృప్తి తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ నేత సూర్యనారాయణ ఇవాళ కీలక ప్రకటన చేశారు.

ఎందుకంటే
గతంలో ఎందుకు అంగీకరించామంటే ?
గతంలో సీఎం జగన్ తో చర్చించిన తర్వాత పీఆర్సీని తప్పనిసరి పరిస్ధితుల్లోనే అంగీకరించినట్లు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ ఇవాళ విజయవాడలో వెల్లడించారు. కానీ అప్పుడు ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగులు ఎవరూ సంతృప్తిగా లేరన్నారు. పీఆర్సీపై ఒప్పందం సందర్బంగా ఇచ్చిన హామీలు ఇవాళ్టికీ అమలుకాలేదన్నారు. ఇవాళ్టికీ వాటిపై సర్కార్ ఉత్తర్వులు ఇవ్వలేదని సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రభుత్వంలో చిత్తశుద్ధఇ లేకపోవడమా, అధికారుల అలసత్వమా కారణాలు తెలియడం లేదన్నారు.
భవిష్యత్ కార్యాచరణ
మే 5న భవిష్యత్ కార్యాచరణ
పీఆర్సీ ఒప్పందం నేపథ్యంలో సీపీఎస్ రద్దుతో పాటు ఇచ్చిన ఇతర హామీలు కూడా అమలు కాలేదని ఉద్యోగుల నేత సూర్యనారాయణ తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదని, ఉద్యోగులు వాస్తవ పరిస్ధితుల్ని అర్ధం చేసుకోవాలని సూర్యనారాయణ కోరారు. సీఎం జగన్ విశ్వసనీయత పోగొట్టుకోవద్దని ఆయనకోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల మధ్య ఉన్న అనైక్యతను ప్రభుత్వం సొమ్ము చేసుకుంటోందన్నారు. అందుకే మే 5న సమావేశమై ఉద్యోగ సంఘాలు భవిష్యత్ నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.