home page

రైతు భరోసా లేని కేంద్రాలు

మిల్లర్లు మాయాజాలం-సర్కారు జులం

 | 
Raghu
రైతులను దోచుకు తింటున్న భరోసా కేంద్రాలు
 
ఎంపీ రఘురామ కృష్ణంరాజు
 
రైతు భరోసా కేంద్రాలు... రైతు దగా కేంద్రాలు మారి రైతులను దోచుకు తింటున్నాయని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు విరుచుకుపడ్డారు.  ఈ విషయాన్ని మృదుస్వభావి, నిజాయితీపరుడైన పిల్లి సుభాష్ చంద్రబోస్  కూడా చెప్పారు కదా అన్నారు. ఒక్కొక్క బస్తా నుంచి 200 రూపాయల వరకు మోసగించి  అధికారులు,  రైస్ మిల్లర్లు స్వాహా చేస్తున్నారని ఆయన  పేర్కొనడం పై రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ... శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదని,  రైతు భరోసా కేంద్రాలు ఇంతటి అవినీతి అక్రమాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి తెలియకుండా ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు.  ప్రముఖ దినపత్రిక ఈనాడు అబద్ధాలను చెబుతుందని జగన్మోహన్ రెడ్డి  భావిస్తే సరేసరి కానీ  పిల్లి సుభాష్ చంద్రబోస్ అబద్ధం చెప్పరు కదా ? అంటూ నిలదీశారు.  రైస్ మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై రైతుల ఆధార్ ను అనుసంధానం చేయకుండా, ఒక వేళ చేసినా అనుసంధాన ప్రక్రియను వారికి తెలియకుండా రైతు  భరోసా కేంద్రానికి ధాన్యం చేరకముందే అవినీతికి పాల్పడుతున్నారని, ఈ విషయాన్ని  ఇప్పటికే తాను పలుమార్లు చెప్పానని గుర్తు చేశారు. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై అవినీతికి పాల్పడుతుంటే ముఖ్య మంత్రికి తెలియకుండా ఉంటుందా?, ఒకవేళ ముఖ్యమంత్రికి తెలియకపోతే  ఆయన  సీఎం కుర్చీలో కూర్చో వడానికి అర్హుడే కాదని అన్నారు. రైతు భరోసా కేంద్రాలలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి తెలియకపోతే పిల్లి సుభాష్ చంద్రబోస్ ను  అడిగి వివరాలను తెలుసుకొని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. కొత్త నెల్లూరు జిల్లాలో ఇప్పటికీ రెండు వందల అరవై కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు చెల్లించవలసి ఉన్నదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. భరోసా లేని రైతు భరోసా కేంద్రాలు నిర్మించిన గుత్తేదారులకు  బిల్లులు చెల్లించేది ఎప్పుడో నంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  రైతు భరోసా కేంద్రాలు నేను పది శాతం కూడా లావాదేవీలు జరగడం లేదన్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు.. రైతులు తీసుకువచ్చిన బస్తాల ధాన్యం తగ్గించి చూపించి, ఇతరుల పేరిట ఆ ధాన్యాన్ని చూపిస్తున్నారని అన్నారు. గడపగడపకు ప్రభుత్వం కాదని బస్సు యాత్రను చేపట్టాలని నిర్ణయించారన్నారు. బిసి, ఎస్సీ మంత్రులు బస్సు యాత్ర చేసి   నిరుద్యోగులు అడిగే ప్రశ్నలకు ఏమి సమాధానాలు చెబుతారని ప్రశ్నించారు.. బీసీ మంత్రులు ధర్మాన  ప్రసాదరావు, వేణు లు నిరుద్యోగ బీసీలు, తమకు ఎందుకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని ప్రశ్నిస్తే.. తమ నలుగురికి మంత్రి ఉద్యోగాలు ఇచ్చారని, ఇంకా ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తారా? అని ప్రశ్నిస్తారా అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. నారాయణస్వామి తాను ఏమి చదివినా,  చదవకపోయినా ఉప ముఖ్యమంత్రి పదవి  ఇచ్చారని చెప్పుకుంటారా?  అని నిలదీశారు. ఏపీ లోని నాలుగు రాజ్యసభ స్థానాలో ఇద్దరు బీసీలకు ఇచ్చారని, అందులో ఒక తెలంగాణ బీసీ నాయకుడికి ఇచ్చారన్నారు.. అయితే 50 శాతం ఉన్న బీసీలకు రెండు స్థానాలు ఇవ్వగా,  5 శాతం ఉన్న రెడ్లకు 2 స్థానాలు ఇచ్చారని ప్రజలు ప్రశ్నించారా రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. బస్సులలో తిరిగి కుల రాజకీయం చేయడం కాదని, ప్రజా రాజకీయం చేస్తే ప్రజలు హర్షిస్తారన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సభలకు వచ్చే ప్రజల్లో పశ్చాత్తాపం కనిపిస్తోందని కడప జిల్లాలో సీఎం పునాదులు కదులుతున్నాయని తెలుస్తోందన్నారు. సీఎం సభకు డేరాలు, కుర్చీలు వేసిన తీసుకు వచ్చిన ప్రజలు మధ్యలోనే పారిపోతున్నారని, దీనితో ప్రజాగ్రహాన్ని గ్రహిస్తే మంచిదని రఘురామ కృష్ణంరాజు అన్నారు ఎవరు
శ్రీలంక , ఏపీ పరిస్థితి సేమ్ టు సేమ్
ఏపీ  లో ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించడానికి నిధులు లేవని, శ్రీలంకలో ను పదవ తరగతి విద్యార్థుల పరీక్షలను నిర్వహించడానికి డబ్బు లేని పరిస్థితులు నెలకొన్నాయని... దీనితో ఏపీ, శ్రీలంక ఆర్థిక పరిస్థితులు అచ్చంగా ఒకే విధంగా ఉన్నాయని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. కోనసీమ జిల్లాకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో, సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేయడం పట్ల రఘురామ కృష్ణంరాజు స్పందించారు. రానున్న ఎన్నికల్లో పివి సునీల్ కుమార్ కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అమలాపురం టికెట్ కేటాయించే అవకాశం ఉందని, అలాగే అడిషనల్ ఎస్పీ గా కొనసాగుతున్న  విజయ్ పాల్  ఇప్పటికే ఒక ఏడాది పొడగింపు ఇచ్చారని, మరొక ఏడాది పొడగింపు ఇచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. మనకు నచ్చని వ్యక్తులను టార్గెట్ చేసి నీతి మాలిన చర్యలకు పాల్పడితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు ఈ విధంగా కూడా కృతజ్ఞత చూసుకుంటారని తనకు తెలియదని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు 
 
రైతుల ఉసురు పార్టీకి శ్రేయస్కరం కాదు
 
పేదలకు అన్నం పెట్టే రైతులు మోసం చేసిన వారు బాగుపడిన దాఖలాలు లేవని, రైతు ఉసురు పార్టీకి తగిలితే పుట్టగతులు లేకుండా పోతాయని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఇప్పటికీ కొట్టుకున్న డప్పు చాలని, రైతు భరోసా కేంద్రాలలో ధాన్యానికి  మద్దతు ధర ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 
ఏ ఒక్క వర్గం పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదు
ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, రైతులు ఏ ఒక్కరూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదన్నారు.  రైతు భరోసా కేంద్రాలు వేదికగా.. రైతులకు దగా,  మోసం జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసునన్నారు. ఎస్ సి , బి సి లలో రైతులు లేరా?, వారు ఎందుకు ఓట్లు ఇస్తారని అని ప్రశ్నించారు.
 
విలువలు కలిగిన నాయకుడు నీలం 
కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి 
ఉమ్మడి ఆంధ్ర ప్రముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి ఎన్నో ఉన్నత విలువలు కలిగిన నాయకుడని రఘు రామ కృష్ణం రాజు ఆయన జయంతి  ని పురస్కరించుకుని నివాళులు అర్పించారు . అలాగే కమ్యూనిస్టు నాయకుడు పుచ్చల పల్లి సుందరయ్య వర్ధంతి  సందర్భంగా ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడరు . పుచ్చలపల్లి సుందరయ్య తన కులాన్ని , కుటుంబ ఆస్తులను నమ్మిన సిద్ధాంతం కోసం త్యాగం చేశారన్నారు .