home page

మాఇంట్లో చిచ్చుకు దుత్తలూరు నాయకుడే కారణం: శేఖర్ రెడ్డి

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి ఆగ్రహం

 | 
శేఖర్ రెడ్డి

మారుతున్న సమీకరణలు

ఉదయగిరి(నెల్లూరు జిల్లా): తమ కుటుంబంలో కొందరు చిచ్చు పెట్టారని నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు. తమకుటుంబం అంతా కలిసినా దీన్ని చల్లార్చుకోలేక చచ్చిపోతున్నామని ఆవేదన చెందారు. ఉదయగిరిలో ఆదివారం జరిగిన స్వయం సహాయక సంఘాల మహిళలకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం చెక్కుల పంపిణీ సభలో ఆయన మాట్లాడుతూ.. తనకు వ్యతిరేకంగా కొందరు పని చేస్తున్నారని, దీనంతటికీ దుత్తలూరుకు చెందిన ఒకాయన కారణమని మండిపడ్డారు. ఇటీవల కాలంలో ఆయనకు వ్యతిరేకంగా ఒక వర్గం వ్యవహరిస్తుండడంతో ఎమ్మెల్యే ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు