home page

వేదాంత ధోరణిలో ధర్మాన

మంత్రి అయ్యాక రాజకీయాలపై ధర్మానకు వైరాగ్యం ఎందుకో

 | 
ధర్మాన

అధికారుల అవినీతి పై ఆవేదన

ధర్మాన ప్రసాదరావు పేరు చెబితే చాలు శాసనసభలో ప్రసంగాలకు పెట్టింది పేరు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షం లో ఉన్నా ధర్మాన ధర్మ పధం వీడలేదు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం లో కీలక పదవులు అలంకరించి వైఎస్ ప్రభుత్వానికి వన్నె తెచ్చిన మంత్రులలో ధర్మాన ప్రసాదరావు పేరు శిఖరాగ్రాన ఉంటుంది. ఇటీవల జరిగిన మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ లో తమ్ముడు కృష్ణ దాస్ బదులుగా రెవెన్యూ శాఖ మంత్రి పదవిని చేపట్టిన ధర్మాన నిన్న,ఈరోజు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ రాజకీయాల నుంచి తప్పుకుని కొత్త వారికి చోటు ఇవ్వాలని భావించానని,అయితే శ్రీ కాకుళం జిల్లాలో ప్రజలు చూపుతున్న ఆదరణ,అభిమానం వల్ల పదవి చేపట్టినట్లు ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు ఆదుకోవడానికి నగదు నేరుగా వారి ఖాతాలకు జమ చేస్తూనే వున్నా రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడిన తీరు తనకు ఆవేదన కలిగిస్తోందని ధర్మాన ఆవేదనాభరితంగా చెప్పారు.