home page

పేదల బువ్వలో బుగ్గి పోస్తారా?

బొబ్బిలి రాజా పులి గర్జన 

 | 
Baby nayana

ఇదెక్కడి చిల్లర రాజకీయాలు 

అర్రతో ఎర్రెత్తిపోయి సిర్రెత్తిపోతే ఎలా!!
***
 పేదల బువ్వలో బుగ్గి పోస్తారా?
*** 
ఇదెక్కడి చిల్లర రాజకీయం
***
అన్నక్యాంటీన్లపై బేబీనాయిన క్లారిటీ
****
మీకు చేతకాని పని మేం చేస్తే చూడలేరా? అర్రతో ఎర్రెక్కిపోతారా... సెండాలంగా.. బాలేదండి.. తీరు మార్చుకోండి.. పదిమంది పేదలు తినే బువ్వలో బుగ్గిపోస్తారా? ఇదెక్కడి అనైతికం... మీకు చేతనైతే మీరూ బువ్వలు పెట్టండి లేదా మేం పెడుతుంటే చూసి పల్లకోండి.. అంతేకాని తినే తిండిలోనూ రాజకీయమా... అని బొబ్బిలి టిడిపి ఇన్చార్జి బేబీనాయన ధ్వజమెత్తారు. తాము పేదలకు ఉచితంగా అన్నం పెడుతుంటే దానిలోనూ
 రాజకీయాలు వెతుకుతున్నారని, దీన్ని సహించేదిలేదని ఆయన ధ్వజమెత్తారు. వాస్త వానికి పదిమంది పేదలు, కూలీలు కార్మికుల కడుపు నింపే అన్న క్యాంటీన్ల మీదా అధికారపార్టీ రాజకీయం చేస్తోంది. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నపుడు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూసేయడమే కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా టిడిపి నాయకులు వీటిని ఏర్పాటు చేసి పేదలకు భోజనం పెడుతున్నా సహించలేని పరిస్థితి. మొన్న మంగళగిరిలో టిడిపి వారు ప్రారంభించిన క్యాం టీన్ను రాత్రికిరాత్రి తొలగించడమే కాకుండా నిర్వాహకులపై కేసులు కూడా పెట్టారు. ఇదే క్రమంలో మొన్న 24న తన జన్మదినం సందర్భంగా బేబీనాయన భారీ ఎత్తున అన్నక్యాంటీన్ ను ప్రారంభించారు. సొంతనిధులతో వాటిని నడుపుతామని ఆయన ప్రకటి౦చినా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, టిడిపి కార్యకర్తలు సైతం తమక తోచినమేరకు ఐదు, పది, ఇరవైవేలు ఇలా విరాళాలు ప్రకటించారు.
 సరిగ్గా ఇదే విషయం బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడికి కంటగింపుగా మారింది. మేం చేయలేని పని టిడిపి వాళ్లు చేయడమా? అలా చేస్తే ఎమ్మెల్యే గా పరువేమవుతుందని భయపడిన ఎమ్మెల్యే ఇక బువ్వలో బుగ్గిపోయడం మొదలె ట్టారు. సొంతంగా క్యాంటీన్ నడుపుతానన్నారు. మళ్లీ ఇప్పుడు విరాళాలు తీసుకోవడం ఏమిటి? ఇదెక్కడి అన్యాయం అంటూ ఏదేదో విమర్శలు చేశారు. దీనికి బేబీనాయన కూడా తీవ్రంగానే బదులిచ్చారు. మీకు చేతకాలేని పని మేం చేస్తున్నాం. పదిమందికీ అన్నం పెడుతున్నాం. ఇందులో రాజకీయం లేదు. అయితే అభిమానులు కూడా ఇందు లో భాగం అవుతామని ముందుకు వస్తూ విరాళాలు ఇస్తున్నారు. కేవలం వారి ఆత్మ స ౦తృప్తికోసం తీసుకుంటున్నాం. ప్రతి రూపాయికీ లెక్క ఉంటుంది. ఏనాడూ మేం ప్రజల సొమ్ముతో పబ్బం గడుపుకోలేదు. మీకు చేతనైతే మీరూ కేంటీన్ నడవండి మేమూ విరాళాలు ఇస్తాం అంటూ రెచ్చగొట్టారు కానీ అది ఎమ్మెల్యే వల్ల అయ్యేపని కాదు. ఈ సందర్భంగా బేబీ నాయన మరో అడుగు ముందుకు వేసి ఇంకా ఎవరైనా విరాళాలు ఇవ్వాలంటే ఇవ్వవచ్చని ఈ బృహత్కార్యంలో భాగం కావచ్చని పిలుపునిన్చారు. ఇప్పటికే ఈ క్యాంటీన్ విషయంలో అర్రతో ఎర్రెక్కిపోతున్న ఎమ్మేల్యే శంబంగి వెంకట చినప్ప లనాయుడు ఈ తాజా పిలుపుతో మరెంత సిర్రెత్తిపోతారో ఏటో.. సూడాలి మరి...