home page

మే 11 నుంచి 17 వరకూ పెంచలకోన బ్రహ్మోత్సవాలు

  భక్తులకుఘనంగా ఏర్పాట్లు    ఆదేశించిన ఎమ్మెల్యే ఆనం

 | 
ఆనం రామనారాయణరెడ్డి

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

*రాపూరు మండల పెంచలకోన లో వెలసియున్న శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో మే 11 నుండి 17 వరకు నిర్వహించనున్న... బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు సంబంధించి నెల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి  ఆధ్వర్యంలో అన్ని ప్రధాన ప్రభుత్వ శాఖాధికారులతో.మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి        కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు.
 ఈ సందర్భంగా వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ .... ప్రత్యేక రక్షణ కోసం ఒక పోలీస్ ఔట్ పోస్ట్ పెంచలకోన లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు

 👉రెవెన్యూ శాఖ ద్వారా సిబ్బందిని సమన్వయపరిచి బ్రహ్మోత్సవాలు విజయవంతానికి చర్యలు

👉 నెల్లూరు, రాపూరు, ఆత్మకూరు, ఉదయగిరి కావలి, గూడూరు, సూళ్లూరుపేట, తిరుపతి, శ్రీ కాళహస్తి, రాజంపేట, కడప, రాయచోటి, ప్రొద్దుటూరు, బద్వేలు, రైల్వే కోడూరు మొదలగు APSRTC డిపోల నుండి పెంచలకోన  బ్రహ్మోత్సవాలకు విచ్చేయు భక్తులకు బస్సుల సౌకర్యము ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

👉రహదారులు మరియు భవనాల శాఖ ద్వారా పెంచలకోనకు వివిధ మార్గంలో ప్రమాద హెచ్చరిక బోర్డులు మరియు రోడ్లకు మరమ్మతులు చేయాలి

👉విద్యుత్ శాఖ ద్వారా - బ్రహ్మోత్సవాలకు వచ్చే లక్షలాదిమంది కోసం
.నిరంతర మంచినీటి సరఫరా, ఎలక్ట్రికల్ డెకరేషన్ నిమిత్తం 24గంటలు 3 ఫేస్ కరెంటు ఉండే విధంగా ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలి..

👉వేసవి తీవ్రత అధికంగా ఉన్నందున భక్తుల ఆరోగ్య రక్షణ నిమిత్తం వైద్యులు అత్యవసర మందుల తో కూడిన ప్రథమ చికిత్స కేంద్రం, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి  108 మరియు 104 అంబులెన్స్ సిద్ధంగా వుంచాలి.. అలాగే గొనుపల్లి మరియు పెంచలకోన లో గల బావులలో క్లోరినేషన్ చేయించాలి..

👉 రెడ్ క్రాస్ ద్వారా అత్యవసర మందులు సిబ్బందితో కూడిన ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు..

👉పంచాయతీరాజ్ శాఖ ద్వారా దేవస్థాన పరిసర ప్రాంతంలో గల చేతిపంపులు అన్నీ పనిచేయు విధముగా మరమ్మతులు చేయిస్తాం..

👉అగ్నిమాపక శాఖ ద్వారా అగ్ని ప్రమాదాలను నివారించే నిమిత్తము తేది 11మే 2022 నుండి 17 మే 2022 వరకు తప్పనిసరిగా ఎల్లప్పుడూ నిల్వ ఉన్న నీటి ట్యాంక్ తో ఒక ఫైర్ ఇంజిన్ ను రెస్క్యూ టీం స్టాండ్బై గా ఏర్పాటు చేయాలి..

👉సమాచార శాఖ ద్వారా  భక్తులు తిలకించేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి..

👉 మరియు ప్రతి రోజు జరుగు కార్యక్రమాలు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రసారం చేసి దేవస్థానము ఖ్యాతిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తెలియజేసెలా వుండాలి..

👉బ్రహ్మోత్సవాలు జరుగు రోజులలో పెంచలకోన పరిసర గ్రామాలలో వైన్ షాపులు గానీ, బెల్ట్ షాపులు గానీ లేకుండా  ఎక్సైజ్ శాఖ కఠినంగా వ్యవహరించాలి...

👉మున్సిపల్ శాఖ ద్వారా వెంకటగిరి మరియు రాపూరు ఎంపిడిఓ వారి ద్వారా శానిటేషన్ నిమిత్తం శానిటరీ సిబ్బందిని, చెత్తను తరలించు వాహనములను పెంచలకోనకు డిప్యుటేషన్ చేసి వారి ద్వారా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలలో భక్తుల రద్దీ వలన ఎక్కువగా ఏర్పడు చెత్తను తొలగించే చర్యలు తీసుకుని మరియు మొబైల్ టాయిలెట్లు  ఏర్పాటు చేయాలి..

👉జలపాతం వద్ద వున్న పురాతన రెవెన్యూ గెస్ట్ హౌజ్ ని పునరుద్ధరించాలని సూచన


👉మే నెల 11 నుంచి 17 వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలి

👉సమన్వయ కమిటీ సమావేశానికి పలువురు అధికారులు గైర్హాజరు పై ఆగ్రహం వ్యక్తం చేసిన  ఆనం

👉పోలీసులతో సమన్వయం చేసుకొని పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులకు ఆదేశం

👉భక్తుల రద్దీని తట్టుకునేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి

👉భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట క్యూలైన్లు,చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలి..

Anam