విశాఖలో త్వరలో బ్రాహ్మణ సమాఖ్య సమావేశం
బ్రాహ్మణులకు సామాజిక న్యాయం చేయాలి
విశాఖలో త్వరలో రాష్ట్రస్థాయి బ్రాహ్మణ సమాఖ్య ఏర్పాటు!
విశాఖపట్నం మే 13
బ్రాహ్మణ సంక్షేమం కోసం అలాగే ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధి చెందేందుకు ప్రత్యేక ప్రణాళికతోఆంధ్రరాష్ట్రంలో నూతన "బ్రాహ్మణసమాఖ్య" ఏర్పాటు చేయనున్నట్లు బ్రాహ్మణ సమాఖ్య ప్రతినిధి వడ్డాది ఉదయ కుమార్ శుక్రవారం మీడియాకుతెలియజేశారు ఈ సందర్భంగా ఉదయ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రంలోబ్రాహ్మణులు ఎంతో వెనుకబడి ఉన్నారని వారిపట్ల ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, బ్రాహ్మణ సంఘాలు కూడా ఉదాసీనంగావ్యవహరించడంతో బ్రాహ్మణుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు.ప్రభుత్వాలు మారినా బ్రాహ్మణ మనుగడ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో బ్రాహ్మణుల కోసం నూతన ఒరవడితో విశాఖలో త్వరలో రాష్ట్రస్థాయి బ్రాహ్మణ సమాఖ్య ఏర్పాటు చేయనున్నట్లు ఉదయ కుమార్ తెలిపారు. బ్రాహ్మణ సమాఖ్య పేరు బ్రాహ్మణ సమాఖ్య విధి విధానాలు, సమైక్య చేపట్టే కార్యక్రమాలుకొద్దిరోజుల్లోనే తెలియజేస్తామని ఉదయకుమార్ వివరించారు.విశాఖలో వేలాదిమందిబ్రాహ్మణుల టు బ్రాహ్మణ పెద్దలతో సమావేశంనిర్వహించనున్నట్లు మీడియాకు తెలియజేశారు.