home page

174 సీట్లపై బిజెపి దృష్టి: ఎంపీ జీవీఎల్

175 నియోజక వర్గాల్లో 5 వేల సదస్సులు
 | 
Bjp
రాష్ట్రంలో కోల్పోయిన 174 సీట్లపై బిజెపి దృష్టి సారిస్తుందని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఈ మేరకు సోమవారం విశాఖ నగరంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మరోసారి బిజెపి ప్రభుత్వం విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ సారి 400 300 పార్లమెంట్ సీట్లు తెచ్చుకోవాలని ప్రణాళిక తో పని చేస్తున్నామన్నామని ఆయన  చెప్పారు ఏపీ లో 175 నియోజక వర్గాల్లో 5 వేల సదస్సు లు నిర్వహించే ప్రణాళికతో ఉన్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో జనసేనతో బిజెపి ప్రజల్లోకి వెళ్తోందని, జనసేన బిజెపిల మధ్య సయోధ్య ఉందని  ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఎన్ని యాత్రలు చేసినా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం లేదన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నయం కోరుకుంటున్నారని, అమరావతి రాష్ట్ర రాజధానిగా బిజెపి నిర్ణయం చేసిందని ఆయన ప్రకటించారు. రాష్ట్రము లో అన్ని జిల్లాలలో  సెక్షన్ 22 ఏ కింద వేలాది కుటుంబాలు ఉన్నాయని, వారిని ఆదుకోవడానికి ప్రత్యేక సెల్ బిజెపి ఆఫీస్ లో ఏర్పాటు చేస్తున్నామని  ఆయన తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ సమస్య పై పోరాటం చేస్తామని, గవర్నర్ దృష్టికి 22 ఏ విషయం తీసుకుని వెళ్తామన్నారు. విశాఖ నగరంలోని కాలుష్యం పై దృష్టి పెట్టామని, విశాఖ భూ ఆక్రమణలపై టిడిపి , వైసీపీ రెండు సిట్ లు వేశాయని,
ఆ రిపోర్ట్ బయట పెట్టడం లేదని  ఆయన అన్నారు.  మధ్య తరగతి వాళ్ళపై ప్రతాపం చూపిస్తున్నారని, భూ కబ్జా దారులు మీద చర్య తీసుకోవడంలేదని  ఆయన తెలిపారు. ఈ విషయంలో టిడిపి, వైసీపీలు కలసి కుమ్మకుఅయినట్టు కనిపిస్తోందని ఎంపీ జీవీఎల్ఆరోపించారు.
బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ వచ్చే వినాయక చవితి తరవాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమన్నారు. సీఎం జగన్ సతి మణి భారతిని ఎప్పుడు విమర్శగా చూడలేదని,భారతి సీఎం ఐతే బాగుంటుందని కామెంట్ చేశానన్నారు. నా మీద ఏ కేసులు లేవని, జగన్మోహన్ రెడ్డి మీద 33 కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. వైసిపి నేత కేకేరాజు కాస్త జాగ్రత్తగా మాట్లాడితే మంచిదన్నారు.అక్కడ ఢిల్లీలో వందల కోట్లు కుంభకోణం జరిగితే, ఆంధ్రలో వేల కోట్లు కుంభకోణం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. మళ్ళీ 2 వేల నోట్లు రద్దు చేస్తే జగన్ ప్రభుత్వం కూలిపోతుందని ఆయన జోష్యం చెప్పారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర కూడా పాల్గొన్నారు.