ఘనంగా అశోక్ గజపతి పుట్టిన రోజు వేడుకలు
భారీ ఎత్తున రక్తదానం
ఘనంగా అశోక్ గజపతి జన్మదినం
***
భారీగా రక్త దానం
***
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గారి 72వ జన్మదినోత్సవాన్ని పార్టీ కార్యకర్తలు, క్యాడర్ ఘనంగా నిర్వహించారు.. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో దాదాపు 475 మంది రక్తదానం చేశారు.
ఇంకా ఆర్టీసీ బస్టాండ్ వద్ద భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఉదయం పార్టీ కార్యాలయం, అశోక్ బంగ్లాలో నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానుల మధ్య చిన్న పిల్లలతో కేక్ కట్ చేయించి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి సునీల గజపతి రాజు, కుమార్తె అదితి గజపతి కూడా పాల్గొన్నారు.
పట్టణంలో ఉన్న చెవిటి మరియు మూగ పాఠశాల విద్యార్థులను దత్తత తీసుకుని వారి పోషణ నిమిత్తం ఒక్కో విద్యార్థికి ఒక సంవత్సరానికి రూ. 6,000 చొప్పున మొత్తలు రూ. 2,30,200/- విరాళాన్ని పార్టీ నాయకులు ఆయా సంస్థలకు అందజేశారు. అశోక్ జన్మదినం సందర్భంగా పార్టీ అధినేత చంద్రబబు నాయుడు ఫోన్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.