home page

నెల్లూరు రాజకీయాల్లో మరో కొత్త వివాదం: ఇరుక్కున వైసిపి

యాదవ్ వర్సెస్ రెడ్డి

రెడ్డి వర్సెస్ ముస్లిం 

 | 
Aziz vs kotamreddy
నెల్లూరు జిల్లాలో రాజకీయ ం రచ్చగా మారింది. రంజాన్ రోజు దువాలోమాజీ మేయర్ అబ్దుల్ అజీజ్‌  రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డిని ఆలింగనం చేసుకోకపోవడంపై జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇప్పటికే మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించిన కొన్ని కేసు డాక్యుమెంట్లు కోర్టు నుంచే చోరీ అయ్యాయి. మాజీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ కి మధ్య గొడవ నడుస్తూంది. ఇప్పుడు మాజీ మేయర్, కోటంరెడ్డి రంజాన్ వ్యవహారం చర్చ కు దారితీస్తుంది.

‌ Aziz

రంజాన్ రోజు శ్రీధర్‌ రెడ్డి ఆలింగనాన్ని నిర్మోహమాటంగా తిరస్కరించారు అజీజ్. ఎందుకు తిరస్కరించారనే అంశంపై ప్రెస్‌మీట్‌ పెట్టి మరి క్లారిటీ ఇచ్చారు.

శ్రీధర్ రెడ్డి దుష్టుడు, దుర్మార్గుడు, ఆడబిడ్డల జీవితాలతో ఆడుకున్నాడని అజీజ్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. శ్రీధర్ రెడ్డి చరిత్ర మొత్తం త్వరలో బయటపెడతా, శ్రీధర్ రెడ్డి 8 కుటుంబాలను సర్వ నాశనం చేశాడంటూ సెన్సెషనల్ కామెంట్స్ చేశారు అజీజ్. ఇస్లాం సాంప్రదాయాల గురించి ఒకరు తనకు చెప్పాల్సిన అవసరం లేదు. తనకు అన్నీ తెలుసంటున్నారు అజీజ్.

ఈ వివాదం ఇప్పుడు నెల్లూరు జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. శ్రీధర్ రెడ్డి ఆలింగనాన్ని నిర్మోహమాటంగా తిరస్కరించిన అజీజ్.. ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేశారు. పూర్తి చరిత్రను త్వరలో బయటపెడతానని చెప్పడం రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. బాధిత కుటుంబాలతోనే వివరాలు చెప్పిస్తానంటున్నారు అజీజ్.