బొబ్బిలి రాజా కటౌట్లకు పాలాభిషేకం: పుట్టిన రోజు సరదా
వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు
Updated: Jun 24, 2022, 22:52 IST
|
హోరెత్తిన వీర బొబ్బిలి!!
కటౌట్లకు క్షీరాభిషేకాలు... వేలల్లో వచ్చిన అభిమానులు
ఘనంగా బేబీనాయిన జన్మదినం
***
అన్న క్యాంటీన్ ప్రారంభం
***
జయహో బేబీనాయన... బొబ్బిలిపులి బేబీనాయన నినాదాలతో బొబ్బిలి కోట హోరెత్తి పోయింది. పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం ఇంకా పలు ప్రాంతాల నుంచి వేలాదిగా త రలివచ్చిన అభిమానులు క్యూలైన్లో నిలబడి బొబ్బిలి సంస్థాన వంశీకుడు, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి శ్వేతాకుమార్ రంగారావు(బేబీనాయన) కు జన్మదిన శుభాకాంక్షలు తె లిపారు. ఇంకా పట్టణంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన భారీ కటౌట్లకు క్షీరాభిషేకం చేశా రు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాల్లో తోడుండే బేబీనాయన అంటే స్థానికులకు ఓ ప్రత్యేక అభిమానం. తమ ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఆయన్ను ఆహ్వానించడం, ఈయన తప్పకుండా వెళ్లి ఆశీర్వదించి రావడం ఓ సంప్రదాయం. మరి అలాంటిది ఆయన పుట్టినరోజంటే ఎలా ఉంటుంది... నియోజకవర్గం మొత్తం పండగరోజున ఉన్నట్లే ఉంటుంది... అలాగే ఉంది కూడా.... మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు సాధారణ ప్రజానీకంతో బొబ్బిలి కోట కిక్కిరిసిపోయింది. రానున్న అ ఎంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగుతారని భావిస్తున్న బేబీనాయన నియోజక వర్గంలోని దాదాపు సగం మంది ఓటర్లను గుర్తుపడతారు. ఆయన వెళ్లని ఊరుకానీ, వ లకరించని కార్యకర్తకానీ లేరనడం అతిశయోక్తి కాదు. ఏదైనా గ్రామానికి రోడ్డు లేదంటే నేరుగా ఆయనే సొంత డబ్బుతో రోడ్డు వేస్తారు. పేదల పిల్లల చదువులకు, ఆస్పత్రి ఖ రులకు కూడా ఆయనే ఆధారం. అందుకే ఆయన మీద ప్రజలు, కార్యకర్తలు కూడా అంత అభిమానం చూపుతారు. ఈ సందర్భంగా సొంత నిధులతో ఆయన, తన సోదరుడు, మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు చేతుల మీదుగా అన్న క్యాంటీన్ ప్రారంభించారు.
ఈ క్యాంటిన్ ద్వారా రోజూ భారీగా భోజనాలను ఏర్పాటు చేస్తారు. వాస్త వానికి విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ఇదే తొలి అన్న క్యాంటిన్ అని చెప్పవచ్చును. ఇప్పటి వరకూ ఏ టీడీపీ నాయకుడు కూడా సొంత నిధులతో క్యాంటిన్ ఏర్పాటు చేయలేదు. తొలిసారిగా బేబీనాయన అన్నకా క్యంటిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజయ్ కృష్ణ రంగారావు మాట్లా డుతూ పేదవాడి నోటివద్దనున్న అన్నం ముద్దను ప్రభుత్వం లాగేసిందని, ఇది అత్యంద దారుణమని అంటూ తాము నిత్యం ప్రజల పక్షాన ఉంటా మని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వందలాదిమంది అన్నక్యాంటీన్లో భోజనాలు చేసి బేబీనాయన్ను విజయీభవ అంటూ ఆశీర్వదించారు.