home page

అన్న పిలుస్తున్నారు,మరెళదాం!

ఆగస్టు 4 నుంచి జగన్ భేటీలో రోజుకు 50 మంది

 | 
Jagan
అన్న పిలుత్తున్నాడు వచ్చియండర్రా !!
***
ఒరేయ్ అన్నయ్యలూ..తమ్ముళ్లూ..పిల్లా మేకా గుంటా గొర్రి.. అందరూ జగర్తగా యినండి. మన అన్నియ్య..అదేరా మన ముఖ్స్య మంత్రి జగనన్నియ్యకు మళ్ళీ మనతో పని పడినట్లుంది.. అందుకే ఆగస్ట్ నాలుగో తేదీ నుంచి మనతోని మాట్లాడతారట రమ్మని కవుర్లు వస్తాయి.. జాగర్తగా ఉండండి.. అందరం అన్నియ్యను చూద్దాం.. పార్టీ కోసం పనిచేద్దాం సరేనా.. గతంలో ఆరేడేళ్ళు అన్న కోసం పనిచేసాం.. మన జీవితంలో అత్యంత విలువైన సమయాన్ని అన్నియ్య కోసం ఖర్చు చేశాం.. అన్న వస్తే మనకు ఏదో చేస్తాడని ఆశపడ్డాం.. కనీసం ఈ మూడేళ్ళలో ఒక్కసారైనా మనతో మాట్లాడతాడాని ఆశపడ్డాం కానీ ముఖ్యమంత్రి అయ్యాక బిజీ కదా అందుకే కుదరలేదు. ఇప్పుడు మళ్లీ సీజన్ కదర్రా అందుకే మళ్ళీ మనం యాదికి వచ్చినామ్ గావాల.. అందుకే మళ్ళీ పిలుస్తున్నారు.. ఇన్నాళ్లూ మనను మర్చిపోయారని కోపం తెచ్చుకోకర్రా..అవన్నీ మళ్ళీ మనసులో పెట్టుకోకండి.. పిలుపురాగానే లాగెత్తుకొని వచ్చియాలి మరి. మళ్ళీ గోర్మెంట్ వస్తే మాకేటి లాభం అని గట్రా అడక్కండి.. మనలాంటోళ్లం పని చేయాలి.. తెలివైన అవకాశవాదులు గట్టుమీద కూర్చుని ఛాన్సులు కొట్టాలి. పని మనది... ఫలితం వాళ్ళది... వంట పని మనది.. విందు భోజనాలు వాళ్ళవి...కోర్టు కేసులు మనవి..ఉజ్జోగాలు..జీతాలు వాళ్ళవి.. తిట్లు మనకు.. అట్లు వాళ్లకు.. ఇవన్నీ మనకు తెలుసు.కానీ జగనన్న, వైఎస్సార్ అనే పేర్లు చాలు కదా మనని ఎర్రెక్కించేస్తాయి.. ఎనకాముందూ చూడకుండా పని చేయిస్తాయ్.. అందుకే మళ్ళీ శక్తి పుంజుకోండి .. మళ్ళీ పరుగెత్తండి.. ముందే చెబుతున్నాను.. పని చేయండి.. ఫలితం దైవాధీనం. మళ్ళీ చెప్తున్నా అన్న పిలిచాడు.. పిలుస్తాడు తప్పకుండా రావాలమ్మా.. గతంలో అంత చేశాం.. ఇంత చేశాం .అనకూడదు. అన్న చెప్పారు మనం చేయాల.మాకు ఏటీ ఇవ్వలేదు అని గట్రా .. ప్రశ్నించిన వారికి ఇక్కడ చోటు లేదు.