home page

కమలనాథుల అమరావతి బాట

జగన్మోహన్ రెడ్డి చూపు విశాఖ వైపు

 | 
AMARAVATHI
ఎవరిగోల వాళ్ళది!!
**
బిజెపి అమరావతి బాట
జగన్ వైజాగ్ రూటు
****
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మెల్లగా వేడెక్కుతున్నాయి. 2024 ఎప్రిల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది.. ఈలోపే రాజకీయపార్టీలు ఎవరి శక్తి మేరకు, ఎవరి ప్లాన్ ప్రకారం వాళ్ళు ఎత్తులు, పై ఎత్తులు వేస్తున్నాయి. గత ఎన్నికల్లో కీలకంగా ఉన్న రాజధాని అంశం ఈసారి కూడా ప్రధాన భూమిక పోషిస్తుందని టిడిపి, బిజెపి భవిస్తుండగా అసలు అమరావతిని ప్రజల మస్తిష్కాల్లోంచి తీసేయాలని, దాని స్థానంలో విశాఖపట్నం ను రాజధాని గా ప్రతిష్టించాలని అధికార వైస్సార్సీపీ భావిస్తోంది. ఇదే క్రమంలో ఈ శ్రావనంలోనే విశాఖ నుంచి పాలన కొనసాగించాలని ముఖ్యమంత్రి జగన్ ప్లాన్ చేస్తుండగా అమరావతికి మద్దతుగా ఈనెల 29 నుంచి రాజధాని గ్రామాల్లో 75 రోజుల పాదయాత్రకు బిజెపి సిద్ధం అవుతోంది. 
ఆగస్ట్ నుంచి వారానికి ఓ మూడురోజులు జగన్ విశాఖలో ఉంటూ పాలనా వ్యవహారాలు చూస్తారని అంటున్నారు. అయితే మరోవైపు
అమరావతినే రాజధానిగా ఉంచి అభివృద్ధి చేయాలని బీజేపీ ఈ పాదయాత్ర సందర్భంగా నినదించనుంది. ఈ నెల 29న ఉండవల్లి వద్ద నుంచి ఈ పాదయాత్ర మొదలుపెడతారు. మొత్తం రాజధాని గ్రామాలన్నీ చుట్టేలా ఈ పాదయాత్రను బీజేపీ నేతలు చేయబోతున్నారు. 
ఇదిలా ఉండగా టిడిపికి మొదటి నుంచి సపోర్ట్ అని భావిస్తున్న అమరావతి రాజధాని అంశాన్ని మళ్ళీ ఆ పార్టీ టేకప్ చేస్తుంది.. మొన్నటి 2019 ఎన్నికల్లో రాజధాని చుట్టుపక్కల చాలా చోట్ల ఓటమి పాలైన టిడిపి మళ్ళీ అక్కడే విజయాన్ని వెతుక్కునే పనిలో పడింది. ఈసారి అక్కడ మంచి ఫలితాలు సాధించే లక్ష్యంతో ముందుకు వెళుతోంది. మొత్తానికి ఏపీ రాజకీయాలు మళ్ళీ అమరావతి చుట్టూరా తిరిగేలా ఉన్నాయి.