home page

కొంతంగిలో కనిపించిన పులి

ఆరా తీస్తున్న అటవీ అధికారులు

 | 
Tiger

ఇవే పులి అడుగుజాడలు 

 కొంతంగిలో పులి సంచారం
 ఇద్దరూ నేరుగా పులిని చూసారు.
 అయినా ఎంతకూ చిక్కని పులి
అది కొంతంగి అటవీ ప్రాంతంలో 
అది రమారమి సాయంత్రం నాలుగు గంటల సమయం … ఇద్దరు వ్యక్తులు వంట చెరకు కోసం అలా పంట పొలాల వైపు వెళ్ళారు… సరిగ్గా అక్కడ అనుకోకుండా పులిని చూసారు … అంతే వారు హతాశులు అయ్యారు … వెంటనే తేరుకుని ఆ ఇద్దరూ వెనుదిరిగి ఊర్లోకి పరిగెత్తు కొచ్చారు. గ్రామస్థులకు తెలిసింది.  విషయం ఊరంతా పాకింది… అటవీ శాఖాధికారులు హుఠహుటిన అక్కడకు చేరుకున్నారు…
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం శంఖవరం మండలం కొంతంగి గ్రామంలో ఈ అరుదైన ఘటన మంగళవారం సంభవించింది. స్థానికులైన సర్నం మల్లయ్య, ఈపు రాంబాబు ద్వయం వంట చెరకు కోసం ఎర్రకొండ సమీపంలోని పొలాల్లోకి వెళ్ళారు. అక్కడ దూరం నుంచే పులిని చూసారు.
ఇక అటవీశాఖాధికారులు వెళ్ళేసరికి పులి రాజా ఆ స్థానం మారిపోయింది. అటవీ శాఖాధికారులు పులి పాదముద్రలను గుర్తించారు. పొలాల్లోని చిన్న చిన్న నీటి గుంటల దగ్గర పులి అడుగులను గుర్తించి, ఆ బెబ్బులి ఆ సమయంలో అక్కడికి దాహార్తిని తీర్చుకోడానికి వచ్చినట్టు భావించారు. ఏదేమైతేనేం యధా ప్రకారం ప్రతీ ఊరులోనూ ప్రజలను అప్రమత్తం చేసినట్టే కొంతంగి గ్రామంలోనూ అప్రమత్తం చేసారు. జాగ్రత్తలు చెప్పి హెచ్చరికలు జారీ చేసారు. పులి రోజుకో ఊరి పరిసరాల్లో సంచరించడం ప్రాంతీయంగా ఉత్కంఠను రేపుతోంది. ఇది ఎంతకూ అడవిలోనికి శాశ్వతంగా వెళ్ళక పోవడం, అటవీ శాఖాధికారులకు బందీ కాకపోడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. దీనివల్ల ఎప్పుడు, ఎవరికి, ఏ ప్రమాదం ముంచు కొస్తుందోననే అబద్రతా భావం సర్వత్రా నెలకొంది.