home page

ఖమ్మంలో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం: పువ్వాడ అజయ్

వెండితెర వేల్పు ఎన్టీఆర్ శతజయంతి 

 | 
Ntr
ఖమ్మంలో ఎన్టీఆర్‌ భారీ విగ్రహం 
***
మంత్రి పువ్వాడ అజయ్ కృషితో లకారంలో ఏర్పాటుకు సన్నాహాలు
***
తెలుగువారి ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసి, కోట్లాది మంది హృదయాల్లో కొలువైన విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు దివంగతులై పాతికేళ్ళు దాటినా ఆయన్ను ప్రజలు ఇంకా తలచుకుంటూనే ఉన్నారు. వివిధ సందర్భాల్లో ఆయన ఖ్యాతిని, ఔన్నత్యాన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయినా ఆయన పట్ల తెలంగాణ నాయకుల్లోనూ, ప్రజాల్లోనూ ఎనలేని అభిమానం, గౌరవం లేశమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలోనే 
ఖమ్మం నగరంలోని లకారం చెరువు నడిబొడ్డున భారీ పరిమాణంలో ఎన్టీయార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఈ చెరువు మీద నిర్మించిన
 తీగల వంతెన మధ్య భాగంలో నందమూరి తారక రామారావు విగ్రహం ఆవిష్కృతం కానుంది. శ్రీకృష్ణుని పోలిన ఎన్టీయార్ చిద్విలాసాన్ని చిందిస్తూ రాజసంతో నిలబడిన 40 అడుగుల విగ్రహం ఏర్పాట్లకు సర్వం సిద్ధమైంది.
Ntr
ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక కృషితో ఎన్టీఆర్‌ అభిమానుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 40 అడుగుల విగ్రహాన్ని రూ.3 కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. లకారం చెరువు మధ్యలో తీగల వంతెన వద్ద ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ విగ్రహాన్ని జూనియర్‌ ఎన్టీఆర్‌ అతి త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇప్పటికే విగ్రహం ఏర్పాటు పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఆయన గతించి దాదాపు 28 ఏళ్ళు గడిచినా తెలుగు ప్రజల్లో ఆయనపట్ల ఉన్న అభిమానం ఏమాత్రం చెక్కుచెదరలేదనేందుకు ఈ విగ్రహ ఏర్పాటే తార్కాణం. ఇటీవల జిల్లాల పునర్విభజన చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ కేంద్రంగా ఏర్పాటైన కొత్త జిల్లాకు ఎన్టీయార్ పేరు పెట్టి ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా చేసింది.. ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను సమున్నతంగా విగ్రహ రూపంలో నిలిపింది